
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా శనివారం ప్రగతి భవన్‌లో ఆయన చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ హాల్‌లో శనివారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి శాసన మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ పులమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శాసన మండలి విప్ ఎంఎస్ ప్రభాకర్, శాసనసభ చీఫ్ విప్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, శేరి సుభాష్‌రెడ్డి, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, భానుప్రసాద్, తాతా మధు, దండే విఠల్, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రెటరీ నరసింహా చార్యులు, టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యదర్శ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.