statue vandalised
-
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం.. టీడీపీ నేతలపై అనుమానం
-
ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ధ్వంసం.. ఆగ్రహించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజమంతా ఎంతగానో గౌరవించుకునే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసం చేయడం అత్యంత హీనమైన చర్యని అన్నారు. ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. Demand @TelanganaDGP to take stern action on the perpetrator of this heinous act Strongly condemn the atrocious act of destruction of the statue of Prof. Jayashankar Garu who is widely regarded and respected in Telangana https://t.co/mvkuBHOyxj — KTR (@KTRBRS) January 16, 2024 శేర్లింగంపల్లిలోని ఆల్విన్ కాలనీలో పోలీసుల ముందే ఓ దుండగుడు.. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేటీఆర్ తన ‘ఎక్స్’ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: పెద్దజాతి కోడిపుంజులకు కేరాఫ్ శివపల్లి -
పాక్‌లో దుశ్చర్య: మహారాజా రంజిత్‌సింగ్ విగ్రహం ధ్వంసం
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో కొందరు యువకులు రెచ్చిపోయారు. సిక్కుల ఆరాధ్య దైవం మహారాజ రంజిత్‌సింగ్ విగ్రహాన్ని మూడోసారి పగులగొట్టి వారి విద్వేషాన్ని మరోసారి చాటుకున్నారు. ఈ ఘటన పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని లాహోర్ కోటలో జరిగింది. లాహోర్ కోట సమీపంలో ప్రతిష్టించిన రంజిత్ సింగ్ విగ్రహాన్ని తాజాగా మంగళవారం కూల్చివేశారు. తెహ్రీక్-ఇ-లబైక్ (టీఎల్ఎఫ్) అనే రాడికల్ గ్రూప్ సభ్యులు విగ్రహంపై దాడి చేసి ధ్వంసం చేశారు. సిక్కుల ఆరాధ్య దైవం రంజిత్‌సింగ్. ఆయన లాహోర్ రాజధానిగా సిక్కు రాజ్యాన్ని ఏర్పాటుచేశాడు. ఆయన జ్ఞాపకార్థం లాహోర్ కోట సమీపంలో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని 180వ వర్ధంతి సందర్భంగా 2019 జూన్‌లో ఆవిష్కరించారు. ఇప్పటికే రెండుసార్లు రంజిత్‌సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో రెండు నెలల కిందట కొత్తగా ఏర్పాటుచేశారు. ఈ విగ్రహాన్ని వాల్డ్సిటీ ఆఫ్ లాహోర్ అథారిటీ (డబ్ల్యూసీఎల్ఏ) ఆధ్వర్యంలో యూకేకు చెందిన సిక్కు హెరిటేజ్ ఫౌండేషన్ నిర్మించింది. తాజాగా మరోసారి విగ్రహం ధ్వంసం చేయడంపై సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విగ్రహానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ప్రేమించి పెళ్లాడి ఉగ్రవాదిగా మారిన భారత డెంటిస్ట్.. జైల్లోనే చదవండి: మొదలైన తాలిబన్ల అరాచకం: ఇంటింటికెళ్లి నగదు లూటీ TLP worker pulling down Ranjit Singh's statue at the Lahore Fort. The statue had previously been vandalized by TLP workers on at least two different occasions in the past. pic.twitter.com/IMhcZmPj7e — Ali Usman Qasmi (@AU_Qasmi) August 17, 2021 -
సంఘ సంస్కర్త విగ్రహం ధ్వంసం
-
సంఘ సంస్కర్త విగ్రహం ధ్వంసం
సాక్షి, చెన్నై: ప్రముఖ హీరో రజనీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలపై రగడ కొనసాగుతుండగానే ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్ ఈవీ రామస్వామి నాయకర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. తమిళనాడులోని చెంగల్పట్టు సమీపంలో శుక్రవారం ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది. కాగా, పెరియార్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పబోనని రజనీకాంత్ ఇప్పటికే ప్రకటించారు. రజనీకాంత్‌పై పలు పోలీస్స్టేషన్లలో పెరియార్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేశారు. తమిళ మేగజీన్ ‘తుగ్లక్’ 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ.. 1971లో సేలంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శ్రీరాముడు, సీత నగ్న చిత్రాలకు చెప్పుల దండలు వేసి నిర్వహించిన ర్యాలీలో పెరియార్ పాల్గొంటే ఏ ఒక్క వార్తాపత్రిక ఆ వార్తను ప్రచురించలేదని వ్యాఖ్యానించారు. రజనీకాంత్‌పై ద్రవిడ పార్టీలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని ఖండించాయి. పెరియార్‌పై వ్యాఖ్యలకు నిరసనగా పలుచోట్ల రజనీకాంత్ దిష్టిబొమ్మలను తగలబెట్టారు. ఆయన తాజా సినిమా ‘దర్బార్’ ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. కాగా, తమిళ ప్రజల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడిన పెరియార్ గురించి ఆచితూచి మాట్లాడాలని రజనీకాంత్‌కు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ హితవు పలికారు. అయితే పెరియార్ విగ్రహాలను ధ్వంసం చేయడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఏప్రిల్‌లో అరంతంగి ప్రాంతంలో పెరియార్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. 2018, మార్చిలో వెల్లూరులోనూ పెరియార్ విగ్రహాన్ని నాశనం చేశారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో చెన్నైలోని పెరియార్ విగ్రహం తలపై చెప్పుల జతను ఉంచి ఘోరంగా అవమానించారు. చదవండి: ‘స్వీయాభిమాన’ ఉద్యమ నిర్మాత రామస్వామి -
క్యాంపస్‌లో కలకలం : వివేకానంద విగ్రహం ధ్వంసం
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ క్యాంపస్‌లోని స్వామి వివేకానంద విగ్రహాన్ని గురువారం కొందరు దుండగులు ధ్వంసం చేశారు. జేఎన్‌యూ అడ్మినిస్ర్టేటివ్ బ్లాక్‌లో జవహర్లాల్ నెహ్రూ విగ్రహానికి ఎదురుగా ఉన్న వివేకానంద విగ్రహాన్నిదుండగులు ధ్వంసం చేశారు. జేఎన్‌యూ అడ్మిన్ బ్లాక్‌లోకి బుధవారం కొందరు విద్యార్ధులు ప్రవేశించి వర్సిటీ వీసీ మామిడాల జగదీష్ కుమార్‌పై అభ్యంతరకర మెసేజ్‌లు రాసిన మరుసటి రోజు వివేకానంద విగ్రహం ధ్వంసం చేయడం గమనార్హం. విద్యార్ధుల ఆందోళనతో పెంచిన ఫీజులను జేఎన్‌యూ అధికారులు వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. హాస్టల్ ఫీజు పెంపు, డ్రెస్ కోడ్ వంటి పలు సమస్యలపై జేఎన్‌యూ విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో వర్సిటీ అధికారులు దిగివచ్చి పెంచిన ఫీజులను ఉపసంహరించినట్టు ప్రకటించారు. -
వాసవీమాత విగ్రహం ధ్వంసం
– అర్ధరాత్రి జేసీబీతో భజనమందిరం కూల్చివేత – ఆర్యవైశ్య, హిందూవులు నిరసన – పోలీసుస్టేషన్‌ను ముట్టడి హిందూపురం అర్బన్: పట్టణంలోని బాలాజీనగర్ కాల్వగడ్డ పక్కనే ఉన్న వాసవీభజన మందిరాన్ని శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు జేసీబీతో కూల్చివేశారు. ఆలయంలో ధ్వంసం చేసిన అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లారు. శనివారం ఉదయాన్నే విషయం పట్టణంలో దావానంలా వ్యాపించింది. పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు, హిందూ సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో కేసున్నా కూల్చేశారు.. : కాల్వపోరంబోకు స్థలంలో నిర్మించిన భజన మందిరం కొద్దిగా పక్కనే ఉన్న స్థలం వరకు నిర్మితమైంది. పక్కస్థల యాజమాని చంద్రశేఖర్ స్థలాన్ని దానంగా ఇవ్వడంతో ఆలయం నిర్మించినట్లు మందిరం నిర్వాహకులు చెబుతున్నారు. అయితే పక్క స్థల యాజమాని చంద్రశేఖర్, మరోవ్యక్తి వెల్డింగ్బాషా మధ్య స్థల వివాదం ఏర్పడింది. దీనిపై కోర్టులో దావా నడుస్తోంది. ఇదిలా ఉండగా శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయాన్ని కూల్చివేశారు. వాసవీమాత విగ్రహ కూల్చివేతను నిరసిస్తూ ఆర్యవైశ్యసంఘం అధ్యక్షులు జేపీకేరాము,బీజేపీ నాయకులు ఆదర్ష్కుమార్, వరప్రసాద్, రమేష్‌రెడ్డి, యువనాయకులు ప్రకాష్, రఘు, హిందూసురక్షాసమితి సభ్యులు రవి, చారుకీర్తి, బాబుతో ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్సర్కిల్కు చేరుకుని మానవహారం ఏర్పడి రాస్తారోకో చేశారు. స్థలవివాదముంటే కోర్టు ద్వారా తేల్చుకోవాలే తప్ప ఇలా అర్ధరాత్రి దొంగల్లా కూల్చడం ఏంటని మండిపడ్డారు. విగ్రహాన్ని ధ్వంసంచేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో సీఐ మధుభూషణ్, ట్రాఫిక్ పోలీసులు వారికి సర్ధిచెప్పడంతో వారు అక్కడి నుంచి నేరుగా వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌ను తరలివచ్చి ముట్టడించారు. డీఎస్పీ కరీముల్లా షరీఫ్‌తో మాట్లాడి నిందితులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. అనంతరం భజనమందిరాన్ని శుభ్రం చేసి కూల్చిన చోట వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి పూజలు చేశారు.