అన్ని కోట్ల డబ్బంతా అదానీదేనా.. రాహుల్‌ సంచలన ఆరోపణలు | Congress Leader Rahul Gandhi Attacks Modi Govt Over Adani Issue - Sakshi
Sakshi News home page

టార్గెట్‌ అదానీ.. మోదీ సర్కార్‌పై విరుచుకుపడిన రాహుల్‌ 

Published Thu, Aug 31 2023 6:24 PM | Last Updated on Thu, Aug 31 2023 7:22 PM

Rahul Gandhi Attacks Modi Govt Over Adani Issue - Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై వేదికగా దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నేడు, రేపు ఇండియా కూటమి సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి కూటమి నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్‌ గాంధీ, ఖర్గే, కేజ్రీవాల్‌ సహా ముఖ్య నేతలంతా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ కేంద్రంపై సంచలన ఆరోపణలు చేశారు. ముంబై మీడియా సమావేశంలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. అదానీ గ్రూప్‌పై ఓసీసీఆర్‌ ఇచ్చిన రిపోర్ట్‌ని ప్రస్తావిస్తూ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. అదానీ గ్రూప్ అక్రమాలపై పలు పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. పెట్టుబడులతో అదానీ గ్రూపు షేర్ల ధరలు కృత్రిమంగా పెంచారు. షేర్ల పెరుగుదలతో వచ్చిన సొమ్ముతో అదానీ ఎన్నో ఆస్తులు కొన్నారు. అదానీ పోర్టులు, ఎయిర్‌ పోర్టులు కొనుగోలు చేశారు. ఈ డబ్బంతా ఎవరిది.. అదానీదేనా? అని ప్రశ్నించారు.
 
ఆ డబ్బు అదానిదేనా..
వందల కోట్ల డాలర్లు భారత్ నుంచి వెళ్లిపోయాయని, అవి మళ్లీ తిరిగి షెల్ పెట్టుబడుల్లాగా వచ్చాయని సంచలన కామెంట్స్‌ చేశారు. నాసర్‌ అలీ, ఛాంగ్‌ చుంగ్‌ లింగ్‌దీని వెనుక ఉన్నట్టు కథనాలు వచ్చాయి. ఆ డబ్బు అదానీదేనా.. ఇంకా దీని వెనక ఎవరైనా ఉన్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ రిపోర్ట్‌లు మన దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నాయన్నారు. ఈ వ్యవహారం వెనుక వినోద్ అదానీ ఉన్నట్లు కథనాలు వచ్చాయని తెలిపారు. 

మోదీ ఎందుకు స్పందించట్లేదు.. 
అదానీ గ్రూప్‌పై ఓసీసీఆర్ రిపోర్టు వచ్చిందని, దర్యాప్తు జరిపించేందుకు ప్రధాని ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. అదానీ గ్రూప్ షేర్లు పెంచేందుకు ఈ స్కామ్ చేశారన్నారు. జేపీసీ వేసి దీనిపై దర్యాప్తు చేయించాలని కోరారు. దీనిపై గౌతమ్ అదానీ పాత్ర ఎంటో బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. అదానీ గ్రూప్‌ వ్యవహారంపై జేపీసీతో విచారణకు ఎందుకు అనుమతించడంలేదు. విచారణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు చొరవ తీసుకోవడంలేదన్నారు. ఈ కుంభకోణానికి పాల్పడిన వాళ్లను జైళ్లో ఎందుకు పెట్టడంలేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. 

జీ-20లో ఏం చెబుతారు..
దేశంలో త్వరలో ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మక జీ-20 సమావేశం జరగబోతోంది. ఆ కీలక సమావేశంలో అదానీ గ్రూప్‌పై విదేశీ నేతలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతాం? అని కామెంట్స్‌ చేశారు. ఈ అదానీ గ్రూప్‌.. ఎందుకు అంత ప్రత్యేక సంస్థగా మారిందని ప్రశ్నించారు. దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.  

ఇదే క్రమం‍లో కేంద్రం అనూహ్యంగా తీసుకున్న పార్లమెంట్‌  ప్రత్యక సమావేశాలపై కూడా రాహుల్‌ స్పందించారు. ఇండియా కూటమికి భయపడే కేంద్రం సమావేశాలు పెట్టిందని సెటైర్లు వేశారు. 

ఇది కూడా చదవండి: జమ్ములో ఏ క్షణమైనా ఎన్నికల నిర్వహణకు సిద్ధం: కేంద్రం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement