సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డీజీపీ నియామకంపై సీనియర్ ఐపీఎస్ అధికారిని తేజ్‌దీప్ కౌర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం అసెంబ్లీ లాబీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... తాను డీజీపీ బరిలో ఉన్నానని తెలిపారు. ప్రస్తుతానికి ప్రభుత్వం ఇంచార్జ్ డీజీపీని నియమిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డీజీపీ కోసం తుది జాబితా వచ్చే వరకూ వేచి చూడాల్సిందే అని అన్నారు.
ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ పదవీ కాలం నవంబర్ 11తో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ కమిషనర్ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం ఇంచార్జ్ డీజీపీగా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తేజ్‌దీప్ కౌర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment