Kalvakuntla Chandrashekar Rao
-
ఇరకాటంలో కేసీఆర్.. భ్రమలో తెలంగాణ సర్కార్?!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై వ్యూహాత్మక దాడి చేసినట్లు అనిపిస్తుంది. ఆయన ప్రభుత్వంలో జరిగిన కొన్ని అవకతవకల అభియోగాలపై రెండు విచారణ సంఘాలు పనిచేస్తున్నాయి. ఆ రెండిటికి రిటైర్డ్ న్యాయమూర్తులు అధ్యక్షత వహిస్తున్నారు. ఒకటి విద్యుత్ కొనుగోళ్లు, కొత్త పవర్ ప్లాంట్ల నిర్మాణంలో నిధుల దుర్వినియోగం,మరొకటి కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జరుగుతున్న విచారణలు. ఏ నేతకు అయినా తొమ్మిదినర్రేళ్ల తర్వాత ఇలాంటి విచారణలు ఎదుర్కోవలసి రావడం దురదృష్టకరం. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ కాదులే అన్న నిర్లక్ష ధోరణి కావచ్చు..కొత్తగా అధికారంలోకి వచ్చిన వారు ఎలాగైనా గత ప్రభుత్వ పెద్దలను ఇరుకున పెట్టాలన్న భావన కావచ్చు. ఆయా సందర్భాలలో ఇలా విచారణ కమిషన్ లను నియమిస్తుంటారు. దేశంలో పలు రాష్ట్రాలలో ఇలాంటి విచారణలు జరుగుతుంటాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాలలో కమిషన్ లను నియమించి విచారణకు ఆదేశిస్తుంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రెండుపాయింట్లలో కేసీఆర్ బుక్ అవుతారని భావించి ఉండవచ్చు. బీఆర్ఎస్ను బలహీనపరచడానికి ఇది ఒక అవకాశంగా అనుకుని ఉండవచ్చు.ఏది ఏమైనా ఆయన అధికారంలో ఉన్నారు కనుక కేసీఆర్ కు ఈ పరిణామం సహజంగానే ఇబ్బంది కలిగిస్తుంది.విశేషం ఏమిటంటే.. విద్యుత్ విషయంలోకాని, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కాని ఆ రోజుల్లో కేసీఆర్ కు విశేషమైన పేరు వచ్చింది. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ కొరత ఉండేది. కేసీఆర్ తగు రకాల చొరవ తీసుకుని విద్యుత్ సమస్యను తీర్చారు. దాదాపు కరెంట్ కోతలు లేకుండా చేయడం ద్వారా ప్రజల మన్ననలు పొందగలిగారు. కాకపోతే అప్పట్లోనే కేసీఆర్ అనవసరంగా అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉండేవి. కాని ప్రజలకు అందిన సదుపాయం రీత్యా దానిని ఎవరూ పట్టించుకోలేదు. అదే టైమ్ లో కొత్తగా భద్రాద్రి,యాద్రాద్రి పేర్లతో ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్నారు. దీనిని కూడా పలువురు అబినందించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడమే కాకుండా,వేగంగా పూర్తి చేయించిన తీరు అందరిని ఆబ్బురపరచింది. కొంతమంది సాంకేతిక నిపుణులు కాళేశ్వరం ప్రాంతం కొత్త ప్రాజెక్టుకు ఎంత అనువైనది అన్న అనుమానం వ్యక్తం చేయక పోలేదు. అయినప్పటికీ తెలంగాణలో తనదైన ముద్ర వేసుకుని, సాగు నీటి సమస్య తీర్చాలన్న కీర్తి కాంక్షతో ఆ స్కీమును ముందుకు తీసుకువెళ్లారు. ఆ ఎత్తిపోతల పధకం నిర్వహణకు బాగా వ్యయం అవుతుందని అంచనా వేసినా, రైతులకు అందే ప్రయోజనం కంటే అదేమీ ఎక్కువ కాదని వాదించేవారు. దురదృష్టవశాత్తు అక్కడ నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. అది కూడా సరిగ్గా శాసనసభ ఎన్నికలకు కొద్దినెలల ముందు జరగడంతో కేసీఆర్ కు చికాకు తెచ్చిపెట్టింది. దానిపై కాంగ్రెస్, బీజేపీల తీవ్రమైన విమర్శలు కురిపించేవి. ఎన్నికలలో ఓటమితో అవన్ని కేసీఆర్ కు పెద్ద తలనొప్పిగా మారాయి.కేసీఆర్ తిరిగి గెలిచి ఉంటే.. ఏదో కిందా,మీద పడి దానిని హాండిల్ చేసి ఉండేవారు. కాంగ్రెస్ గెలవడంతో కేసీఆర్ ను ఇరుకున పెట్టడానికి ఒక ఆయుధం దొరికినట్లయింది. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టులు వేల కోట్ల వ్యయంతో కూడినవి కావడంతో ప్రజలలో ఒకరకమైన అలజడికి ఆస్కారం ఏర్పడింది.దానిని రేవంత్ ప్రభుత్వం రాజకీయంగా వాడుకోవడానికి సహజంగానే యత్నిస్తుంది. అందులో భాగంగా రెండు కమిషన్ లను నియమించింది. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై ఏర్పడిన కమిషన్ కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఆయా అంశాలను పరిశీలించిన మీదట మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలను చేశారు. వాటిని ఆసరా చేసుకుని కేసీఆర్ దాడి చేశారు. ఈ విషయంలో కేసీఆర్ వివరణను కమిషన్ కోరగా, జస్టిస్ తీరును తప్పుపడుతూ కేసీఆర్ ఏకంగా పన్నెండు పేజీల లేఖ రాశారు. కమిషన్ ముందస్తుగానే ఒక అబిప్రాయానికి వచ్చి పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావం, కరెంటు కొరత తదితర అంశాలను ప్రస్తావిస్తూనే ఆయన తన అభ్యంతరాన్ని,నిరసనను తెలియచేశారు.తద్వారా కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీసే యత్నం చేశారని చెప్పవచ్చు. బహుశా ఈ పరిణామాన్ని కమిషన్ జస్టిస్ ఊహించి ఉండకపోవచ్చు.దీని తర్వాత కాళేశ్వరం కమిషన్ ఇచ్చే నోటీసుకు కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇక్కడ కొన్ని సంగతులు ప్రస్తావించాలి. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై 1977 లో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం జె సి షా అనే . జడ్జి నాయకత్వంలో ఒక కమిషన్ ను వేసింది. ఎమర్జెన్సీ లో జరిగిన అకృత్యాలపై ఈ కమిషన్ విచారణ జరిపింది. కమిషన్ అంతిమంగా ఇందిరాగాంధీని తప్పు పట్టినా, దానివల్ల ఆమెకు పెద్దగా నష్టం జరగలేదు.పైగా రాజకీయంగా బాగా వాడుకోగలిగారు. షా కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఇందిరా గాంధీ, సంజయ్ గాందీ, ప్రణబ్ ముఖర్జీలు విచారణ కమిషన్ ఎదుట హాజరయ్యారు కాని ప్రమాణం చేసి తమ వాదన వినిపించడానికి సిద్దపడలేదు. ఈ కమిషన్ విచారణ చేస్తున్నదా?లేక పరిశోధన చేస్తున్నదా అన్న సంశయాన్ని వ్యక్తం చేస్తూ వారు కమిషన్ కు తమ వివరణ ఇవ్వలేదు. ఇందిరాగాంధీ నాలుగుసార్లు కమిషన్ ఎదుట హాజరైనా అలాగే చేశారు. అప్పటికే జనత ప్రభుత్వంపై ప్రజలలో కొంత వ్యతిరేకత రావడం,ఆమెను అరెస్టు చేయడం,కోర్టు వదలిపెట్టడం వంటి పరిణామాలు, మధ్యలో ఒక రోజు ఆమె ఆగ్రా పర్యటనకు వెళ్లినప్పుడు అశేష ప్రజానీకం హాజరవడం వంటి పరిణామాలు మొత్తం రాజకీయాలను మార్చివేశాయి. ఈలోగా మొరార్జీ ప్రభుత్వాన్ని చరణ్ సింగ్ పడగొట్టి ఇందిర సాయంతోనే ప్రధాని కావడం,ఆ తర్వాత ఆ ప్రభుత్వం పడిపోయి ఎన్నికలు వచ్చి తిరిగి ఆమె ప్రభుత్వపగ్గాలు అందుకున్నారు. దాంతో షా విచారణ కమిషన్ నివేదిక వల్ల ఆమెకు వ్యక్తిగతంగా కొంత చికాకు ఏర్పడింది తప్ప ,రాజకీయంగా నష్టం జరగలేదు. పైగా లాభం చేకూరింది. ప్రజలలో ఇందిరాగాంధీని వేధిస్తున్నారన్న భావన బలపడింది. ఎమర్జెన్సీని పెట్టకపోతే దేశం విదేశీ శక్తుల హస్తగతం అయ్యేదన్న వాదనను ఆమె ప్రచారం చేశారు.ఆ రకంగా షా కమిషన్ నివేదిక చరిత్ర పుటలకే పరిమితం అయ్యిందని చెప్పవచ్చు. ఉమ్మడి ఎపిలో కూడా కొన్ని విచారణ సంఘాలు మాజీ న్యాయమూర్తుల ఆద్వర్యంలో గతంలో కూడా పనిచేశాయి. ఉదాహరణకు జనతా ప్రభుత్వం 1978 లో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కు సంబంధించి ఒక కమిషన్ ను నియమించింది. వెంగళరావు టైమ్ లో నక్సల్స్ పై జరిగిన ఎన్ కౌంటర్లకు సంబంధించి కేంద్రం జస్టిస్ విమద్ లాల్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ ను నియమించింది.కొంతకాలం విచారణ జరిగినా, ఆ తర్వాత కేంద్రంలో ప్రభుత్వమే మారిపోవడంతో ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ కమిషన్ వల్ల జలగం పెద్ద ఇబ్బంది పడలేదు.కొన్నిసార్లు ఆయా ప్రభుత్వాలు తమపై వచ్చే ఆరోపణల నిగ్గు తేల్చడానికి కమిషన్ లను ఏర్పాటు చేస్తుంటాయి. ఉదాహరణకు కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్తగా మంజూరు చేసిన డిస్టిలరీలు, బ్రూవరీల వ్యవహారంపై టిడిపి చేసిన ఆరోపణలకు సంబందించి విచారణ సంఘాన్ని నియమించారు.దాంతో అప్పట్లో మంత్రిగా ఉన్న కనుమూరు బాపిరాజుతన పదవికి రాజీనామా చేశారు. ఆ విచారణ సంఘం కూడా పెద్దగా కనిపెట్టింది లేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చలనచిత్రాభివృద్ది సంస్థలో జరిగిన అక్రమాలపై ఒక కమిషన్ ను నియమించారు.దాని విచారణకు మాజీ ముఖ్యమంత్రి కోట్ల కూడా హాజరుకావల్సి వచ్చింది.పాతబస్తీలో జరిగిన అల్లర్లపై ఒక విచారణ సంఘం పనిచేసింది. ఇది కూడా ఎవరిపైనా నిర్దిష్ట అబియోగాన్ని రుజువు చేయలేదు. కాకపోతే కొన్ని సూచనలు చేసింది. ఈ కమిషన్ వల్ల ఎవరికి ఇబ్బంది రాలేదు. అలాగే చంద్రబాబు ఉమ్మడి ఎపి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని కమిషన్ లు వేశారు.ఏలేరు భూ పరిహార స్కామ్ పై ఆయన కమిషన్ ను నియమించారు. ఆ కమిషన్ నివేదిక ఇచ్చేలోగా ఆయన ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. విచిత్రంగా ఆ కమిషన్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీనే కోర్టులో ఒక పిటిషన్ వేసింది. విభజిత ఏపీలో గోదావరి పుష్కరాల తొక్కిసలాటకు సంబందించి ఒక రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించారు . దాని ద్వారా ఏ ఒక్కరిపై చర్య తీసుకునే పరిస్థితి రాకపోవడం ఆసక్తికరమైన అంశం.కొన్నిసార్లు ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా ఈ విచారణ సంఘాలను నియమిస్తుంటాయి. ఆ సందర్భాలలో తమకు ఇబ్బంది పెట్టనివారినే వెతికి నియమించుకుంటారన్న అభిప్రాయం ప్రజలలో ఉంది.అదే టైమ్ లో వర్తమాన ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలపై విచారణలకు ఆదేశాలు ఇచ్చినప్పుడు అవి కాస్త సీరియస్ గానే ఉంటాయి. ఈ క్రమంలో జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఎలాంటి సిఫారస్ లు చేస్తుంది.దానిని రేవంత్ ప్రభుత్వం ఏ విధంగా ఆమోదించి తదుపరి చర్య తీసుకుంటుంది అనేది ఆసక్తికర అంశం అవుతుంది. తాను చత్తీస్గడ్ ప్రభుత్వం నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తే అందులో అవినీతి ఏమిటన్నది కేసీఆర్ ప్రశ్న. అలాగే భద్రాద్రి,యాదాద్రి లకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బీహెచ్ఈఎల్ నిర్మాణ కాంట్రాక్టు అప్పగిస్తే దానిలో అక్రమాలు ఎలా ఉంటాయన్నది ఆయన ప్రశ్న.ఈ ప్రాజెక్టులు ఆలస్యం అవడంపై కమిషన్ విచారణ చేసినా ఎంతవరకు ప్రయోజనం ఉంటుందన్నది చర్చనీయాంశం. మన దేశంలో 99 శాతం ప్రాజెక్టులు ఏవీ నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి కావన్నది వాస్తవం. దాని వల్ల వ్యయం పెరిగే మాట నిజం. కేంద్ర ప్రభుత్వ అనుమతులలో జాప్యం, కరోనా సంక్షోభం వంటివాటివల్ల పవర్ ప్లాంట్ లు జాప్యం అయితే తామేమీ చేయగలమని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివాటిపై కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందన్నది చూడాలి. గతంలో ఇందిరాగాంధీ మాదిరి కేసీఆర్ కూడా ఈ విచారణ కమిషన్ లను తనకు రాజకీయంగా ఎంత అడ్వాంటేజ్ గా మార్చుకుంటారో వేచి చూడాల్సిందే.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
కేసీఆర్‌ని మట్టికరిపించిన ఏకైక నేత
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను తొలినాళ్లలో ఎన్నికల్లో ఓ నేత మట్టికరిపించారు. 1983లో కేసీఆర్ టీడీపీ నుంచి పోటీ చేయగా, ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి అనుంతుల మదన్ మోహన్ పోటీ చేశారు. నాటి ఎన్నికల్లో మదన్ మోహన్ కేసీఆర్‌పై 887 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే కేసీఆర్‌కు ఇదే మొదటి ఓటమి కావడం విశేషం. ఆ తర్వాత కేసీఆర్ 13 సార్లు వరుసగా విజయం సాధించారు. ఇందులో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే, ఐదుసార్లు ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు కేసీఆర్. కాగా తనను ఓడించిన మదన్ మోహన్‌ను కేసీఆర్ 1989, 1994లలో వరుసగా ఓడించారు. కొంతకాలానికి రాజకీయాలకు దూరమైన మదన్ మోహన్ 2004లో కన్నుమూశారు. -
బర్త్ డే: కేసీఆర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు
అరవై ఏళ్ల కల.. కోట్ల మంది ఆశయం.. ఎంతో ప్రాణత్యాగాల ఫలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. సుదీర్ఘ కాలం పాటు సాగుతున్న ఉద్యమానికి ఊపిరి పోసి ఎట్టకేలకు మలిదశలో స్వరాష్ట్ర కల సాధ్యమైంది. దానికి మార్గం వేసినది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. రాష్ట్రం కోసం పోరాడి దాన్ని సాధించి అదే రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికవడం కేసీఆర్‌కే చెల్లింది. ఫిబ్రవరి 17వ తేదీ ఆయన జన్మదినం. ఈ సందర్భంగా కేసీఆర్ జీవితంలోని కొన్ని ప్రధాన ఘట్టాలు తెలుసుకోండి. జననం 17 ఫిబ్రవరి, 1954. స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకగా పేర్కొంటారు. కానీ వారి పూర్వీకులది చింతమడక కాదు. ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో వారి భూమి కోల్పోవడంతో చింతమడకకు వలస వచ్చారు. అందుకే జలాశయాల కోసం భూ సేకరణ జరిగినప్పుడుల్లా తాము భూ నిర్వాసితులమేనని కేసీఆర్ చాలాసార్లు గుర్తు చేశారు. కేసీఆర్‌కు ఒక అన్న, తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లు. సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా బి.ఎ డిగ్రీ పట్టా పొందారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రవేశం. మెదక్ జిల్లా యువజన కాంగ్రెస్‌లో కీలక నేతగా మారారు. పదిహేన్నేళ్ల వయసులో.. 1969, ఏప్రిల్ 23న శోభతో వివాహం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ తెలుగు సాహిత్యం పూర్తి చేశారు. అయితే అదే విశ్వవిద్యాలయ శత వసంతాల వేడుకలను పూర్వ విద్యార్థి అయిన కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించడం విశేషం. కేసీఆర్‌కు దైవభక్తి ఎక్కువ. తరచూ యాగాలు చేస్తుంటారు. అందుకే దేవాలయాల అభివృద్ధికి నడుం బిగించారు. యాదాద్రిని అద్భుత రీతిలో తీర్చిదిద్దుతున్నారు. దాదాపు రూ.1,800 కోట్ల వ్యయంతో ఈ ఆలయ పునఃనిర్మాణం చేస్తున్నారు. తిరుమల వేంకటేశ్వరుడికి బంగారు ఆభరణాలు, విజయవాడ కనకదుర్గకు ముక్కు పుడక, కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు బహూకరించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించినట్లు కేసీఆర్ తెలిపారు. కేసీఆర్‌కు ఎన్టీఆర్, అమితాబ్ సినిమాలంటే చాలా ఇష్టం. పౌరాణిక చిత్రాలను బాగా ఎంజాయ్ చేస్తారు. ఘంటసాల పాటలంటే ప్రాణం, ఆ పాటలు విని మంచిమూడ్‌లో వాటిని ఎదుటివారికి వినిపించడమంటే ఆయనకు ఇష్టం. పుస్తక ప్రియుడు. సాహిత్య పుస్తకాలు విపరీతంగా చదువుతారు. పుస్తక ప్రియులతో గంటల తరబడి చర్చల్లో గడుపుతారు. ఓల్గా నుంచి గంగ వరకు ఎన్నెన్నో పుస్తకాలను చదివినట్టు ఆయన పలు సందర్భాల్లో తెలిపారు. దూర ప్రయాణాల్లో కారు డ్రైవింగ్ చేయడం ఆయనకో సరదా. నిత్యం అన్ని పత్రికలు చదివాకే పనిలోకి వెళ్తారు. గల్లీ నుంచి ఢిల్లీ రాజకీయాలు ఆసక్తిగా తెలుసుకుంటారు. రాజకీయ తొలి గురువు మదన్ మోహన్. గురువుపైనే పోటీ చేసి కేసీఆర్ గెలిచారు. కూతురు కవిత అంటే కేసీఆర్‌కు ఎంతో ఇష్టం. కవిత పుట్టాకే రాజకీయాల్లో కలిసొచ్చిందని గట్టి నమ్మకం. అందుకే విదేశాల్లో ఉన్న కవితను పిలిపించారు. ఆమెను నిజామాబాద్ ఎంపీగా పోటీలో నిలిపి గెలిపించేలా చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీని చేశారు. 1975లో రాజకీయాల్లో బిజీ అయి కుమారుడు కేటీఆర్ తొట్టెల వేడకకు కేసీఆర్ ఇంటికి కూడా వెళ్లలేదు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రవేశపెట్టినా చిన్నపిల్లలకు ఇచ్చే కిట్‌కు మాత్రమే కేసీఆర్ తన పేరు పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన పిల్లలకు ‘కేసీఆర్ కిట్’ ఇస్తున్నారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా నవంబర్ 29న నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు పది రోజుల పాటు ఆమరణ దీక్ష చేశారు. ‘ఆ పది రోజులు మానేసిన అన్నం బువ్వ ప్రజలకు బోనంకుండలో బెల్లం బువ్వ అయ్యింది’ అని కవులు పాటలు పాడారు. కేసీఆర్‌కు తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్లంలో మంచి పట్టు ఉంది. అచ్చమైన తెలంగాణ భాష మాట్లాడి ప్రజలను ఆకట్టుకోవడం కేసీఆర్ స్టైల్. కేసీఆర్ ఆయా సందర్భాల్లో మాట్లాడుతున్న సమయంలో పాడిన పద్యాలు.. కవితలు.. పాటలు, డైలాగ్స్ ప్రజలను అమితంగా ఆకట్టుకున్నాయి. ఆసరాతో ఆప్తుడయ్యాడు.. రైతుబంధుతో బంధువయ్యాడు.. రైతుబీమాతో భోజుడయ్యాడు.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో మేనమామయ్యాడు.. కేసీఆర్ కిట్ తో తాతయ్యాడు.. మిషన్ భగీరథ, కాకతీయతో జలాధీశుడయ్యాడు నిరంతర విద్యుత్తుతో వెలుగులు వెదజల్లుతున్నాడు.. కాళేశ్వరంతో జలసిరులు కురిపించాడు.. స్వరాష్ట్రం తెచ్చాడు.. స్వర్ణకాంతులు వెలిగిస్తున్నాడు.. ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ యోధుడా అందుకో ఈ శుభాకాంక్షలు (సోషల్ మీడియాలో వచ్చిన కవిత) రాజకీయం జీవితంలో ప్రధాన ఘట్టాలు సిద్ధిపేటలోని రాఘవపూర్ ప్రధాన వ్యవసాయ కో-ఆపరేటిప్ సొసైటీకి చైర్మన్‌గా కేసీఆర్ బాధ్యతలు నిర్వర్తించారు. తన అభిమాన నటుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రారంభించడంతో కాంగ్రెస్‌ను వదిలి వచ్చేశారు. 1983లో తొలిసారిగా ఎమ్మెల్యేగా సిద్దిపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1989, 1994, 1999, 2001లో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నిక. తొలిసారిగా 1987-88లో మంత్రి అయ్యారు. 1989-1993 వరకు తెలుగుదేశం పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 1999లో ఆంధ్రప్రదేశ్ ఉప శాసన సభాపతిగా ఉన్నారు. 1999లో చంద్రబాబు నాయుడు కేసీఆర్‌కు మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో అసంతృప్తికి లోనయ్యారు. ఈ అసంతృప్తి టీఆర్ఎస్ పార్టీ స్థాపనకు దారి తీసింది. చంద్రబాబు తీరుకు నిరసనగా 2001 ఏప్రిల్ 21న డిప్యూటీ స్పీకర్ పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఏప్రిల్ 27న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. 2003లో న్యూ స్టేట్స్ నేషనల్ ఫ్రంట్ కన్వీనర్‌గా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. 2004 ఎన్నికల్లో తొలిసారి లోక్‌సభకు పోటీ చేశారు. కరీంనగర్ నుంచి ఎంపీగా విజయం. యూపీఏ-1 హయాంలో 2004-06 కాలంలో తొలిసారి కేంద్ర మంత్రి. తెలంగాణపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ 2006లో యూపీఏ నుంచి బయటకు వచ్చారు. కేంద్ర మంత్రిగా, కరీంనగర్ ఎంపీగా రాజీనామా చేశారు. అనంతరం జరిగిన కరీంనగర్ ఉప ఎన్నికలో కేసీఆర్ రెండు లక్షల మెజార్టీతో విజయ దుందుభి మోగించారు. 2009లో మహబూబ్‌నగర్ నుంచి కేసీఆర్ పోటీ చేసి ఎంపీగా గెలిచారు. పాలమూరు ఎంపీగా ఉండి తెలంగాణ బిల్లుపై పార్లమెంట్లో కొట్లాడారు. 2009 నవంబర్ 29న ఆమరణ దీక్ష చేసి పది రోజుల పాటు ఆహారం లేకుండా ఉన్నారు. డిసెంబర్ 9న కేంద్రం ప్రకటనతో దీక్ష విరమించారు. జూన్ 2, 2014న ఏర్పడిన 29వ రాష్ట్రం తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ (గజ్వేల్ ఎమ్మెల్యే) బాధ్యతలు చేపట్టారు. 2018 సెప్టెంబర్ 6వ తేదీన అకస్మాత్తుగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. రెండోసారి టీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొచ్చారు. రెండో దఫా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. -
ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయనతో కేసీఆర్ సమావేశమయ్యారు. ముందుగా ప్రధాని మోదీకి కేసీఆర్ అభినందనలు తెలిపారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, కృష్ణా-గోదావరి నదుల అనుసంధానానికి నిధులు అంశాలను ప్రధానితో ఆయన చర్చించినట్టు సమాచారం. మిషన్ భగీరథ పథకానికి కూడా నిధులు ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ములుగు, నారాయణపేట్ జిల్లాలు కొత్తగా ఏర్పాటు కావడంతో జిల్లాల సంఖ్య 33కు పెరిగింది. అలాగే వికారాబాద్ జిల్లాను జోగులాంబ గద్వాల జోన్ నుంచి చార్మినార్ జోన్ పరిధిలోకి మార్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు మార్పులకు అనుగుణంగా జోనల్ ఉత్తర్వులను సవరించి రాష్ట్రపతి ఉత్తర్వుల జారీకి సహకరించాలని ప్రధానిని కోరినట్టు సమాచారం. దాదాపు గంట పాటు వీరి భేటీ కొనసాగింది. ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. కేసీఆర్ పాటు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, కేశవరావు, పలువురు ఎంపీలు ఉన్నారు. 15 నిమిషాల పాటు సమావేశం సాగింది. రాజీవ్ రహదారి విస్తరణకు కంటోన్మెంట్ భూముల అప్పగించాలని రాజ్‌నాథ్‌ను సీఎం కేసీఆర్ కోరారు. అనంతరం ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు.(చదవండి: అమిత్ షాతో కేసీఆర్ 40 నిమిషాల భేటీ) -
అలాంటి భారత దేశం కావాలి: కేసీఆర్
