స్టాక్ మార్కెట్లు ఇటీవల భారీగా నష్టపోతున్నాయి. గడిచిన సెషన్‌లో కొన్ని సెక్టార్లలోని స్టాక్‌లను మదుపర్లు, ట్రేడర్లు అధికమొత్తంలో విక్రయించారు. మార్కెట్లు ఇలా పడడానికి గల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. వారి అంచనాల ప్రకారం ఎఫ్‌ఐఐలు భారీగా విక్రయాలకు మొగ్గుచూపుతున్నారు. అమెరికా ఎన్నికల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నోమురా వంటి కొన్ని రేటింగ్ ఏజెన్సీలు భారత ఆర్థిక వృద్ధి రేటుపై పరిమిత కాలానికి సంబంధించి ఆశావాహంగా ఉండడంలేదు.
గడిచిన సెషన్‌లో అమ్మకాలు ఈ విభాగాల్లోనే..
బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్ సూచీలు గడిచిన సెషన్‌లో నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన ధోరణి ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 427 పాయింట్లు నష్టపోయి 80వేల దిగువున 79,942 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 126 పాయింట్లు పతనమై 24,341 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 79,822 – 80,436 శ్రేణిలో కదలాడింది. నిఫ్టీ 24,307 వద్ద కనిష్టాన్ని, 24,498 వద్ద గరిష్టాన్ని తాకింది.
ఇదీ చదవండి: స్క్రీన్‌కు బానిసవుతున్న బాల్యం
డిమాండ్ ఉన్న సెక్టార్లు
సర్వీసెస్, ఇండ్రస్టియల్, ఎఫ్‌ఎంసీజీ, కమోడిటీస్, టెలికం షేర్లకు డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా చిన్న కంపెనీల షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ సూచీ ఒకటిన్నర శాతం పెరిగింది. గోదావరి బయోరిఫైనరీస్ లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర (రూ.352తో) పోలిస్తే 12% డిస్కౌంట్‌తో రూ.310 వద్ద లిస్టియ్యింది. చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో కొంత కోలుకొని 3% నష్టంతో రూ.343 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment