ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహ ధ్వంసం.. ఆగ్రహించిన కేటీఆర్‌ | KTR Reacted On Prof Jayashankar Statue Vandalised Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహ ధ్వంసం.. ఆగ్రహించిన కేటీఆర్‌

Published Tue, Jan 16 2024 5:14 PM | Last Updated on Tue, Jan 16 2024 5:18 PM

KTR Reacted On Prof Jayashankar Statue Vandalised Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‘ఎక్స్‌’ ట్విటర్‌ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్‌ జయశంకర్  విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు.

తెలంగాణ సమాజమంతా ఎంతగానో గౌరవించుకునే ప్రొఫెసర్ జయశంకర్  విగ్రహం ధ్వంసం చేయడం అత్యంత హీనమైన చర్యని అన్నారు. ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు.

శేర్లింగంపల్లిలోని ఆల్విన్ కాలనీలో పోలీసుల ముందే ఓ దుండగుడు.. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేటీఆర్‌ తన ‘ఎక్స్‌’ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: పెద్దజాతి కోడిపుంజులకు కేరాఫ్‌ శివపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement