ఏ యువకునికైనా తండ్రిగా మారడమనేది కొత్త అనుభూతిని ఇస్తుంది. ఆ అనుభూతి అతని జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అయితే మగపిల్లవాడు ఏ వయసులో తండ్రి అవుతాడు? ఈ ప్రశ్న విజ్ఞానశాస్త్రానికే సవాల్‌గా నిలిచింది. అయితే ఇటీవల బ్రిటన్‌కు చెందిన షాన్ స్టీవర్ట్ కేవలం 11 ఏళ్ల వయసులోనే తండ్రి అయ్యాడు. ఈ ఉదంతం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. మగపిల్లవాడు ఏ వయసులో తండ్రి అవుతాడనే దానిపై పలు వాదోపవాదనలు జరుగుతున్న నేపధ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది.
విజ్ఞానశాస్త్రం ఏమి చెబుతున్నదంటే..
సైన్స్ చెబుతున్న వివరాల ప్రకారం 11 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు కలిగిన మగ పిల్లవాడు తండ్రి అయ్యేందుకు అర్హుడవుతాడు. 11 ఏళ్లు వచ్చేసరికి మగపిల్లలలో స్మెర్మ్ ఉత్పత్తి కావడం ప్రారంభమవుతుంది. అప్పుడు ఆ మగపిల్లవాడు ఏ మహిళను అయినా గర్భవతిని చేయగలుగుతాడు. అయితే ఇది ప్రతిసారీ సాధ్యంకాదు. ఇది ఆ మహిళ బయోలాజికల్ క్లాక్‌పై ఆధారపడివుంటుంది. చాలా సందర్భాలలో 14 ఏళ్ల తరువాతనే మగపిల్లవాడు తండ్రి అయ్యే సామర్థ్యాన్ని సంతరించుకుంటాడు.
అమ్మాయిలు ఏ వయసులో తల్లి అవుతారంటే..
విజ్ఞానశాస్త్రపరంగా చూస్తే అమ్మాయిలు 13 ఏళ్ల వయసులో తల్లి అయ్యే సామర్థ్యాన్ని సంతరించుకుంటారు. కొన్ని సందర్భాల్లో 10 నుంచి 12 ఏళ్ల వయసులోనే తల్లిగా మారేందుకు అవకాశం ఉంటుంది. మెడిసిన్ నెట్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో డాక్టర్ మెలిసా మాట్లాడుతూ చాలా సందర్భాలలో తల్లితండ్రులయ్యే సామర్థ్యం మగపిల్లవారికన్నా ముందుగా ఆడపిల్లలకు వస్తుంది. మగపిల్లలు 11 నుంచి 14 ఏళ్ల వయసు మధ్యలో తండ్రి అయ్యేందుకు అవకాశం ఉండగా, అమ్మాయిలు 10 నుంచి 12 ఏళ్ల మధ్యలో తల్లి అయ్యే సామర్థ్యాన్ని పొందుతారు. అయితే ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వాలంటే ఆడపిల్లలకు కనీసం 18 ఏళ్ల వయసు దాటి ఉండాలి. చట్ట ప్రకారం కూడా 18 ఏళ్లు దాటడమే తల్లి అయ్యేందుకు తగిన వయసుగా గుర్తించారు. అయితే వివిధ దేశాల్లో ఈ విషయంలో పలు రకాల చట్టాలు అమలులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: ‘నేను గోవధ చేశాను.. నన్ను జైలులో పెట్టండి’ అంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి..
11 ఏళ్లకే ఎవరైనా తండ్రి కాగలరా?.. సైన్స్ ఏమి చెబుతోందంటే..
Published Sun, Jul 9 2023 10:22 AM | Last Updated on Sun, Jul 9 2023 11:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment