India Group
-
అన్ని కోట్ల డబ్బంతా అదానీదేనా.. రాహుల్ సంచలన ఆరోపణలు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై వేదికగా దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నేడు, రేపు ఇండియా కూటమి సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి కూటమి నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, ఖర్గే, కేజ్రీవాల్ సహా ముఖ్య నేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కేంద్రంపై సంచలన ఆరోపణలు చేశారు. ముంబై మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అదానీ గ్రూప్‌పై ఓసీసీఆర్ ఇచ్చిన రిపోర్ట్‌ని ప్రస్తావిస్తూ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. అదానీ గ్రూప్ అక్రమాలపై పలు పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. పెట్టుబడులతో అదానీ గ్రూపు షేర్ల ధరలు కృత్రిమంగా పెంచారు. షేర్ల పెరుగుదలతో వచ్చిన సొమ్ముతో అదానీ ఎన్నో ఆస్తులు కొన్నారు. అదానీ పోర్టులు, ఎయిర్ పోర్టులు కొనుగోలు చేశారు. ఈ డబ్బంతా ఎవరిది.. అదానీదేనా? అని ప్రశ్నించారు. ఆ డబ్బు అదానిదేనా.. వందల కోట్ల డాలర్లు భారత్ నుంచి వెళ్లిపోయాయని, అవి మళ్లీ తిరిగి షెల్ పెట్టుబడుల్లాగా వచ్చాయని సంచలన కామెంట్స్ చేశారు. నాసర్ అలీ, ఛాంగ్ చుంగ్ లింగ్‌దీని వెనుక ఉన్నట్టు కథనాలు వచ్చాయి. ఆ డబ్బు అదానీదేనా.. ఇంకా దీని వెనక ఎవరైనా ఉన్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ రిపోర్ట్లు మన దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నాయన్నారు. ఈ వ్యవహారం వెనుక వినోద్ అదానీ ఉన్నట్లు కథనాలు వచ్చాయని తెలిపారు. #WATCH | "...It is very important that the Prime Minister of India Mr Narendra Modi clears his name and categorically explains what is going on. At the very least, A JPC should be allowed and a thorough investigation should take place. I don't understand why the PM is not forcing… pic.twitter.com/nMQiIpH9FW — ANI (@ANI) August 31, 2023 మోదీ ఎందుకు స్పందించట్లేదు.. అదానీ గ్రూప్‌పై ఓసీసీఆర్ రిపోర్టు వచ్చిందని, దర్యాప్తు జరిపించేందుకు ప్రధాని ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. అదానీ గ్రూప్ షేర్లు పెంచేందుకు ఈ స్కామ్ చేశారన్నారు. జేపీసీ వేసి దీనిపై దర్యాప్తు చేయించాలని కోరారు. దీనిపై గౌతమ్ అదానీ పాత్ర ఎంటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై జేపీసీతో విచారణకు ఎందుకు అనుమతించడంలేదు. విచారణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు చొరవ తీసుకోవడంలేదన్నారు. ఈ కుంభకోణానికి పాల్పడిన వాళ్లను జైళ్లో ఎందుకు పెట్టడంలేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. జీ-20లో ఏం చెబుతారు.. దేశంలో త్వరలో ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మక జీ-20 సమావేశం జరగబోతోంది. ఆ కీలక సమావేశంలో అదానీ గ్రూప్‌పై విదేశీ నేతలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతాం? అని కామెంట్స్ చేశారు. ఈ అదానీ గ్రూప్.. ఎందుకు అంత ప్రత్యేక సంస్థగా మారిందని ప్రశ్నించారు. దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. #WATCH | In Mumbai, Congress MP Rahul Gandhi raises the Adani Group row. He says, "What is amazing to me is that the gentleman who has done the investigation is today an employee of Mr Adani. What does that tell you about the nature of the investigation that the gentleman did?… pic.twitter.com/mp5aJbNcu9 — ANI (@ANI) August 31, 2023 ఇదే క్రమంలో కేంద్రం అనూహ్యంగా తీసుకున్న పార్లమెంట్ ప్రత్యక సమావేశాలపై కూడా రాహుల్ స్పందించారు. ఇండియా కూటమికి భయపడే కేంద్రం సమావేశాలు పెట్టిందని సెటైర్లు వేశారు. #WATCH | On Special Session of Parliament, Congress MP Rahul Gandhi says, "I think maybe it is an indicator of a little panic. Same type of panic that happened when I spoke in Parliament House, panic that suddenly made them revoke my Parliament membership. So, I think it is panic… pic.twitter.com/Qr9iFVcJWu — ANI (@ANI) August 31, 2023 ఇది కూడా చదవండి: జమ్ములో ఏ క్షణమైనా ఎన్నికల నిర్వహణకు సిద్ధం: కేంద్రం -
26 ఒప్పందాలు.. 22 బిలియన్ డాలర్లు..
భారత్ చైనా మధ్య డీల్స్ ఖరారు ⇒ చారిత్రక అవకాశాలు అందుకోండి ⇒ చైనా ఇన్వెస్టర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు షాంఘై: ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య భారీ ఒప్పందాలు కుదిరాయి. 22 బిలియన్ డాలర్ల విలువ చేసే 26 డీల్స్‌ను భారత్, చైనా కంపెనీలు శనివారం కుదుర్చుకున్నాయి. విద్యుత్, ఉక్కు, చిన్న..మధ్య తరహా పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు తదితర రంగాల కంపెనీల డీల్స్ ఇందులో ఉన్నాయి. భారత్-చైనా బిజినెస్ ఫోరం సమావేశంలో పాల్గొన్న సందర్భంగా భారత్‌లో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇది చారిత్రక తరుణమని ప్రధాని నరేంద్ర మోదీ ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య వ్యాపార బంధాలు మళ్లీ మెరుగుపడేందుకు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఇటీవలి భారత పర్యటన దోహదపడిందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ భాగస్వామ్యం మరింత పటిష్టం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది జిన్‌పింగ్ పర్యటనలో భాగంగా చైనా 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు కుదిరాయని ప్రధాని గుర్తు చేశారు. చైనా పటిష్టంగా ఉన్న రంగాల్లో భారత్ కూడా ఎదిగేందుకు తోడ్పాటునివ్వగలదని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘మీరు ప్రపంచపు ఫ్యాక్టరీగా పేరొందారు. మేము ప్రపంచానికి బ్యాక్ ఆఫీస్‌గా పేరొందాం. హార్డ్‌వేర్ మీ బలం అయితే.. సాఫ్ట్వేర్, సర్వీసులు మా బలం’ అని మోదీ పేర్కొన్నారు. భారత్‌లో వ్యాపార పరిస్థితులను మెరుగుపర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ చెప్పారు. రెండు దేశాల పరిశ్రమల దిగ్గజాలు బిజినెస్ ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. హువాయ్, అలీబాబా, షాంఘై అర్బన్ కన్స్ట్రక్షన్ తదితర సంస్థల అధిపతులు ఇందులో ఉన్నారు. అదానీ, భారతీ గ్రూప్ హవా.. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల్లో సింహభాగం .. అదానీ, భారతీ గ్రూప్‌వే ఉన్నాయి. విద్యుత్, పోర్టులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి తదితర రంగాలకు సంబంధించి అదానీ గ్రూప్ డీల్స్ కుదుర్చుకుంది. ఇక, భారతీ గ్రూప్ కార్యకలాపాల విస్తరణ కోసం రెండు చైనా బ్యాంకులు 2.5 బిలియన్ డాలర్లు సమకూర్చేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇవి కాకుండా సౌర విద్యుత్ రంగంలో వెల్స్పన్ గ్రూప్ రెండు ఒప్పందాలు.. ఎస్సెల్ గ్రూప్, సన్ గ్రూప్, యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్, ఇన్ఫోసిస్, విప్రో, జీఎంఆర్, ఎన్ఐఐటీ, ఆర్వీ అసోసియేట్స్ మొదలైనవి తలో ఒప్పందం కుదుర్చుకున్నాయి.