shares business
-
అధికంగా విక్రయించిన స్టాక్‌లు ఇవే..
స్టాక్ మార్కెట్లు ఇటీవల భారీగా నష్టపోతున్నాయి. గడిచిన సెషన్లో కొన్ని సెక్టార్లలోని స్టాక్లను మదుపర్లు, ట్రేడర్లు అధికమొత్తంలో విక్రయించారు. మార్కెట్లు ఇలా పడడానికి గల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. వారి అంచనాల ప్రకారం ఎఫ్ఐఐలు భారీగా విక్రయాలకు మొగ్గుచూపుతున్నారు. అమెరికా ఎన్నికల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నోమురా వంటి కొన్ని రేటింగ్ ఏజెన్సీలు భారత ఆర్థిక వృద్ధి రేటుపై పరిమిత కాలానికి సంబంధించి ఆశావాహంగా ఉండడంలేదు.గడిచిన సెషన్లో అమ్మకాలు ఈ విభాగాల్లోనే..బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్ సూచీలు గడిచిన సెషన్లో నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన ధోరణి ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 427 పాయింట్లు నష్టపోయి 80వేల దిగువున 79,942 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 126 పాయింట్లు పతనమై 24,341 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 79,822 – 80,436 శ్రేణిలో కదలాడింది. నిఫ్టీ 24,307 వద్ద కనిష్టాన్ని, 24,498 వద్ద గరిష్టాన్ని తాకింది.ఇదీ చదవండి: స్క్రీన్కు బానిసవుతున్న బాల్యండిమాండ్ ఉన్న సెక్టార్లుసర్వీసెస్, ఇండ్రస్టియల్, ఎఫ్ఎంసీజీ, కమోడిటీస్, టెలికం షేర్లకు డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా చిన్న కంపెనీల షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ ఒకటిన్నర శాతం పెరిగింది. గోదావరి బయోరిఫైనరీస్ లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.352తో) పోలిస్తే 12% డిస్కౌంట్‌తో రూ.310 వద్ద లిస్టియ్యింది. చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో కొంత కోలుకొని 3% నష్టంతో రూ.343 వద్ద ముగిసింది. -
స్టాక్స్ కొనడానికి అదే బెస్ట్ టైం..!
-
అన్ని కోట్ల డబ్బంతా అదానీదేనా.. రాహుల్ సంచలన ఆరోపణలు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై వేదికగా దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నేడు, రేపు ఇండియా కూటమి సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి కూటమి నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, ఖర్గే, కేజ్రీవాల్ సహా ముఖ్య నేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కేంద్రంపై సంచలన ఆరోపణలు చేశారు. ముంబై మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అదానీ గ్రూప్‌పై ఓసీసీఆర్ ఇచ్చిన రిపోర్ట్‌ని ప్రస్తావిస్తూ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. అదానీ గ్రూప్ అక్రమాలపై పలు పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. పెట్టుబడులతో అదానీ గ్రూపు షేర్ల ధరలు కృత్రిమంగా పెంచారు. షేర్ల పెరుగుదలతో వచ్చిన సొమ్ముతో అదానీ ఎన్నో ఆస్తులు కొన్నారు. అదానీ పోర్టులు, ఎయిర్ పోర్టులు కొనుగోలు చేశారు. ఈ డబ్బంతా ఎవరిది.. అదానీదేనా? అని ప్రశ్నించారు. ఆ డబ్బు అదానిదేనా.. వందల కోట్ల డాలర్లు భారత్ నుంచి వెళ్లిపోయాయని, అవి మళ్లీ తిరిగి షెల్ పెట్టుబడుల్లాగా వచ్చాయని సంచలన కామెంట్స్ చేశారు. నాసర్ అలీ, ఛాంగ్ చుంగ్ లింగ్‌దీని వెనుక ఉన్నట్టు కథనాలు వచ్చాయి. ఆ డబ్బు అదానీదేనా.. ఇంకా దీని వెనక ఎవరైనా ఉన్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ రిపోర్ట్లు మన దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నాయన్నారు. ఈ వ్యవహారం వెనుక వినోద్ అదానీ ఉన్నట్లు కథనాలు వచ్చాయని తెలిపారు. #WATCH | "...It is very important that the Prime Minister of India Mr Narendra Modi clears his name and categorically explains what is going on. At the very least, A JPC should be allowed and a thorough investigation should take place. I don't understand why the PM is not forcing… pic.twitter.com/nMQiIpH9FW — ANI (@ANI) August 31, 2023 మోదీ ఎందుకు స్పందించట్లేదు.. అదానీ గ్రూప్‌పై ఓసీసీఆర్ రిపోర్టు వచ్చిందని, దర్యాప్తు జరిపించేందుకు ప్రధాని ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. అదానీ గ్రూప్ షేర్లు పెంచేందుకు ఈ స్కామ్ చేశారన్నారు. జేపీసీ వేసి దీనిపై దర్యాప్తు చేయించాలని కోరారు. దీనిపై గౌతమ్ అదానీ పాత్ర ఎంటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై జేపీసీతో విచారణకు ఎందుకు అనుమతించడంలేదు. విచారణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు చొరవ తీసుకోవడంలేదన్నారు. ఈ కుంభకోణానికి పాల్పడిన వాళ్లను జైళ్లో ఎందుకు పెట్టడంలేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. జీ-20లో ఏం చెబుతారు.. దేశంలో త్వరలో ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మక జీ-20 సమావేశం జరగబోతోంది. ఆ కీలక సమావేశంలో అదానీ గ్రూప్‌పై విదేశీ నేతలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతాం? అని కామెంట్స్ చేశారు. ఈ అదానీ గ్రూప్.. ఎందుకు అంత ప్రత్యేక సంస్థగా మారిందని ప్రశ్నించారు. దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. #WATCH | In Mumbai, Congress MP Rahul Gandhi raises the Adani Group row. He says, "What is amazing to me is that the gentleman who has done the investigation is today an employee of Mr Adani. What does that tell you about the nature of the investigation that the gentleman did?… pic.twitter.com/mp5aJbNcu9 — ANI (@ANI) August 31, 2023 ఇదే క్రమంలో కేంద్రం అనూహ్యంగా తీసుకున్న పార్లమెంట్ ప్రత్యక సమావేశాలపై కూడా రాహుల్ స్పందించారు. ఇండియా కూటమికి భయపడే కేంద్రం సమావేశాలు పెట్టిందని సెటైర్లు వేశారు. #WATCH | On Special Session of Parliament, Congress MP Rahul Gandhi says, "I think maybe it is an indicator of a little panic. Same type of panic that happened when I spoke in Parliament House, panic that suddenly made them revoke my Parliament membership. So, I think it is panic… pic.twitter.com/Qr9iFVcJWu — ANI (@ANI) August 31, 2023 ఇది కూడా చదవండి: జమ్ములో ఏ క్షణమైనా ఎన్నికల నిర్వహణకు సిద్ధం: కేంద్రం -
‘నేను తీసుకున్న ఇంటి రుణాన్ని ఇలా చెల్లించవచ్చా’?
గ్రాట్యుటీతో గృహ రుణం తీర్చేయడం సరైనదేనా? నాకు గృహ రుణం ఉంది. మరో 5 ఏళ్లకు ఇది పూర్తవుతుంది. గ్రాట్యుటీ రూపంలో పెద్ద మొత్తంలో రానుంది. ఈ గ్రాట్యుటీతో గృహ రుణాన్ని తీర్చివేయాలా లేక ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవాలా? –క్రిష్ రుణాలలో గృహరుణం ఒక్క దానిని కొనసాగించుకోవచ్చు. అధిక వడ్డీ రేటు ఉండే ఇతర రుణాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ ఇతర రుణాలు తీసుకుని ఉంటే, అప్పుడు వాటిని ముందుగా తీర్చేయడాన్ని పరిశీలించొచ్చు. గృహ రుణం కొనసాగించడం వల్ల నష్టం లేదనడానికి పలు కారణాలు ఉన్నాయి. ఒకటి అద్దె రూపంలో కొంత ఆదా చేస్తుంటారు. రుణంపై వడ్డీ చెల్లింపులకు పన్ను ప్రయోజనం ఉంది. పైగా చాలా తక్కువ రేటుకు వచ్చే రుణం ఇది. గృహ రుణం రేటుతో పోలిస్తే పెట్టుబడులపై దీర్ఘకాలంలో అధిక రాబడి వస్తుంది. కనుక గృహ రుణం లాభదాయకమే. భవిష్యత్తులో వచ్చే ఆదాయం గురించి ఆందోళన చెందుతుంటే లేదా గృహ రుణం చెల్లించడం ద్వారా ప్రశాంతంగా ఉంటానని అనుకుంటే గ్రాట్యుటీ ద్వారా వచ్చే మొత్తంతో ఆ పనిచేయవచ్చు. అలా కాకుండా గృహ రుణాన్ని భారంగా భావించకపోతే, భవిష్యత్తు ఆదాయంపై నమ్మకం ఉంటే గృహ రుణాన్ని కొనసాగించుకోవచ్చు. అంతర్గతంగా ఎంతో విలువ దాగి ఉన్న స్టాక్స్‌ను గుర్తించడం ఎలా?– కపిల్ వాస్తవ విలువ కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్న (అండర్ వ్యాల్యూడ్) స్టాక్‌ను గుర్తించం అన్నది ఆర్ట్, సైన్స్‌తో కూడుకున్నది. డిస్కౌంటింగ్ సూత్రాన్ని ఇక్కడ అమలు చేసి చూడాల్సి ఉంటుంది. అంటే వచ్చే ఐదు, పదేళ్ల కాలంలో కంపెనీ ఆదాయాలు ఏ మేరకు వృద్ధి చెందుతాయో చూడాలి. అలాగే, యాజమాన్యం ఎంత ఉత్తమమైనది? అన్నది కూడా చూడాలి. కంపెనీ నుంచి నిధులను మింగేస్తారా? విశ్వసనీయత కలిగిన వారేనా? అలాగే, ఆ కంపెనీ పనిచేస్తున్న రంగంలో మంచి వృద్ధికి అవకాశం ఉందా? భవిష్యత్తు ఉన్నదేనా? అవకాశాలను అనుకూలంగా మార్చుకోగలదా? వీటిని విశ్లేషించుకోవాలి. అలాగే, మీకు మంచిగా కనిపించిన కంపెనీల గురించి ఎన్నో ప్రతికూల వ్యాఖ్యానాలు వినిపిస్తుంటాయి. వాటన్నింటినీ తట్టుకుని పెట్టుబడులను కొనసాగించే బలం కూడా కావాలి. చదవండి👉 ధర ఎంతైనా తగ్గేదేలే..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియా ఇళ్లే కావాలి! -
మ్యూచువల్ ఫండ్స్ మురిపిస్తున్నాయ్..పెట్టుబడులు పెరుగుతున్నాయ్!
న్యూఢిల్లీ: ఈక్విటీల పట్ల ఇన్వెస్టర్లలో విశ్వాసం మరింత అధికమైంది. ఇందుకు నిదర్శనంగా మార్చి నెలలో రూ.28,463 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఒక నెలలో వచ్చిన గరిష్ట పెట్టుబడులు ఇవి. మార్కెట్ దిద్దుబాటు నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు రిటైల్, హెచ్ఎన్ఐ (అధిక నెట్‌వర్త్ ఉన్నవారు) ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిన ఫలితమే ఇదని విశ్లేషకులు అంటున్నారు. ఇక వరుసగా 13వ నెలలోనూ ఈక్విటీ ఫండ్స్‌లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.19,705 కోట్లుగా ఉంటే, జనవరిలో రూ.14,888 కోట్లు, 2021 డిసెంబర్లో రూ.25,077 కోట్ల చొప్పున వచ్చాయి. మార్చి నెలకు సంబంధించిన గణంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. మరింత వివరంగా గణాంకాలు.. ► 2021–22 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఈక్విటీ పథకాలు రూ.1,64,399 కోట్ల భారీ పెట్టుబడులు ఆకర్షించడం విశేషం. ఎందుకంటే అంతకుముందు సంవత్సరం 2020–21లో రూ.25,966 కోట్లు నికరంగా బయటకు వెళ్లిపోయాయి. ఈక్విటీ పెట్టుబడుల పట్ల మారిన ఇన్వెస్టర్ల వైఖరిని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ► ఈక్విటీ పథకాలు 2021 మార్చి నుంచి నికరంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. కరోనా రెండో విడత మార్కెట్లలో కరెక్షన్కు దారితీసింది. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గు చూపించారు. దీనికంటే ముందు 2020 జూలై నుంచి 2021 ఫిబ్రవరి వరకు ఎనిమిది నెలల కాలంలో ఈక్విటీ పథకాల నుంచి నికరంగా రూ.46,791 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ► ఈక్విటీల్లో దాదాపు అన్ని రకాల పథకాలు మార్చి మాసంలో నికరంగా పెట్టుబడులు ఆకర్షించాయి. అత్యధికంగా మల్టీక్యాప్ కేటగిరీ పథకాల్లోకి రూ.9,695 కోట్లు వచ్చాయి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్తగా మల్టీక్యాప్ ఫండ్‌ను ప్రారంభించి రూ.8,170 కోట్లను ఆకర్షించడం అధిక పెట్టుబడుల రాకకు కలిసొచ్చింది. ► లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్, లార్జ్‌క్యాప్ ఫండ్స్ విభాగాలు ఒక్కోటీ రూ.3,000 కోట్లకు పైనే ఆకర్షించాయి. ► ఈటీఎఫ్ పథకాల్లోకి ఫిబ్రవరిలో రూ.10,719 కోట్లు వస్తే, మార్చిలో రాక రూ.6,907 కోట్లకు పరిమితమయ్యాయి. ఇండెక్స్, ఈటీఎఫ్ విభాగాలు రెండింటిలోకి కలిపి రూ.19,219 కోట్లు వచ్చాయి. ► డెట్ విభాగం నుంచి నికరంగా రూ.1.15లక్షల కోట్లు బయటకు వెళ్లాయి. ఫిబ్రవరిలో రూ.8,274 కోట్లు నికరంగా ఈ విభాగంలోకి వచ్చాయి. ► లిక్విడ్ ఫండ్స్‌లోకి మార్చి నెలలో రూ.44,604 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫిబ్రవరిలో ఈ మొత్తం రూ.40,273 కోట్లుగా ఉన్నాయి. ► క్రెడిట్ రిస్క్ పథకాలు రూ.399 కోట్లను ఆకర్షించాయి. ఫిబ్రవరిలో వీటి నుంచి ఇన్వెస్టర్లు నికరంగా రూ.388 కోట్లను ఉపసంహరించుకోవడం గమనార్హం. ► మొత్తం మీద మ్యూచువల్ పండ్ పరిశ్రమ నుంచి మార్చిలో రూ.69,883 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. అంతకు ముందు నెలలో నికర పెట్టుబడి రాక రూ.31,533 కోట్లుగా ఉంది. ► అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) విలువ ఫిబ్రవరి చివరికి ఉన్న రూ.38.56 లక్షల కోట్ల నుంచి మార్చి చివరికి రూ.37.7 లక్షల కోట్లకు తగ్గింది. సిప్ పెట్టుబడులూ ఆల్‌టైమ్ గరిష్టం సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలోనూ భారీగా రూ.12,328 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది కూడా నెలవారీగా అత్యధిక పెట్టుబడులు కావడం గమనార్హం. ప్రస్తుత అనిశ్చితుల్లోనూ సిస్ పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరడం ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని ప్రతిఫలిస్తోందని నిపుణులు అంటున్నారు. రిస్క్ తీసుకునే ధోరణి పెరిగింది.. ‘‘రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం మార్కెట్లలో అనిశ్చితులకు దారితీసింది. దీంతో అధిక కేటాయింపులు చేసుకునేందుకు, ప్రస్తుత పెట్టుబడుల్లో మార్పులు చేసుకునేందుకు దీన్ని ఇన్వెస్టర్లు సానుకూలంగా తీసుకున్నారు. ఈక్విటీల్లో రిస్క్ ధోరణి గరిష్టానికి చేరింది. ఇది మార్కెట్లకు, ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో మంచిది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది తెలిపారు. ‘‘చమురు ధరలు పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఫిబ్రవరి చివర, మార్చి మొదట్లో మార్కెట్లో కరెక్షన్ వచ్చింది. దీంతో ఈక్విటీలకు కేటాయింపులు చేసుకునేందుకు ఇన్వెస్టర్ల అవకాశం ఏర్పడింది’’అని మార్నింగ్‌స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
మార్కెట్ల కరెక్షన్- జున్‌జున్‌వాలాకు షాక్
గత ఆరు రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్లు కరెక్షన్ బాటలో సాగుతున్నాయి. తాజాగా సెన్సెక్స్ 700 పాయింట్లు పడిపోగా.. నిఫ్టీ 200 పాయింట్లకుపైగా కోల్పొయింది. వెరసి గత ఆరు రోజుల్లో ప్రామాణిక ఇండెక్సులు సగటున 6 శాతం స్థాయిలో నీరసించగా.. సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోలోని కొన్ని షేర్లు ఇంతకంటే అధికంగా పతనమయ్యాయి. వివరాలు చూద్దాం.. జాబితా ఇలా రాకేష్ ఫేవరెట్లుగా భావించే పలు కంపెనీల షేర్లు ఇటీవల అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జాబితాలో ఎడిల్వీజ్, డిష్మన్ కార్బొజెన్, ఎస్కార్ట్స్ తదితరాలున్నాయి. ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో రాకేష్‌కు 1.19 శాతం వాటా ఉంది. తాజాగా ఈ షేరు 5 శాతం పతనమై రూ. 56ను తాకింది. వెరసి ఈ నెల 16 నుంచి చూస్తే 24 శాతం క్షీణించింది. ఇతర కౌంటర్లలో జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోలోని ఇతర కౌంటర్లలో డిష్మన్ కార్బోజెన్ అమిక్స్ 18 శాతం నష్టపోయింది. ఈ కంపెనీలో 3.18 శాతం వాటాను రాకేష్ కలిగి ఉన్నారు. ఇదే విధంగా 6.48 శాతం వాటా కలిగిన ఆటోలైన్ ఇండస్ట్రీస్ గత ఆరు రోజుల్లో 17 శాతం తిరోగమించింది. ఇక కరూర్ వైశ్యా బ్యాంక్ కౌంటర్ అయితే వరుసగా 8వ రోజూ డీలా పడింది. 14 శాతం క్షీణించింది. ఈ బాటలో ప్రకాష్ ఇండస్ట్రీస్, వీఐపీ ఇండస్ట్రీస్, జీఎంఆర్ ఇన్ఫ్రా, మంధన రిటైల్, అయాన్ ఎక్స్ఛేంజ్, ఇండియన్ హోటల్స్, ఫెడరల్ బ్యాంక్ కౌంటర్లు సైతం 10 శాతంపైగా నష్టపోవడం గమనార్హం! ఫేవరెట్లు వీక్ రాకేష్‌కు ఇష్టమైన టైటన్ కంపెనీ షేరు గత ఆరు రోజుల్లో 7 శాతం వెనకడుగు వేసింది. ఈ టాటా గ్రూప్ కంపెనీలో రాకేష్‌కు రూ. 5,000 కోట్లు విలువ చేసే పెట్టుబడులున్నాయి. ఇక రూ. 1,000 కోట్ల విలువైన వాటా కలిగిన ఎస్కార్ట్స్ 5 శాతం నీరసించింది. ఇదేవిధంగా క్రిసిల్, లుపిన్ 3 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. -
వేల్యూ- వాల్యూమ్స్‌తో చిన్న షేర్ల జోరు
కోవిడ్-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ తొలి దశలో సత్ఫలితాలు ఇచ్చిందన్న వార్తలతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి.మధ్యాహ్నం 2 కల్లా సెన్సెక్స్ 246 పాయింట్లు పెరిగి 30,275కు చేరగా.. నిఫ్టీ 77 పాయింట్లు పుంజుకుని 8,900 వద్ద ట్రేడవుతోంది.మోడర్నా ఇంక్ రూపొందిస్తున్న వ్యాక్సిన్ తొలి దశ పరీక్షలు విజయవంతమైన వార్తలతో సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం జోరందుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో గ్రాన్యూల్స్ ఇండియా, ఐనాక్స్ లీజర్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, ఏషియన్ హోటల్స్, జెన్ టెక్నాలజీస్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. గ్రాన్యూల్స్ ఇండియా ఎన్ఎస్ఈలో ఈ ఫార్మా రంగ షేరు 5.5 శాతం జంప్‌చేసి రూ. 164 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 169కు ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 95,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 1.22 లక్షల షేర్లు చేతులు మారాయి. ఐనాక్స్ లీజర్ ఎన్ఎస్ఈలో మల్టీప్లెక్స్ రంగ ఈ షేరు 5 శాతం పెరిగి రూ. 173 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 182కు ఎగసింది.అంతేకాకుండా రూ. 159 దిగువన 52 వారాల కనిష్టాన్ని సైతం తాకింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 29,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 1.33 లక్షల షేర్లు చేతులు మారాయి. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఎన్ఎస్ఈలో ఎన్బీఎఫ్సీ రంగ ఈ షేరు 2 శాతం బలపడి రూ. 588 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 621కు ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2.69 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 1.5 లక్షల షేర్లు చేతులు మారాయి. ఏషియన్ హోటల్స్(ఈస్ట్) ఎన్ఎస్ఈలో ఆతిధ్య రంగ ఈ షేరు 6 శాతం పురోగమించి రూ. 136 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 151కు ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 39000 షేర్లు చేతులు మారాయి. జెన్ టెక్నాలజీస్ ఎన్ఎస్ఈలో రక్షణ రంగ పరికరాల తయారీ ఈ కంపెనీ షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 40 వద్ద ట్రేడవుతోంది. కొనేవాళ్లు అధికంకావడంతో అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 5500 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 27000 షేర్లు చేతులు మారాయి. -
విదేశాల్లో నేరుగా లిస్టింగ్..
న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు విదేశీ ఎక్సే్చంజీల్లో నేరుగా లిస్టయ్యే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇందుకు అనుగుణంగా కంపెనీల చట్టం, 2013కి సవరణలు చేయనుంది. మరోవైపు, ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో ప్రవాస భారతీయులు (ఎన్నారై) 100 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అనుమతులివ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం కొన్ని భారతీయ సంస్థల షేర్లు విదేశీ ఎక్సే్చంజీల్లో ట్రేడవుతున్నప్పటికీ.. అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్), గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) రూపంలో లిస్టయి ఉంటున్నాయి. నేరుగా విదేశాల్లో లిస్టింగ్ అవకాశం లభించిన పక్షంలో ఆయా సంస్థలు విస్తృత స్థాయిలో నిధులు సమీకరించుకునేందుకు మరిన్ని మార్గాలు లభించడంతో పాటు.. దేశంలోకి మరింతగా పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉండగలదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. దేశీ లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలు కూడా విదేశాల్లో లిస్టయ్యేందుకు వెసులుబాటునిచ్చేలా కంపెనీల చట్టంలో తగు మార్పులు చేయనున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ తెలిపారు. ఇది పూర్తిగా అమల్లోకి వచ్చేందుకు కొన్ని నెలలు పడుతుందని.. త్వరలో నియమ, నిబంధనలను నోటిఫై చేస్తామన్నారు. అటు కంపెనీల చట్టంలో 72 సవరణలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జైలు శిక్షల్లాంటి క్రిమినల్ చర్యల నిబంధనలను తొలగిస్తామని, పెనాల్టీల పరిమాణాన్ని కూడా తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎయిరిండియాలో 49%గానే విదేశీ ఎయిర్‌లైన్స్ వాటాలు.. భారీ రుణాలు, నష్టాల భారంతో అమ్మకానికి వచ్చిన ఎయిరిండియాలో ఎన్నారైల పెట్టుబడుల పరిమితిని 100%కి పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో విదేశీ ఎయిర్‌లైన్స్ సహా ఇతరత్రా విదేశీ సంస్థలు.. ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎయిరిండియాలో 49%కి మించి వాటాలు కొనుగోలు చేయడానికి ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. తద్వారా ఎయిరిండియా నియంత్రణాధికారాలు భారతీయుల చేతుల్లోనే ఉండేలా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్‌లో ఇతరత్రా ప్యాసింజర్ ఎయిర్‌లైన్స్‌లో ఎన్నారైలు ఆటోమేటిక్ పద్ధతిలో 100% వాటాలు కొనుగోలు చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ.. ఎయిరిండియాలో మాత్రం 49%కి మాత్రమే అనుమతులు న్నాయి. ఎయిరిండియా విషయంలో ఇదొక మైలురాయిలాంటి నిర్ణయంగా జవదేకర్ చెప్పారు. కంపెనీ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లినా.. ప్రయాణికులకు యథాప్రకారం మెరుగైన సేవలు అందిస్తుందని, పెట్టుబడి అవకాశాలు పెంచుకోగలదని ఆయన తెలిపారు. ఏప్రిల్ నుంచి బ్యాంకుల విలీనం అమల్లోకి.. ప్రభుత్వ రంగంలోని 10 బ్యాంకులను నాలుగు కింద విలీనం చేసే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. భారీ స్థాయికి చేరడం ద్వారా మెగా బ్యాంకులు.. ఇటు దేశీయంగాను, అటు అంతర్జాతీయంగాను మరింతగా పోటీపడగలవని, వ్యయాలు తగ్గించుకోగలవని ఆమె పేర్కొన్నారు. విలీనంతో ప్రభుత్వ రంగంలో ఏడు భారీ బ్యాంకులు, అయిదు చిన్న స్థాయి బ్యాంకులు మిగలనున్నాయి. కన్సాలిడేషన్ ప్రణాళిక ప్రకారం ఆంధ్రా బ్యాంకు.. కార్పొరేషన్ బ్యాంకును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయనున్నారు. అలాగే, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ .. యునైటెడ్ బ్యాంక్‌ను పంజాబ్ నేషనల్ బ్యాంకులో, సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకులో, అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకులో కలపనున్నారు. -
ఆకర్షణీయంగా మిడ్‌క్యాప్ షేర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చౌక వేల్యుయేషన్స్‌కు లభిస్తున్న మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు .. ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆకర్షణీయంగా ఉన్నాయని టాటా అసెట్ మేనేజ్మెంట్ ఫండ్ మేనేజర్ శైలేష్ జైన్ తెలిపారు. గతంలో భారీ ప్రీమియం పలికిన ఈ స్టాక్స్.. ప్రస్తుతం లార్జ్‌క్యాప్ షేర్లతో పోలిస్తే 10 శాతం పైగా డిస్కౌంట్‌తో లభిస్తున్నాయన్నారు. కార్పొరేట్ల ఆదాయాల వృద్ధి 10 శాతం పైగా నమోదు కావొచ్చని, జూన్ త్రైమాసికం నుంచి మార్కెట్ పరిస్థితులు మరింత సానుకూలంగా ఉండవచ్చని జైన్ చెప్పారు. రంగాలవారీగా చూస్తే కార్పొరేట్ బ్యాంకులు, టెలికం వంటివి ఆకర్షణీయంగా బుధవారమిక్కడ విలేకరులకు తెలిపారు. క్వాంట్ ఫండ్..: ఈ సందర్భంగా టాటా క్వాంట్ ఫండ్ వివరాలను జైన్ వెల్లడించారు. జనవరి 3న ప్రారంభమైన ఈ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకం 17న ముగియనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి సాంకేతికతల ఆధారంగా ఈ స్కీమ్‌లో పెట్టుబడి విధానం ఉంటుందని జైన్ చెప్పారు. మెరుగైన రాబడులు ఇచ్చేందుకు, రిస్కులను తగ్గించేందుకు ఇది గణనీయంగా తోడ్పడగలదని పేర్కొన్నారు. -
షేర్ల వ్యాపారానికి స్టాక్ బ్రోకర్!
స్టాక్ ఎక్స్ఛేంజ్, బులియన్ మార్కెట్, షేర్లు, సెన్సెక్స్, నిఫ్టీ.. ఇవి మనం తరచుగా వినే పదాలు. సంప్రదాయ పొదుపు పథకాల కంటే షేర్లలో పెట్టుబడులతో అధిక రాబడి ఉంటుందని ఆర్థిక నిపుణులు సలహాలు ఇస్తుంటారు. అయితే, షేర్లు, అందులో పెట్టుబడులపై చాలామందికి ఏమాత్రం అవగాహన ఉండదు. షేర్ల ఫలాలు పొందాలనుకునే క్లయింట్ల తరఫున ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి స్టాక్ బ్రోకర్లు ఉంటారు. ప్రపంచంలో ధనం చెలామణిలో ఉన్నంతకాలం స్టాక్ బ్రోకర్లకు చేతినిండా పని, మంచి ఆదాయం లభిస్తాయని నిపుణులు అంటున్నారు. పేరు ప్రఖ్యాతలు, ఆదాయం, అవకాశాలు: స్టాక్ బ్రోకర్లు తమ క్లయింట్లకు సురక్షితమైన పెట్టుబడి పథకాలను సూచించాల్సి ఉంటుంది. వారి తరఫున షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా పథకాల్లో పెట్టుబడులు పెట్టాలి. షేర్ల కొనుగోలు, అమ్మకం వంటి కార్యకలాపాలు స్వయంగా చేపట్టాలి. ఈ వ్యవహారాలను నిర్వహించినందుకు క్లయింట్ల నుంచి ఆకర్షణీయమైన కమీషన్ పొందొచ్చు. స్టాక్ బ్రోకర్లు తమ పనితీరుతో క్లయింట్లకు లాభాలను ఆర్జించి పెడితే పేరుప్రఖ్యాతలు వస్తాయి. అవకాశాలు, ఆదాయం పెరుగుతాయి. తాజా గ్రాడ్యుయేట్లు/పోస్టు గ్రాడ్యుయేట్లకు స్టాక్ బ్రోకరేజీ సంస్థల్లో అసిస్టెంట్ రిలేషన్షిప్ మేనేజర్/రిలేషన్షిప్ మేనేజర్‌గా కొలువులు అందుబాటులో ఉన్నాయి. బ్రోకరేజీ కంపెనీలో సబ్-బ్రోకర్, ఫ్రాంచైజీగా కూడా చేరొచ్చు. కావాల్సిన నైపుణ్యాలు: స్టాక్ బ్రోకర్‌కు మార్కెట్ పల్స్‌ను సరిగ్గా గుర్తించే నేర్పు ఉండాలి. ఆర్థిక లావాదేవీల్లో నమ్మకం ప్రధానం. క్లయింట్ల మనోభావాలు దెబ్బతినకుండా, మార్కెట్లో కంపెనీ స్థానం దిగ జారకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. స్టాక్ బ్రోకర్ పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే క్లయింట్ల జీవితాలు తారుమారవుతాయి. కాబట్టి విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా సదా అప్రమత్తంగా ఉండాలి. ఈ వృత్తిలో ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. అర్హతలు: మన దేశంలో బ్రోకరేజీ సంస్థలు ఎంబీఏ (ఫైనాన్స్) కోర్సు చదివినవారిని అసిస్టెంట్ రిలేషన్షిప్ మేనేజర్, రిలేషన్షిప్ మేనేజర్‌గా నియమించుకుంటున్నాయి. కాబట్టి ఈ కోర్సు పూర్తిచేస్తే స్టాక్ బ్రోకర్‌గా స్థిరపడొచ్చు. దీంతోపాటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ చేస్తున్న ఫైనాన్షియల్ మార్కెట్స్ సర్టిఫికేషన్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ చేస్తున్న డెరివేటివ్ ఎక్స్ఛేంజ్ సర్టిఫికేషన్ కూడా పూర్తిచేస్తే అర్హతలను పెంచుకొని, మంచి అవకాశాలను అందుకోవచ్చు. వేతనాలు: స్టాక్ బ్రోకర్లకు పనితీరును బట్టి ఆదాయం చేతికందుతుంది. ఎంబీఏ(ఫైనాన్స్) కోర్సు చేసిన రిలేషన్షిప్ మేనేజర్ సంవత్సరానికి రూ.2.4 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. నాన్-ఫైనాన్స్ రిలేషన్షిప్ మేనేజర్‌కు ఇంతకంటే కొంత తక్కువ ఆదాయం లభిస్తుంది. సంస్థ పరిధిని బట్టి ఇందులో మార్పులుంటాయి. రిలేషన్షిప్ మేనేజర్‌గా కెరీర్‌ను ప్రారంభించినవారు మెరుగైన పనితీరుతో టీమ్ లీడర్, జోనల్ మేనేజర్‌గా పదోన్నతులు పొందొచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: బీఎస్ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్-ముంబై. వెబ్సైట్:www.bseindia.com నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్-ముంబై. వెబ్సైట్: www.nseindia.com ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా-న్యూఢిల్లీ వెబ్సైట్: www.icsi.edu ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా-న్యూఢిల్లీ వెబ్సైట్: www.icai.org ఎన్సీఎఫ్ఎం అకాడమీ-హైదరాబాద్. వెబ్సైట్: www.ascncfmacademy.com ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగొచ్చు ‘‘భారతీయ స్టాక్ మార్కెట్ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. స్టాక్ బ్రోకర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఫైనాన్స్, మార్కెట్లపై ఆసక్తి ఉన్న ఇంటర్మీడియెట్, డిగ్రీ అభ్యర్థులు ఈ కోర్సులను అభ్యసించొచ్చు. షేర్లు, డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్ల అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియలో స్టాక్ బ్రోకర్‌దే ప్రధాన పాత్ర. వ్యక్తులు లేదా సంస్థలకు సంబంధించిన ఈ క్రయవిక్రయాల విషయంలో స్టాక్‌బ్రోకర్... డీలర్‌గా, అడ్వైజర్‌గా, అనలిస్ట్‌గా పనిచేస్తాడు. ఈ కెరీర్లో ప్రవేశించిన వారు ఉద్యోగాలకే పరిమితమవ్వాల్సిన అవసరం లేదు. మార్కెట్ స్థితిగతులపై పూర్తి అవగాహన ఏర్పడితే ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగడానికి మంచి అవకాశం ఉంటుంది’’ - ఎ.ఎస్.చక్రవర్తి, ఎన్సీఎఫ్ఎం అకాడమీ, హైదరాబాద్ పోటీ పరీక్షల్లో ‘దిక్కులు’ టాపిక్‌పై ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? వీటిని సులభంగా సాధించడానికి సూచనలివ్వండి. - జి.