prof jayashankar
-
ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ధ్వంసం.. ఆగ్రహించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజమంతా ఎంతగానో గౌరవించుకునే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసం చేయడం అత్యంత హీనమైన చర్యని అన్నారు. ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. Demand @TelanganaDGP to take stern action on the perpetrator of this heinous act Strongly condemn the atrocious act of destruction of the statue of Prof. Jayashankar Garu who is widely regarded and respected in Telangana https://t.co/mvkuBHOyxj — KTR (@KTRBRS) January 16, 2024 శేర్లింగంపల్లిలోని ఆల్విన్ కాలనీలో పోలీసుల ముందే ఓ దుండగుడు.. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేటీఆర్ తన ‘ఎక్స్’ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: పెద్దజాతి కోడిపుంజులకు కేరాఫ్ శివపల్లి -
అసెంబ్లీ హాల్లో జయశంకర్ జయంతి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ హాల్లో శనివారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి శాసన మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ పులమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శాసన మండలి విప్ ఎంఎస్ ప్రభాకర్, శాసనసభ చీఫ్ విప్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, శేరి సుభాష్‌రెడ్డి, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, భానుప్రసాద్, తాతా మధు, దండే విఠల్, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రెటరీ నరసింహా చార్యులు, టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ రణాన్ని, నినాదాన్ని చాటినవాడు
తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన ఉద్యమనేత, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 1934 ఆగస్టు 6న వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం, అక్కంపేట గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అధ్యాపకుడిగా, కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకుల పతిగా సేవలు అందించిన జయ శంకర్ ఎప్పుడూ తెలంగాణ వాదాన్ని వదిలిపెట్ట లేదు. విద్యార్థిదశ నుంచి కూడా మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటు వంటి, నిర్మాణాత్మకమైన, నిక్కచ్చిౖయెన మనస్తత్వం గలవాడు ఆయన. తెలంగాణలో జరుగుతున్న ఆంధ్ర వలసవాదుల, సమైక్యవాదుల దోపిడీ నుండి తెలం గాణ విముక్తి కోసం కంకణం కట్టుకున్న విద్యావేత్త. మా వనరులు మాకున్నాయి, మా వనరులపై మాకు అధికారం కావాలని ప్రశ్నించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. తెలంగాణ ప్రజలు ఎన్నాళ్లు యాచించా లనే ఒక కసి, పట్టుదలతో 1952లో నాన్ ముల్కీ, ఇడ్లీ, సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి, తనదైన శైలిలో కాకతీయ, ఉస్మానియా విశ్వ విద్యాలయాలలో విద్యార్థులు, ఆచార్యులతో సమా వేశాలు ఏర్పాటుచేసి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరంగా చెప్పారు. ఆయా విశ్వవిద్యా లయాలలో చదువుతున్న విద్యార్థులను, పరిశోధకు లను కూడగట్టేందుకు ఆయన చేసిన ప్రయత్నం మరు వలేనిది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని విద్యావంతులు, మేధావులు ప్రతిఘటించాలనీ; ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలనీ; విద్యా వంతులమైన మనమే గళం విప్పకపోతే ఎలా? మేధా వులు సామాజిక బాధ్యతను విస్మరించడం క్షంతవ్యం కాదనీ వక్కాణించారు. నాలుగు గోడల మధ్యలో కుర్చొని, కేవలం నినా దాలు చేయడం ద్వారా సమస్యలకు పరిష్కారం ఉండదని బలంగా నమ్మిన వ్యక్తి జయశంకర్. అందుకే సమస్యలకు దారితీసిన కారణాలను సాక్ష్యా ధారాలతో, శాస్త్రీయంగా, గణాంకాలతో సహా నిర్భ యంగా, నిర్మొహమాటంగా విశ్లేషిస్తూ అనేక రచనలు చేశారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలం గాణ రణాన్ని, నినాదాన్ని చాటిచెప్పిన ప్రజ్ఞాశాలి. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కల్వ కుంట్ల చంద్రశేఖరరావు తన వాణి, బాణీæ వినిపి స్తున్న క్రమంలోనే ప్రజల మద్దతుతో 2001లో తెలం గాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేశారు. ఒకానొక సంద ర్భంలో జయశంకర్ మాట్లాడుతూ, ‘‘అబ్తో ఏకీ హీ ఖ్వాయిష్ హై, ఓ తెలంగాణ దేఖ్నా మర్ జానా (ఇప్పుడైతే నాకు ఒకే ఒక కోరిక మిగిలింది, అది చని పోయేలోగా తెలంగాణ ఏర్పాటు కళ్ళారా చూడటం); అది కేవలం తెలంగాణ మొనగాడు ‘రావు సాబ్’తోనే సాధ్యం అవుతుంది, తర్వాత నేను చనిపోవాలి’’ అని అన్న సందర్భాలు అనేకం. జయశంకర్ మార్గదర్శ కత్వంలో కేసీఆర్ ఆమరణ నిరాహరదీక్ష చేపట్టి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు గడగడలాడించడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేయక తప్పలేదు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు పేర్కొనడం, ఖంగు తిన్న సమైక్యవాదులు ఆ ప్రకటనను జాతి వ్యతిరే కమైనదిగా, ‘కాగ్నిజబుల్ అఫెన్స్’గా పేర్కొనడం, తదుపరి జరిగిన పరిణామాలతో డిసెంబర్ 23న మరొక ప్రకటన చేసి, శ్రీకృష్ణ కమిటీ రూపంలో తెలం గాణ ప్రజలను గాయపరచడం జరిగింది. తెలంగాణ పోరాటాన్ని ఉధృతం చేసి, నిరవధికంగా ఉద్యమా లను చేస్తూ, కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి తెచ్చిన ఫలితంగా 2014 ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోకసభ ఆమోదం లభిం చింది. సీమాంధ్రకు న్యాయం చేయడానికి వెంకయ్య నాయుడు ప్రతిపాదించిన సవరణలను కొంతవరకు తృప్తిపరచే విధంగా ప్రధాని ఆరుసూత్రాల ప్యాకేజీని ప్రకటించిన పిదప, 2014 పిభ్రవరి 20న రాజ్య సభలో బిల్లుకు య«థాతథంగా మూజువాణీ ఓటుతో ఆమోద ముద్ర పడింది. 2014 జూన్ 2 నాడు దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ‘సారు’ కలల తెలంగాణ ఏర్పడింది. అయితే ప్రత్యేక తెలం గాణ రాష్ట్రాన్ని చూడకుండానే జయశంకర్ అనా రోగ్యంతో 2011 జూన్ 21న తుదిశ్వాస విడిచారు. -డా. సంగని మల్లేశ్వర్ వ్యాసకర్త విభాగాధిపతి, జర్నలిజం శాఖ, కాకతీయ విశ్వవిద్యాలయం ‘ 98662 55355 (నేడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి) -
సార్... జోహార్!
-
మహోన్నత వ్యక్తి ప్రొ.జయశంకర్
తెలంగాణ భవన్లో జయశంకర్‌కు సీఎం నివాళులు సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని విడమరిచి చెప్పిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తే ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తుందని బలంగా నమ్మి, తెలంగాణ వాదులను ఏకం చేశారని సీఎం కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ నాలుగో వర్ధంతి సందర్భంగా ఆదివారం సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం వచ్చిన తరువాత జరుగుతున్న అభివృద్ధి తప్పక జయశంకర్ సార్ ఆత్మకు శాంతిని చేకూరుస్తుందన్నారు. జయశంకర్ స్ఫూర్తితో ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు కె.కేశవరావు, వినోద్ , మంత్రులు పాల్గొన్నారు. -
పిల్లల ఫీజు కట్టలేరు కానీ సింగపూర్ కడతారా ?
హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొ. జయశంకర్ విశ్వవిద్యాలయంగా నామకరణం చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రొ.జయశంకర్ జయంతి సందర్బంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆయన విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్‌లో పేర్లు మార్చాల్సిన సంస్థలు చాలా ఉన్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కేసీఆర్ ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. మీ బతుకులు మీరు బతకండి... మా బతకులు మేం బతుకుతామంటూ ఆంధ్ర ప్రభుత్వానికి, నాయకులకు సూచించారు. సింగపూర్ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం, మంత్రులు తెగ గోప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సింగపూర్ కడతామని చెబుతున్న మీరు పిల్లల ఫీజులు కట్టలేరా అంటు కేసీఆర్ ఆంధ్ర సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. -
జయశంకర్ పేరును పెడితే తప్పేంటి?!
-
జయశంకర్ ఆశయాలను సాధిస్తాం: కవిత
హైదరాబాద్ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను బుధవారం తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కల్వకుంట్ల కవిత, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.జయశంకర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామన్నారు. ఆయన ఆశయాల ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమని ఆమె తెలిపారు. ఆ దిశగా తమ ప్రభుత్వం పని చేస్తుందని కవిత స్పష్టం చేశారు. -
ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు
హైదరాబాద్ : ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేస్తామని తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ మూడవ వర్థంతి సందర్భంగా శనివారం తెలంగాణ భవన్లో పలువురు తెలంగాణ మంత్రులు, నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కవిత, మంత్రి జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.