సాక్షి, హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రగతి భవన్‌కు వెళ్లారు. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్న సమయంలో కేఏ పాల్ అక్కడకు వచ్చారు. కాగా కేఏ పాల్‌ను పోలీసులు అడ్డుకుని లోపలికి అనుమతించలేదు.దాంతో పోలీసుల తీరును కేఏ పాల్ తప్పుబట్టారు. ఈ క్రమంలోనే పోలీసులతో వాగ్వాదానికి దిగారు కేఏ పాల్ తనను ప్రగతి భవన్ లోపలికి అనుమతించకపోవడాన్ని తీవ్రంగా తప్పు బట్టారు.
సీఎం కేసీఆర్ లోపల ఉండగా, తనకు లోనికి ఎందుకు అనుమతి ఇవ్వరని పోలీసుల్ని ప్రశ్నించారు కేఏ పాల్. అఖిలేష్ యాదవ్ కంటే తానే గొప్ప లీడర్‌ను అని, తనకు అపాయింట్ ఇవ్వాలంటూ తనదైన శైలిలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లాంటి వాళ్లకు అపాయింటమెంట్ ఇస్తున్న సీఎం కేసీఆర్ తనకు ఎందుకు అపాయింట్‌మెంట ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ని కలిసి రాష్ట్ర అప్పులు, అభివృద్ధిపై చర్చించాలని అనుకున్నానని, కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని కేఏ పాల్ గుస్సా అయ్యారు.
చదవండి: బీహార్ జేడీయూలో ముసలం?.. నితీశ్ తిరిగి ఎన్డీయేలోకి.. తప్పదా?!
Comments
Please login to add a commentAdd a comment