అరుణ్, నారాయణగూడ ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలతోపాటు ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్లన్నింటి దృష్ట్యా ‘దిక్కులు’ పాఠ్యాంశం అత్యంత ప్రాధాన్యమైంది. ప్రతి పోటీ పరీక్షలోనూ ఈ అంశం నుంచి కనీసం రెండు లేదా మూడు ప్రశ్నలు తప్పనిసరిగా కనిపిస్తాయి. పటం సహాయంతో వీటిపై వచ్చే ప్రశ్నలను సులభంగా సాధించవచ్చు. ఇలాంటి ప్రశ్నలు ఎదురవగానే ముందుగా కాగితంలో ఏదో ఒక మూలన పై నుంచి కిందికి సవ్యదిశలో ‘ఉఈతూఆదనైపవా’ కోడ్‌తో వరుసగా దిక్కులన్నింటినీ గుర్తించాలి. తర్వాత దత్తాంశంలోని వివరాల ఆధారంగా పటం గీయాలి. వ్యక్తి ప్రయాణిస్తున్న దిశ ఆధారంగా కుడివైపు లేదా ఎడమవైపు తిరిగితే ఏ దిశలో ఉంటాడో జాగ్రత్తగా గుర్తించాలి. వీటిపై వచ్చే ప్రశ్నలను సులభంగా సాధించడానికి తోడ్పడే మరో అంశం ‘పైథాగరస్ సిద్ధాంతం’. దీనికి సంబంధించి లంబకోణ త్రిభుజం ఏర్పరిచే భుజాల కొలతలైన (3, 4, 5), (5, 12, 13), (12, 16, 20) లాంటివాటిని గుర్తుంచుకుంటే సమస్యను మరింత వేగంగా సాధించవచ్చు. ఇన్పుట్స్: బి రవిపాల్ రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ బయాలజీ మెథడ్స్‌లో ప్రశ్నల ప్రాధాన్యం ఏమిటి? - ఆర్.సౌందర్య, కాప్రా డీఎస్సీ, టెట్ పరీక్షల్లో మెథడాలజీ ప్రశ్నలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించడం వల్ల పోటీలో ముందు నిలిచే అవకాశం ఉంది. గతంలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షలో మెథడాలజీ నుంచి 16 మార్కులకుగాను 32 ప్రశ్నలు ఇచ్చారు. ఒకవేళ టెట్‌ను కొనసాగిస్తే దాంట్లోనూ ఈ విభాగం నుంచి 20 మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కంటెంట్ నుంచి 44 మార్కులకుగాను ఇచ్చే 88 ప్రశ్నలకు చాలా మంది అభ్యర్థులు కచ్చితమైన సమాధానాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కంటెంట్‌కు సంబంధించిన చాలా ప్రశ్నలు పదో తరగతి, కొన్ని ప్రశ్నలు ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉండటం, డిగ్రీ స్థాయి అభ్యర్థులు పుస్తకాలను పదే పదే చదవడం వల్ల ఎక్కువ మార్కులు తెచ్చుకోగలుగుతున్నారు. కంటెంట్‌పై ప్రశ్నలు జ్ఞాన సంబంధమైనవి (నాలెడ్‌జ బేస్డ్) కావడం వల్ల పుస్తకాలను క్షుణ్నంగా చదివిన అభ్యర్థులు ఎక్కువ మార్కులు సాధిస్తారు. అందువల్ల మెథడాలజీలో పట్టు సాధించిన వారికి మంచి ర్యాంకు వస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇన్పుట్స్: ఎస్.పి.డి.పుష్పరాజ్, సబ్జెక్ట్ నిపుణులు జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ప్లాంట్ బయోటెక్నాలజీ న్యూఢిల్లీలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ప్లాంట్ బయోటెక్నాలజీ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. టెక్నికల్ అసిస్టెంట్ టి-3 అర్హతలు: అగ్రికల్చర్ సెన్సైస్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ. తగిన అనుభవం దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 25 వెబ్సైట్: www.nrcpb.org సీఆర్పీఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. సబ్ ఇన్స్పెక్టర్: 42 విభాగాలు: స్టాఫ్ నర్స్, రేడియోగ్రాఫర్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్: 87 విభాగాలు: ఫిజియో థెరపిస్ట్, ఫార్మాసిస్ట్, లేబొరేటరీ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్. హెడ్ కానిస్టేబుల్: 19 విభాగాలు: జూనియర్ ఎక్స్‌రే అసిస్టెంట్, లేబొరేటరీ అసిస్టెంట్, ఎయిర్ కండీషనింగ్ ప్లాంట్ టెక్నీషియన్, స్టీవార్డ్. కానిస్టేబుల్: 46. విభాగాలు: వార్డ్బాయ్/ గర్ల్, కుక్. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 7 వెబ్సైట్: http://crpf.nic.in ఇండియన్ నేవీ ఇండియన్ నేవీ.. షార్ట్ సర్వీస్ కమిషన్ పైలట్/ అబ్జర్వర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. పైలట్/అబ్జర్వర్ అర్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్, 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డీజీసీఏ జారీ చేసిన సీపీఎల్ ఉండాలి. ఎంపిక: సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 3 వెబ్సైట్: www.nausena-bharti.nic.in నర్సింగ్ డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ - తెలంగాణ (డీఎంఈ) జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. కాలపరిమితి: మూడున్నరేళ్లు అర్హత: 40 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత. ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా. రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 13 వెబ్సైట్: http://dme.tg.nic.in/ ఎడ్యూ న్యూస్: ఆసియాలో టాప్ బి-స్కూల్.. ఐఐఎం-కలకత్తా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)-కలకత్తా ఆసియాలో టాప్ బిజినెస్ స్కూల్ (బి-స్కూల్)గా గుర్తింపు సాధించింది. ఫైనాన్షియల్ టైమ్స్ మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ గ్లోబల్ ర్యాంకింగ్స్-2014లో స్థానం పొంది తన ప్రత్యేకతను చాటుకుంది. తన ఫ్లాగ్షిప్ కోర్సు పోస్టుగ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్(పీజీపీ) ద్వారా ప్రపంచవ్యాప్తంగా 13వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ర్యాంకింగ్‌సలో 6 స్థానాలను మెరుగుపర్చుకుంది. నాన్-యూరోపియన్ బి-స్కూల్స్‌లో టాప్ ర్యాంక్ పొందింది. ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకింగ్స్ టాప్ 70లో కేవలం ఐదు నాన్- యూరోపియన్ బి-స్కూల్స్‌కు మాత్రమే స్థానం దక్కింది. భారత్ నుంచి ఐఐఎం-కలకత్తాతో పాటు ఐఐఎం-అహ్మదాబాద్‌కు మాత్రమే ర్యాంక్(16) లభించింది. దేశంలో ప్రముఖ బి-స్కూల్స్‌లో ఒకటైన ఐఐఎం-కలకత్తా ఇప్పటికే అసోసియేషన్ ఆఫ్ ఎంబీఏస్ (ఏఎం బీఏ), అసోసియేషన్ టూ అడ్వాన్స్ కాలేజీయేట్ స్కూల్స్ ఆఫ్ బిజినెస్ (ఏఏసీఎస్బీ) అక్రిడి టేషన్లను, సీఈఎంఎస్ సభ్యత్వాన్ని పొందింది. భారత్‌లో పెరుగుతున్న ఉన్నత విద్యావంతులు భారతదేశంలో ఉన్నత విద్యనభ్యసించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం లభిస్తుండడమే ఇందుకు కారణం. 2008లో ఉన్నత విద్యకోసం కళాశాల లు/విశ్వవిద్యాలయాల్లో చేరినవారి నిష్పత్తి 11 శాతం కాగా 2013 నాటికి అది 16 శాతానికి చేరింది. 2021 నాటికి ఈ నిష్పత్తి 21 శాతానికి చేరుతుందని అంచనా. ఫ్రాస్ట్ అండ్ సలివన్ పరి శోధనలో ఈ విషయం వెల్లడైంది. 2009లో విద్యారంగానికి ప్రభుత్వాలు భారీగా నిధులు కేటాయించాయి. దీనివల్ల కొత్తగా ఉన్నతవిద్యలో 2 మిలియన్ల సీట్లు అందుబాటు లోకి వచ్చాయి. అయితే, ప్రస్తుత అవసరాలు తీరాలంటే 10 మిలియన్ల సీట్లు కావాలని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో కొత్త సీట్లను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచి స్తున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల ఆర్థిక తోడ్పాటు, మౌలిక సదుపాయాలు మెరుగుపడు తుండడం, ఆన్లైన్ ఎడ్యుకేషన్ వంటివాటితో భారత్‌లో ఉన్నత విద్యా రంగం అభివృద్ధి చెందుతున్నట్లు పరిశోధనలో తేలింది. విదేశీ విద్యార్థులు కూడా భారత్‌వైపు అధికంగా దృష్టి సారిస్తున్నట్లు స్పష్టమైంది. జాబ్ స్కిల్స్ ఇంటర్వ్యూలో చిన్న అంశాలదే పెద్ద పాత్ర మౌఖిక పరీక్ష అంటే కేవలం ప్రశ్నలు, సమాధానాలే కాదు. ఇందులో ప్రతి చిన్న అంశం అభ్యర్థి భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. మీరు ధరించిన దుస్తులు, మీ నడవడిక, హావభావాలు, మీరు మాట్లాడే ప్రతి మాట, మీ ప్రతి కదలికను రిక్రూటర్ నిశితంగా పరిశీలిస్తారు. ఇంటర్వ్యూలో రిక్రూటర్ ఏయే అంశాలను గమనిస్తారో కచ్చితంగా ఎవరూ చెప్పలేరు. సంస్థను, ఉద్యోగాన్ని బట్టి ఇవి వేర్వేరుగా ఉండొచ్చు. కానీ, కొన్ని ఉమ్మడి అంశాలు మాత్రం ఉంటాయి. అభ్యర్థులు వాటి గురించి తెలుసుకుంటే అందుకనుగుణంగా సన్నద్ధం కావొచ్చు. ఆలస్యం వద్దు: మౌఖిక పరీక్షకు ఆలస్యంగా హాజరైతే అవకాశాలు దెబ్బతింటాయి. అలాగని చాలాముందుగా చేరుకొని నిరీక్షించడం కూడా సమర్థనీయం కాదు. ఈ విషయంలో సమతూకం పాటించాలి. నిర్దేశిత సమయం కంటే 5-10 నిమిషాలు ముందుగా ఇంటర్వ్యూ కార్యాలయానికి చేరుకోవడం మంచిది. ఇలా చేరుకోవడానికి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. రిక్రూటర్‌తో కరచాలనం ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి? అనేదానిపై ముందుగా స్నేహితులతో కలిసి ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ఇంటర్వ్యూలో తడబాటుకు గురయ్యేందుకు ఆస్కారం ఉండదు. వేషధారణ ప్రొఫెషనల్‌గా: శరీరానికి నప్పని దుస్తులు వేసుకుంటే మీకు ఇబ్బందిగా, చూసేవారికి ఎబ్బెట్టుగా ఉంటుంది. రిక్రూటర్ దృష్టిని ఆకర్షించి, మంచి మార్కులు కొట్టేయాలనుకుంటే ప్రొఫెషనల్‌గా కనిపించే దుస్తులనే ధరించండి. మీకు సౌకర్యవంతంగా ఉండేవాటినే ఎంచుకోండి. బిగుతైన బట్టలు వేసుకుంటే నడిచేందుకు, కూర్చునేందుకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే రంగురంగుల ఫ్యాషన్లను దూరం పెట్టండి. మహిళలు చీర ధరించడం ఉత్తమం. అలంకరణ అతిగా లేకుండా చూసుకోవాలి. ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టేటప్పుడు చేతిలో అనవసరమైన సంచులు, వస్తువులు ఉండొద్దు. తక్కువ బరువుండే ఒక ఫైల్ మాత్రమే తీసుకెళ్లాలి. అందులో మీ రెజ్యూమె, ఇతర ధ్రువపత్రాలు ఉండాలి. కొందరు మాట్లాడుతుంటే చిత్రవిచిత్రమైన శబ్దాలు వారి నోటి నుంచి వెలువడుతుంటాయి. పదాల కోసం తడుముకుంటూ ఇలా శబ్దాలు చేస్తుంటారు. దీనివల్ల అభ్యర్థిపై రిక్రూటర్‌కు చిన్నచూపు ఏర్పడుతుంది. కనుక స్పష్టంగా మాట్లాడండి. సమాధానం వెంటనే తట్టకపోతే.. ప్రశ్న అర్థం కాలేదు, మరోసారి అడుగుతారా? అంటూ రిక్రూటర్‌ను అభ్యర్థించండి. వారు అడిగేలోగా సమాధానం మనసులో సిద్ధం చేసుకోండి. సెల్‌ఫోన్‌తో జాగ్రత్త: ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మీరు నోట్స్ రాసుకోండి. రిక్రూటర్ చెప్పే ముఖ్యమైన పాయింట్లను ఒక చిన్న నోట్‌బుక్‌లో రాయండి. దీనివల్ల మీరు సీరియస్ అభ్యర్థి అని, ఉద్యోగంపై మీకు నిజంగా ఆసక్తి ఉందని రిక్రూటర్ గుర్తిస్తారు. ఇంటర్వ్యూలో మీ సెల్‌ఫోన్ మోగితే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఫోన్ మోగడం రిక్రూటర్‌కు ఆగ్రహం కలిగిస్తుంది. కాబట్టి గదిలోకి అడుగుపెట్టడానికి ముందే ఫోన్‌ను సెలైంట్ మోడ్‌లో ఉంచండి. స్విచ్ఛాఫ్ చేయడం ఇంకా మంచిది.