
పిల్లల ఫీజు కట్టలేరు కానీ సింగపూర్ కడతారా ?
హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొ. జయశంకర్ విశ్వవిద్యాలయంగా నామకరణం చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రొ.జయశంకర్ జయంతి సందర్బంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆయన విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్లో పేర్లు మార్చాల్సిన సంస్థలు చాలా ఉన్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కేసీఆర్ ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు.
మీ బతుకులు మీరు బతకండి... మా బతకులు మేం బతుకుతామంటూ ఆంధ్ర ప్రభుత్వానికి, నాయకులకు సూచించారు. సింగపూర్ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం, మంత్రులు తెగ గోప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సింగపూర్ కడతామని చెబుతున్న మీరు పిల్లల ఫీజులు కట్టలేరా అంటు కేసీఆర్ ఆంధ్ర సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.