సాక్షి, నిర్మల్: నరేంద్ర మోదీ అంత అధ్వామైన ప్రధానమంత్రిని ఎప్పుడూ చూడలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. విధానాల గురించి మాట్లాడకుండా, వ్యక్తిగత విమర్శలు చేయడం మోదీకి అలవాటని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే హిందువులు, ముస్లింల మధ్య గొడవలు పెడుతున్నారని ఆరోపించారు. కులాల కుళ్లు, మతాల చిల్లర పంచాయతీ లేని దేశం కావాలని ఆకాంక్షించారు. యువత ప్రచార హోరులో కొట్టుకుపోకుండా మతాల మధ్య చిచ్చుపెట్టే నాయకులకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. దళితులు, గిరిజనులు, మహిళలను గౌరవించినప్పుడు దేశం పురోగామిస్తుందన్నారు. అన్ని మతాలు, కులాలు, వర్గాల ప్రజలు సమాన హోదా, గౌరవంతో బతికే భారత్ దేశం కావాలన్నారు. ప్రజలు పరస్పరం ప్రేమించుకునే భారత్ దేశం కావాలన్నారు. దేశంలో 3 లక్షల 50 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంటే అధ్వాన్న విధానాల కారణంగా 2 లక్షల 20 వేల మెగావాట్లకు మించి వాడలేదని వెల్లడించారు. 70 వేల టీఎంసీ నీళ్లు ఉన్నా వాటిని వాడే తెలివి కేంద్రానికి లేదన్నారు. పసుపు బోర్డు కోసం ఐదేళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నా ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందు ఉందని, జూన్ తర్వాత దేశం ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానున్నట్టు కేసీఆర్ చెప్పారు. దేశానికి కూడా ఎజెండా సెట్ చేయాలన్నారు. 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే జాతీయ స్థాయిలో మన పాత్ర పెరుగుతుందన్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరముందన్నారు. దేశానికి దశ, దిశ చూపించాలన్న ఉద్దేశంతోనే ఫెడరల్ ఫ్రంట్‌ను ప్రస్తావించానని తెలిపారు. -
ఆర్థికాభివృద్ధిలో మేమే నెంబర్ 1
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణను పునర్నిర్మిస్తూనే దేశాభివృద్ధిలో భాగమయ్యామని, ఆర్థికాభివృద్ధిలో ఇదే ఒరవడిని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. సంస్కృతి, సంప్రదాయాల విషయంలో ఆంధ్రా, తెలంగాణలకు చాలా తేడా ఉందని, ఇరు ప్రాంతాల ప్రజల జీవన విధానం కూడా వేరని పేర్కొన్నారు. తెలుగు అనే ప్రత్యేక గుర్తింపు లేదని, భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఆంధ్రా – తెలంగాణల విలీనం చారిత్రక తప్పిదమని వ్యాఖ్యానించారు. అది విఫల ప్రయత్నమని రుజువైందన్నారు. తాము రక్తం చిందకుండా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని పార్క్‌హయత్ హోటల్లో జరిగిన ‘ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్–2018’కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఇందులో ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ అడిగిన పలు ప్రశ్నలకు కేసీఆర్ సవివరంగా సమాధానమిచ్చారు. అభివృద్ధిలో దూసుకుపోతున్నాం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని కేసీఆర్ చెప్పారు. కాగ్ కూడా 16 అంశాల్లో పరిశీలన జరిపి తెలంగాణ అభివృద్ధిలో నంబర్‌వన్ రాష్ట్రమని చెప్పిందని గుర్తుచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.49 లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టామని.. ఇప్పటివరకు రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. తెలంగాణ చరిత్ర తెలిస్తే సంపద సృష్టించింది ఎవరో తెలుస్తుందని స్పష్టం చేశారు. మార్వాడీలు 300 ఏళ్ల కిందటే హైదరాబాద్‌కు వచ్చారని, ఇక్కడి పాతబస్తీలో గుల్జార్‌హౌస్ ఉందని, నిజాం సమయంలోనే హైదరాబాద్ ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. హైదరాబాద్ విషయంలో ఎన్నో అసత్యాలు ప్రచారం చేశారని, ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ఇప్పుడే ఎక్కువ మంది వస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటైన ఆరు నెలల్లోనే విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడ్డామని, ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చే స్థితికి చేరుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణను చిన్న రాష్ట్రమంటే అంగీకరించబోమన్నారు. హైదరాబాద్ చరిత్ర తెలిసిన వారెవరైనా అది తెలంగాణలో అంతర్భాగమేనని అంగీకరిస్తారని.. ఎన్నో మతాల వాళ్లు, ప్రాంతాల వాళ్లు ఇక్కడ కలసి జీవిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌కు దేశ రెండో రాజధానిగా గౌరవమిస్తామంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు. సంపద సృష్టిస్తున్నాం తెలంగాణకు రోజూ 650 లారీల గొర్రెలు దిగుమతయ్యేవని, తాము రూ. 5 వేల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రంలో 50 లక్షల గొర్రెల పంపిణీ చేపట్టామని కేసీఆర్ చెప్పారు. త్వరలోనే రాష్ట్రం నుంచి దేశ విదేశాలకు మేలైన గొర్రెలు, మాంసాన్ని ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుందన్నారు. ఇక తెలంగాణ ఏర్పడే నాటికి 6 వేల మెగావాట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉందని, ఇప్పుడు 14 వేల మెగావాట్లకు పెంచామని చెప్పారు. 2020 నాటికి 28 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలువబోతోందని చెప్పారు. దేశంలోనే గొప్పగా రూ.40 వేల కోట్లతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. కాగితాలపైనే జలాల కేటాయింపులు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కేటాయించిన నీళ్లు కాగితాల్లోనే ఉండేవని, లెక్కల్లో మాత్రమే కనిపించేవని కేసీఆర్ పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు 1,350 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రాజెక్టులు చేపట్టామని చెప్పారు. కేంద్ర జల సంఘం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసించిందన్నారు. మహబూబ్‌నగర్ నుంచి లక్షలాది మంది వలసపోయేవారని, తాము ప్రాజెక్టుల ద్వారా 6.5 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చి వలసలు నివారించామని పేర్కొన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాల కష్టాలు లేకుండా ఏర్పాటు చేశామన్నారు. కల్తీ ఎరువులు, విత్తనాలు రాకుండా చర్యలు తీసుకున్నామని, పీడీ యాక్టు కింద కేసులు పెడుతున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 71 లక్షల మంది రైతులకు ఏటా ఎకరాకు రూ.8 వేల చొప్పున సాగు పెట్టుబడి అందించనున్నామని చెప్పారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకే రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాతో కలపకముందు కూడా ధనిక రాష్ట్రమేనని, ఏపీతో తెలంగాణను పోల్చవద్దని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ మిగులు రాష్ట్రమని, ఏపీకంటే చాలా విషయాల్లో ఎంతో ముందుందని, అసలు పోలికే లేదని చెప్పారు. గుజరాత్‌తోనో, అమరావతితోనే పోల్చవద్దన్నారు. భవిష్యత్తులో ఇక్కడ రైతుల ఆత్మహత్యలనేవే ఉండవన్నారు. హైదరాబాద్‌ను విధ్వంసం చేశారు ఉమ్మడి రాష్ట్రంలో అందమైన హైదరాబాద్ నగరాన్ని ధ్వంసం చేశారని, హైదరాబాద్‌కు గార్డెన్ సిటీగా పూర్వ వైభవం తీసుకురావడమే తమ లక్ష్యమని కేసీఆర్ వెల్లడించారు. 1915లోనే హైదరాబాద్‌లో విద్యుత్ సరఫరా ఉండేదని, ఆ తర్వాతే మద్రాసుకు కరెంటు వచ్చిందని గుర్తు చేశారు. అప్పట్లోనే ఇక్కడ విమానాశ్రయం, టెలిగ్రాఫ్, ప్రత్యేక రైల్వేవ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఉండేవన్నారు. కానీ ఉమ్మడి పాలనలో ఇక్కడి భూములు, నాలాలు కబ్జా చేశారని, వెయ్యి దాకా ఉన్న చెరువులు, కుంటలు మాయమయ్యాయని చెప్పారు. తాము రూ.25వేల కోట్లతో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. సామాజిక, ఆర్థిక స్థితిని బట్టి రిజర్వేషన్లు తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే 90 శాతం ఉన్నారని, కేవలం 10 శాతమే ఉన్నత కులాల వారు ఉన్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఇలా 90 శాతమున్న వారికి 50 శాతం రిజర్వేషన్ ఎలా సరిపోతుందని, బలహీన వర్గాలకు అన్యాయం చేయలేమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో గిరిజనులు 10 శాతముంటే 6 శాతంగా లెక్కగట్టారని, ఇక ముస్లింలు 14 శాతం ఉన్నారని చెప్పారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని, తమిళనాడులో 69శాతం, మహారాష్ట్రలో 52 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఆయా వర్గాల ఆర్థిక పరిస్థితిని చూడాలని.. సామాజిక, ఆర్థిక వెనుకబాటును బట్టే రిజర్వేషన్లు ఉండాలని స్పష్టం చేశారు. కేంద్రంతో మంచి సంబంధాలనే కోరుకుంటామని, సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తామని తెలిపారు. అవినీతిపరులు ఎవరో దేశమంతా తెలుసంటూ కాంగ్రెస్ నేతల విమర్శలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఎవరితో పొత్తుల్లేవు.. స్వతంత్రంగా ఉంటాం టీఆర్ఎస్ పార్టీ యూపీఏలోగానీ, ఎన్డీయేలోగానీ చేరదని.. స్వతంత్రంగానే ఉంటామని కేసీఆర్ చెప్పారు. ఎవరితో వెళ్లాల్సిన పని టీఆర్ఎస్కు లేదని, టీఆర్ఎస్తో కలసి రావాలా, లేదా అన్నది ఇతర పార్టీలు తేల్చుకోవాలని పేర్కొన్నారు. తనకు ఢిల్లీ వెళ్లే ఆలోచనేదీ లేదని, యావత్ తెలంగాణ తన కుటుంబమని, భావోద్వేగాలు తెలంగాణ చుట్టే ఉంటాయని చెప్పారు. తాను ఇక్కడే ఉండి తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలో నంబర్‌వన్‌గా నిలుపుతానన్నారు. మనది సహకార సమాఖ్య వ్యవస్థ అన్న ప్రధాని మాటలను సమర్థిస్తున్నానని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రాల సంపదే జాతి సంపద అని, రాష్ట్రాలు మరింత ఎదిగేందుకు కేంద్రం అవకాశమివ్వాలని కోరారు. రాష్ట్రాలకు అధిక నిధులు, అధికారాలు ఇస్తే.. దేశం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు త్వరలోనే ఎన్నారై పాలసీని తీసుకువస్తామన్నారు. 1969 తెలంగాణ ఉద్యమకారులను గుర్తించామని, వివరాలు తెప్పించి 55 మందికి సాయం చేశామని తెలిపారు. జలదృశ్యం వద్ద అమరవీరుల స్తూపం నిర్మిస్తున్నామని, ఆవిష్కరణ సమయంలో అందరినీ సన్మానించుకుంటామని వెల్లడించారు. అద్భుతమైన సచివాలయం నిర్మిస్తాం రాష్ట్రంలో పాత సచివాలయం సరిగా లేదని, రూ.250 కోట్లతో కొత్త సచివాలయం నిర్మిస్తామని కేసీఆర్ చెప్పారు. ఇది వాస్తు సమస్య కాదన్నారు. విదేశీ ప్రతినిధులు వచ్చిన సందర్భంలో మలేసియా మంత్రి ఒకరు.. సచివాలయం స్థలాన్ని అమ్మేసి కొత్తది కట్టొచ్చు కదా అన్నారని చెప్పారు. ధనిక రాష్ట్రానికి తగినట్టుగా అద్భుతమైన సచివాలయం నిర్మిస్తామన్నారు. ఇక ప్రగతిభవన్ కేసీఆర్ సొంత ఇల్లు కాదని, అది తెలంగాణ సీఎం అధికారిక నివాసమని, కనీసం వందేళ్లు ఎందరో సీఎంలు ఉండేదని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబానికే అన్ని పదవులన్న ఆరోపణ సరికాదని.. కుటుంబ సభ్యులు కూడా ఉద్యమంలో పాల్గొన్నారని, ప్రజలు ఓట్లు వేస్తేనే ఎన్నికయ్యారని చెప్పారు. -
తెలంగాణ చిన్న రాష్ట్రం కాదు
-
హైదరాబాద్‌పై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కంటే తాము ఎంతో ముందున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) అన్నారు. ఇండియా టుడే నిర్వహిస్తున్న ‘సౌత్ కన్క్లేవ్ 2018’ లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు, ఆంధ్రాకు పోలికే లేదని.. తమది ఆర్థికంగా మిగులు రాష్ట్రమని చెప్పారు. సంస్కృతి, సంప్రదాయాల్లో రెండు రాష్ట్రాల మధ్య తేడాలున్నాయన్నారు. అన్నిరంగాల్లో తమ రాష్ట్రం ముందుందని.. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తామే నంబర్‌వన్ అని చెప్పుకొచ్చారు. అభివృద్ధిలో గుజరాత్ కంటే తెలంగాణ ఏమాత్రం తక్కువ కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సన్నిహిత సంబంధాలుండాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, దేశ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు. తెలంగాణ చిన్న రాష్ట్రం కాదు తమ రాష్ట్రం చిన్నది కాదని.. భౌగోళికంగా బిహార్, బెంగాల్ కంటే పెద్ద రాష్ట్రమని వెల్లడించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే 16 రంగాల్లో తెలంగాణ ముందుందని సీఎం కేసీఆర్ తెలిపారు. తాము చెప్పినట్టుగా త్వరలోనే దేశంలో అత్యంత ధనిక రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని దీమా వ్యక్తం చేశారు. అద్భుతాలు చేస్తున్నాం నీటిపారుదల రంగంలో అద్భుతాలు చేస్తున్నామని కేసీఆర్ అన్నారు. వ్యవసాయ రంగంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రోల్‌మోడల్‌గా ఉండబోతోందన్నారు. తాము చేపట్టిన ప్రాజెక్టుల వల్ల రైతు ఆత్మహత్యలు తగ్గాయని తెలిపారు. కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నది తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో గోదాముల సామర్థ్యం 4 లక్షల నుంచి 23 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచామని వివరించారు. అలా చేస్తే స్వాగతిస్తాం హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేస్తే స్వాగతిస్తామని కేసీఆర్ అన్నారు. భాగ్యనగరం భారతదేశ సంస్కృతికి అద్దం పట్టే నగరమని వ్యాఖ్యానించారు. మద్రాసు కన్నా ముందు హైదరాబాద్‌లో విమాన, రైల్వే వ్యవస్థ ఉందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో చెరువులు, పార్కులు ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఎన్నో అంతర్జాతీయ సదస్సులు జరుగుతున్నాయని తెలిపారు. ఆర్థిక వెనుకబాటే ప్రాతిపదిక రిజర్వేషన్లు రాష్ట్రంలోని జనాభా ఆధారంగా ఉండాలని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్థిక వెనుకబాటుతనమే రిజర్వేషన్లకు ప్రాతిపదికగా ఉండాలని, 50 శాతం రిజర్వేషన్లు ఏమాత్రం సరిపోవని అన్నారు. రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలన్నారు. తమిళనాడు, మహారాష్ట్రలో రిజర్వేషన్లు 50 శాతం కంటే ఎక్కువగానే ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రమే నా ఫ్యామిలీ ప్రగతిభవన్ తెలంగాణ సీఎం అధికారం నివాసమని, అందులో కేసీఆర్ ఒక్కరే ఉండరని చెప్పారు. తన తర్వాత వచ్చే ముఖ్యమంత్రులు అందులో ఉంటారని వెల్లడించారు. కొత్త సచివాలయం కట్టడంలో తప్పేమీ లేదన్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తన పిల్లలు గెలిచారన్నారు. తెలంగాణ రాష్ట్రమే తన కుటుంబంగా ఆయన వర్ణించారు. ఒంటరిగా పోటీ 2019 ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. తాము ఎవరితోనూ కలవబోమని, ఎవరైనా తమతోనే కలవాలని అన్నారు. -
జర్నలిస్టులకు కేసీఆర్ దసరా కానుక
-
జర్నలిస్టులకు కేసీఆర్ దసరా కానుక
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జర్నలిస్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. నెల రోజుల్లోనే తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ప్రెస్ మీట్లో మాట్లాడిన కేసీఆర్ ఈ ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే టీబీజీకేఎస్ పుట్టిందని గుర్తు చేశారు. జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ చాన్నాళ్లు గుర్తింపు సంఘాలుగా ఉన్నాయని, వాటి వల్లే వారసత్వ ఉద్యోగాలు పోయాయని ఆరోపించారు. వారసత్వ ఉద్యోగాలు వదులుకుంటున్నట్లు సంతకాలు చేసింది ఆ సంఘాలేనన్నారు. గత ప్రభుత్వాలు సింగరేణి కార్మికుల సమస్యలను, సింగరేణిని అర్ధం చేసుకోలేకపోయాయని చెప్పారు. కార్మికుల అనారోగ్య సమస్యల గురించి అర్ధం చేసుకోలేదని, తాము మాత్రం ఇక నుంచి కార్మికుల తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ వైద్యం అందిస్తామన్నారు. -
యాదాద్రిలో పనుల నత్తనడక
సాక్షి, యాదాద్రి: దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్న చందంగా తయారైంది యాదాద్రి ప్రధానాలయ పునర్నిర్మాణ పనుల ప్రగతి. యాదాద్రి పుణ్య క్షేత్రాన్ని ప్రపంచస్థాయి దివ్య క్షేత్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. సుమారు రూ.1,000 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం కొండపైన శనివారం ప్రారంభం కావాల్సిన ప్రధానాలయం గోపుర నిర్మాణ పనులు వాయిదా పడ్డాయి. కూల్చివేతలు పూర్తికాకపోవడమే ఇందుకు కారణం. పనులను వేగవంతం చేయాలని గత నెల 19న సీఎం యూదాద్రికి వచ్చినప్పుడు అధికారులను ఆదేశించారు. అయినా పనుల్లో వేగం పుంజుకోలేదు. కొం డపై 2.33 ఎకరాల్లో ప్రధానాలయం నిర్మాణాల కోసం చేపట్టిన కూల్చివేతలు ఇంకా పూర్తి కాలేదు. ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం నెలరోజుల క్రితమే కూల్చివేతలు మొత్తం పూర్తి కావాలి. గోపురాలు, శిల్పాల పనులను మొదలుపెట్టాలి. ఇందుకోసం తెచ్చిన రాతి స్తంభాలు కొండపై సిద్ధంగా ఉంచారు. కానీ, ఆయూ పనులు ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కటీ పూర్తి కాలేదు 4 రాజగోపురాలకుగాను ఒక్కటి కూడా పూర్తి కాలేదు. దక్షిణం వైపు లోతైన ప్రాంతం నుం చి నిర్మించాల్సి ఉంది. మిగతావి కొండపైనే నిర్మిస్తున్నా అవి నత్తనడకనే సాగుతున్నా యి. ముందుగా ప్రారంభించిన రిటైనింగ్ వాల్ పనులూ అసంపూర్తిగానే ఉన్నాయి. వారం గడువు ఇచ్చిన అధికారులు ప్రధానాలయ మండపం కూల్చివేతలు ఇప్పటికే పూర్తికావాలి. రెండు ప్రాకారాలు, ఆరు గోపురాలు, స్వర్ణతాపడంతో కూడిన విమాన గోపురం నిర్మించాల్సి ఉంది. కొండపైన ఇతర నిర్మాణాల కూల్చివేత పనులు ఇంకా పూర్తి కాకపోవడంపై ఆర్అండ్బీ ఎస్ఈ మోహన్‌నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు. -
కలెక్టర్ బదిలీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఉత్కంఠకు తెర వీడింది. జిల్లా కలెక్టర్ నడిమట్ల శ్రీధర్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. సింగరేణి కాలరీస్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా పోస్టింగ్ ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లా కలెక్టర్‌గా ఇంకా ఎవరికి పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం.. కొత్తవారిని నియమించేవరకు శ్రీధ ర్ పూర్తిస్థాయిలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారని స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్‌కు కూడా ఆయనే ఇన్చార్జిగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. 1997 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శ్రీధర్ గత జూన్ 17న కలెక్టర్‌గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుఅభిమానాన్ని చూరగొన్న శ్రీధర్.. ప్రతిష్టాత్మక సింగరేణి చైర్మన్ గిరిని దక్కించుకోగలిగారు. శ్రీధర్ పేరుకు కేంద్రం కూడా ఆమోదముద్ర వేయడంతో ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సీఎండీగా నియమిస్తూ బదిలీ చేసింది. కాగా, కొత్త కలెక్టర్ ఎవరనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోనే కీలక జిల్లాగా పరిగణించే ఈ పోస్టుకు ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల విభజన ప్రక్రియకు బుధవారం పుల్‌స్టాప్ పడనున్న నేపథ్యంలో జరిగే బదిలీల్లో రంగారెడ్డి జిల్లాకు కొత్త కలెక్టర్‌ను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ పదవికి ప్రస్తుతం కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న రఘునందన్‌రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సామాజిక సమీకరణలు, సీఎం కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయన ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కేడర్‌కు ఖరారు కావడంతో బుధవారం ఆయన ఏపీ రాష్ట్రం నుంచి రిలీవ్ కానున్నారు. కలెక్టర్ శ్రీధర్ నిర్వహించిన పదవులు కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో 1971 జూన్ 1న జన్మించిన శ్రీధర్, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్(ఈసీఈ) పూర్తి చేశారు. 1997లో ఐఏఎస్ ఎంపికైన ఆయన తొలుత రాజమండ్రి సబ్‌కలెక్టర్‌గా.. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. అక్కడి నుంచి నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా, పోర్టుల డెరైక్టర్‌గా కాకినాడలో విధులు నిర్వర్తించారు. అనంతరం అనంత పురం, కృష్ణా, వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా సీఎంవోలో ముఖ్య భూమిక పోషించారు. అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా నియమితులైన ఆయన సుమారు ఆరు నెలలపాటు జిల్లాలో సేవలందించారు. కాగా, నాలుగు జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేసిన అధికారిగానే కాకుండా... సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపడుతున్న యువ ఐఏఎస్‌గా శ్రీధర్ గుర్తింపు పొందనున్నారు. -
పిల్లల ఫీజు కట్టలేరు కానీ సింగపూర్ కడతారా ?
హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొ. జయశంకర్ విశ్వవిద్యాలయంగా నామకరణం చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రొ.జయశంకర్ జయంతి సందర్బంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆయన విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్‌లో పేర్లు మార్చాల్సిన సంస్థలు చాలా ఉన్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కేసీఆర్ ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. మీ బతుకులు మీరు బతకండి... మా బతకులు మేం బతుకుతామంటూ ఆంధ్ర ప్రభుత్వానికి, నాయకులకు సూచించారు. సింగపూర్ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం, మంత్రులు తెగ గోప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సింగపూర్ కడతామని చెబుతున్న మీరు పిల్లల ఫీజులు కట్టలేరా అంటు కేసీఆర్ ఆంధ్ర సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. -
టీఆర్ఎస్కే లోకల్ సర్కారు రావడంతో అనుకూలం
- హంగ్ మండలాల్లో అధికం గులాబీకే.. - మునిసిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి - జెడ్పీ పీఠంలో దొంతి నిర్ణయమే కీలకం సాక్షి ప్రతినిధి, వరంగల్ :తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుండడంతో పుర, ప్రాదేశిక పీఠం పోరు రసవత్తరంగా మారింది. జిల్లా, మండల పరిషత్... మునిసిపల్ చైర్మన్ల ఎన్నికల్లో కొత్త రాజకీయం మొదలైంది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌తోపాటు మెజారిటీ మండల పరిషత్‌లు, మునిసిపల్ చైర్మన్ పదవులు గులాబీ దళానికే దక్కే అవకాశం కనిపిస్తోంది. స్థానిక సంస్థల్లో మెజారిటీ పదవులను దక్కించుకునేందుకు టీఆర్ఎస్ అన్ని రకాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠాన్ని కచ్చితంగా దక్కించుకునేలా రాజకీయాల జోరు పెంచింది. జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా... కాంగ్రెస్‌కు 24, టీఆర్ఎస్కు 18, టీడీపీకి 6, బీజేపీకి ఒకటి దక్కారుు. స్వతంత్రులు ఒక మండలంలో గెలిచారు. కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించినా... ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీకి చైర్మన్ పదవి దక్కే పరిస్థితి లేదు. వరంగల్ జెడ్పీ పీఠం విషయంలో టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులతోతో హైదరాబాద్‌లో క్యాంపు నిర్వహిస్తోంది. కాంగ్రెస్‌లోని కొందరిని తమ వైపునకు తిప్పుకునే వ్యూహానికి పదునుపెడుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుండడంతో ఇది జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలే అంగీకరిస్తున్నాయి. కాంగ్రెస్ సైతం జెడ్పీ పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినా... సాధారణ ఎన్నికల ఫలితాలతో డీలా పడిపోయింది. ఎమ్మెల్యే అభ్యర్థులెవరూ క్యాంపు నిర్వహణ విషయంలో ముందుకు రావడంలేదు. అరుుతే టీ పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా కావడంతో చైర్మన్ పదవిని చేజిక్కించుకునేందుకు ఆఖరు వరకు ప్రయత్నించే అవకాశం ఉంది. జెడ్పీ చైర్పర్సన్ పదవి ఎవరికి దక్కాలనే విషయంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నిర్ణయం కీలకం కానుంది. కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుల్లో నర్సంపేట నియోజకవర్గంలోని నర్సం పేట, చెన్నారావుపేట, ఖానాపూర్, నెక్కొండ మండలాల నుంచి గెలిచిన వారు దొంతికి విధేయులుగా ఉన్న వారే. గూడూరు కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుడు, కొత్తగూడతోపాటు మరో ముగ్గురు... మొత్తం 9 మంది జెడ్పీటీసీలు దొంతి మాధవరెడ్డి శిబిరంలో ఉన్నారు. టీఆర్ఎస్కు చెందిన 18 మంది జెడ్పీటీసీలకు వీరు కలిస్తే ఆ పార్టీకి చైర్మన్ పదవి దక్కుతుంది. ఈ క్రమంలో దొంతి మాధవరెడ్డి నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పొన్నాల లక్ష్మయ్య తనకు టికెట్ రాకుండా చేశారని భావిస్తున్న దొంతి ఇదివరకే ఆయనపై ఫైర్ అయ్యూరు. ఈ నేపథ్యంలో టీ పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల కొనసాగింనంత కాలం ఆయన కాంగ్రెస్‌లోకి మళ్లీ వచ్చేది అనుమానంగానే కనిపిస్తోంది. దీన్ని అనుకూలంగా మార్చుకుని జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. మండల పరిషత్‌లలో... జిల్లాలోని 50 మండల పరిషత్‌లకు సంబంధించి కాంగ్రెస్‌కు 18, టీఆర్ఎస్కు 14, టీడీపీకి 3, న్యూ డెమోక్రసీకి ఒకటి దక్కే పరిస్థితి ఉంది. మిగిలిన 14 మండల పరిషత్‌లలో ఎవరికీ మెజారిటీ రాలే దు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుండడంతో వీటిలో ఎక్కువ మండల పరిషత్ అధ్యక్ష పదవులు ఈ పార్టీకే దక్కనున్నాయి. హంగ్ పరిస్థితులు ఏర్పడిన కేసముద్రం, గోవిందరావుపేట, ములుగు, వెంకటాపూర్, మొగుళ్లపల్లి, రేగొండ, జఫర్‌గఢ్, లింగాలఘణపురం, హన్మకొండ మం డలాలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనే ఉన్నాయి. ఈ తొమ్మిది మండల పరిషత్‌లు టీఆర్ఎస్కు దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన ఐదు మండల పరిషత్‌లనూ దక్కించుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది. మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో... జిల్లాలోని జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీతోపాటు పరకాల, భూపాలపల్లి, నర్సంపేట చైర్పర్సన్ పదవులను దక్కించుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. జనగామ మునిసిపాలిటీలో కాంగ్రెస్‌కు మెజారిటీ కౌన్సిలర్ స్థానాలు వచ్చాయి. ఇక్కడ 28 వార్డులు ఉంటే కాంగ్రెస్ 14 గెలుచుకుంది. టీఆర్ఎస్ 6, బీజేపీ, స్వతంత్రులు, సీపీఎం కలిసి 14 గెలిచాయి. జనగామ ఎమ్మెల్యే స్థానం టీఆర్ఎస్ గెలవడంతో మునిసిపల్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మెజారిటీ లేకున్నా గత మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు టీఆర్ఎస్ అనుసరిస్తోంది. హంగ్ పరిస్థితులు ఏర్పడిన మహబూబాబాద్, భూపాలపల్లిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు. దీంతో ఈ రెండు మునిసిపాలిటీలు గులాబీ పార్టీకి దక్కనున్నాయి. పరకాలలో ఎక్కువ వార్డులో గెలిచిన టీఆర్ఎస్కు ఇప్పుడు ప్రభుత్వం రావడం అనుకూలంగా మారింది. నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వర్గానికి మెజారిటీ సీట్లు వచ్చాయి. ప్రభుత్వం వచ్చినా ఇక్కడ టీఆర్ఎస్ తరఫున చైర్మన్ ఎన్నికయ్యే పరిస్థితి కనిపించడంలేదు. -
కేసీఆర్‌కు బార్ అసోసియేషన్ శుభాకాంక్షలు
వరంగల్ లీగల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును శనివారం బార్ అసోసియేషన్ ప్రతినిధి బృందం కలిసి శుభాకాంక్షలు తెలిపింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. అలాగే న్యాయవాదుల సంక్షేమం కోసం 500 కోట్ల రూపాయలతో ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన ఉంటుందని కేసీఆర్ తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం తొలి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన న్యాయవాదులకు హామీ ఇచ్చారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గుడిమల్ల రవికుమార్, సూరం నర్సింహస్వామి, కార్యవర్గ సభ్యులు గురి, రంజిత్‌కుమార్, ఎన్.వసంతియాదవ్, సురేష్, న్యాయవాదులు ఉన్నారు. -
కేసీఆర్ ఓ అహంకారి
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ - హరీశ్‌తో ‘బొత్స’కున్న సంబంధాలు నిరూపిస్తా... - కవిత ఎన్ఆర్ఐల చందాలు దుర్వినియోగం చేశారని ఆరోపణ కోరుట్ల, న్యూస్‌లైన్ : టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖ ర్రావు అహంకారి అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ జరిగిన బహిరంగ సభ లో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఆయుధంగా మల్చుకున్న కేసీఆర్‌కు ప్రజలకు సేవ చేయాలనే ధ్యాస ఏమాత్రం లేదన్నారు. ఆయన తపనంతా అధికారం కోసమే అని మండిపడ్డారు. తనను వేలెడంత యాక్టర్ అన్న ఆయనకు తన పవర్ తెలియదని, తెగిస్తే తన సత్తా చూపిస్తానన్నారు. అందరినీ అహంకారంతో తిట్టే కేసీఆర్ రేపు తెలంగాణకు నిధులెలా తెస్తారని ప్రశ్నించారు. ఇతర పార్టీల నాయకులను అహంకారంతో తిడితే ఊరుకోబోరన్నారు. ఉద్యమం పేరుతో ఆయన కూతురు కల్వకుంట్ల కవిత ఎన్ఆర్ఐల నుంచి చందాలు వసూ లు చేశారని ఆరోపించారు. వాటి లెక్కలు చూపడం లేదని తనకు చాలా మంది ఫోన్లు చేశారన్నారు. హరీశ్‌రావుకు ఉత్తరాంధ్ర కాంగ్రెస్ నాయకుడు బొత్స సత్యనారాయణతో ఉన్న సంబంధాలు నిరూపిస్తానన్నారు. ఏ సంబంధం లేకుండా హరీశ్‌రావు విజయనగరం ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. అలస్యమైనా..హంగామా కోరుట్లలో పవన్ సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా మూడు గంటలు ఆలస్యంగా మొదలైంది. అప్పటిదాకా స్థానిక నేతలు బీజేపీకి ఓటేసి గెలిపించాలని కోరుతూ ఉపన్యాసాలతో కాలం గడిపారు. పవన్‌కల్యాణ్ రావడంతో యువకులు ఆనందంతో కేకలు వేశారు. సభ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
10 లక్షల ఎకరాలకు సాగు నీరు
నారాయణఖేడ్/జహీరాబాద్/జోగిపేట, న్యూస్‌లైన్: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. జహీరాబాద్, నారాయణఖేడ్, జోగిపేటలలో జరిగినబహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించారు. నారాయణఖేడ్‌లో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఖేడ్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామన్నారు. సింగూరు ప్రాజెక్టు నీరు కాల్వల ద్వారా వ్యవసాయ భూములకు అందాల్సి ఉందన్నారు. నల్లవాగు డైవర్షన్‌తో మరో ఐదు వేల ఎకరాలకు సాగు నీటిని అందించవచ్చన్నారు. ఖేడ్ నియోజకవర్గంలో ఫ్యాక్షనిజం మాయం కావాలన్నారు. రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామన్నారు. రైతులు వ్యవసాయం కోసం వాడుకునే యంత్రాలకు రవాణా పన్ను రద్దు చేస్తామన్నారు. తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఇక పని లేదన్నారు. ఈసారి ఖేడ్‌లో టీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని కోరారు. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్, ఖేడ్ అసెంబ్లీ అభ్యర్థి ఎం.భూపాల్‌రెడ్డిలను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. జహీరాబాద్‌లో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. సింగూరు, నారింజ ప్రాజెక్టుల నీటిని జహీరాబాద్ ప్రాంత వ్యవసాయ రంగానికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. జహీరాబాద్‌కు పక్కనే ఉన్న సింగూరుతో పాటు సాగుకు ఏ మాత్రం ఉపయోగపడకుండా ఉన్న నారింజ ప్రాజెక్టు నీటిని, స్థానికంగా ఉన్న బడంపేట, ఏడాకులపల్లి, జీర్లపల్లి ప్రాంతాల్లోని చిన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా నియోజకవర్గంలో లక్ష ఎకరాల వ్యవసాయ భూమిని సాగులోకి తీసుకురావచ్చన్నారు. దీంతో ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందన్నారు. జహీ రాబాద్ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఎండీ ఫరీదుద్దీన్‌కు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని, పార్టీలోనూ ఎలాంటి ప్రాధాన్యతనివ్వడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ను వీడి తమ పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామన్నారు. జహీరాబాద్ ప్రాంతం బాగా వెనుకబడి ఉందన్నారు. దీనిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జహీరాబాద్ నియోజకవర్గంలో 5వేల ఇళ్లను పేదలకు కట్టించి ఇస్తామన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి భీంరావు బసంత్‌రావు పాటిల్, అసెంబ్లీ స్థానం నుంచి కె.మాణిక్రావులను కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు. జోగిపేటలో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని అన్నారు. జోగిపేట ప్రజలు కూడా బస్సు మిస్సు కావద్దని, అధికార పార్టీలో ఉంటేనే లాభపడతామని, లేకుంటే నష్టపోతామని అన్నారు. మన తలరాత మనమే రాసుకుందామని సూచించారు. జోగిపేటను సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేస్తానని తెలిపారు. తాను మొదట్లో బాబూమోహన్‌ను అందోల్ నియోజకవర్గంలో పోటీ చేయించినప్పుడు. ఇక్కడేమి గెలుస్తారంటూ చాలా మంది వెటకారం చేశారని, అయినా అందరం కలిసి గెలిపించుకుని రూ.100 కోట్ల అభివృద్ధి చేశామన్నారు. రైతులకు రుణ మాఫీ, పక్కాఇళ్ల నిర్మాణం వంటి పథకాలను పకడ్బంధీగా అమలు చేస్తామన్నారు. అందోల్ అసెంబ్లీ అభ్యర్థి పి.బాబూమోహన్, ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ను కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. దామోదర ఊసెత్తని కేసీఆర్ మాజీ డిప్యూటీ సీఎం సి.దామోదర రాజనర్సింహ ప్రతిరోజూ ప్రచారంలో కేసీఆర్‌పై దుమ్మెత్తి పోస్తున్నా.. కేసీఆర్ మాత్రం పల్లెత్తుమాట అనకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఏ పార్టీని కానీ, అభ్యర్థులను కానీ విమర్శించకుండా తన ప్రసంగాన్ని ముగించారు. -
నేడు జిల్లాకు కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర్‌రావు గురువారం జిల్లాకు రానున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చివ రి విడత ప్రచారంగా ఆయన సుడిగాలి పర్యటన చేయనున్నారు. నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు కవరయ్యేలా కేసీఆర్ పర్యటన ఖరారు చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు ఆయన సభలు ఉన్న ప్రాంతాల లో భారీగా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి జిల్లాలో పర్యటించే కేసీఆర్ నిజామాబాద్ అర్బన్ మినహా ఎనిమిది సెగ్మెంట్లలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ లు చేసిన వ్యాఖ్యలకు దీటైన సమాధా నం చెప్పనున్నారని పార్టీ వర్గాలు పే ర్కొన్నాయి. టీఆర్ఎస్ ఆవిర్భావం, ఉద్యమ నేపథ్యం, తెలంగాణ ఏర్పాటు తదితర అంశాలను ప్రజలకు సభ ల ద్వారా కేసీఆర్ వివరించనున్నారు. జిల్లాలోని జుక్కల్ నుంచి కామారెడ్డి వరకు ప్రచార సభల్లో పాల్గొన్న అనంతరం కేసీఆర్ సాయంత్రం 5.20 గం టలకు హెలికాప్టర్లో మెదక్ బయలుదేరి వెళ్తారు. -
'కేసీఆర్ వ్యవహరం నేతి బీరకాయ చందం'
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తనదైన శైలిలో బుధవారం కరీంనగర్లో విమర్శనాస్త్రాలు సంధించారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రోజుకో సిద్ధాంతాలు పేరుతో... పూటకో మాట మాట్లాడతారని ఆరోపించారు. అలాంటి వారి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని కేసీఆర్‌ని విమర్శించారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంతో ఉంటుందో కేసీఆర్ మాటల్లో నిజం కూడా అంతే ఉంటుందంటూ కేసీఆర్‌ను ఎద్దేవా చేశారు. తెలంగాణ ద్రోహులతో పొత్తు పెట్టుకునేందుకు టీఆర్ఎస్ తహతహలాడుతుందని... అలాంటి పార్టీకి కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. కరీంనగర్ లో ఈ రోజు జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ సభ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఆ సభకు ఇప్పటికే భారీగా ప్రజలు తరలివచ్చారు. -
తెలంగాణను మోసం చేసింది 'ఆ ఇద్దరే'
తెలంగాణను మోసం చేసింది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్లే అని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి జి.వివేక్‌లు ఆరోపించారు. మంగళవారం వారు హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ... తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్‌తో సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో కేసీఆర్ సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ఉద్యమద్రోహులకు కేసీఆర్ టిక్కెట్లిచ్చారని వారు విమర్శించారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను పార్టీలో విలీనం చేస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్‌లు కాంగ్రెస్ అధిష్టానానికి మాట ఇచ్చారని గుత్తా, వివేక్‌లు గుర్తు చేశారు. ఇచ్చిన మాటను టీఆర్ఎస్ విస్మరించిందని అన్నారు. కానీ తెలంగాణ ఇస్తామన్న మాటకు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా కట్టుబడి... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంస్థను సరిగ్గా నడపలేని కేసీఆర్.... తెలంగాణను ఎలా పునర్నిర్మిస్తాంటూ వివేక్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. గుజరాత్ లోని గోద్రా అల్లర్లకు ముఖ్య కారకుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీ అని గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారని వారు గుర్తు చేశారు. అలాంటి బాబు ప్రస్తుతం మతోన్మాద శక్తులకు ఎందుకు మద్దతిస్తున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. -
టీఆర్ఎస్ ఓ పిల్లకాకి... కేసీఆర్ పెద్ద అవకాశవాది
టీఆర్ఎస్ పార్టీ ఓ పిల్లకాకి అని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. నిన్న కాక మొన్న పుట్టిన టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోని కాపీ కొట్టాల్సిన అవసరం తమ పార్టీకి లేదని పొన్నాల స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్ విచ్చేసిన పొన్నాల విలేకర్లతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమేత్తారు. కేసీఆర్ పెద్ద అవకాశవాది అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఓ విధమైన నిరాశ, నిస్పృహలతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడైన ప్రజా సంక్షేమం కోసం ఓ పథకం గురించి మాట్లాడారా అంటూ కేసీఆర్‌ను పొన్నాల ప్రశ్నించారు. తెలంగాణను అడ్డుకున్న వారిని, తెలంగాణ ద్రోహులను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న ఘనత కేసీఆర్‌దని పొన్నాల నిప్పులు చెరిగారు. ఈ నెల 16న సోనియాగాంధీ కరీంనగర్ వేదికగా బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపారు. ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లను పొన్నాల ఈ సందర్బంగా పర్యవేక్షించారు. -
జై రాం రమేష్ ... ఖబడ్దార్ : కేసీఆర్
కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్‌పై టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) నిప్పులు చెరిగారు. శనివారం హైదరాబాద్‌లో కేసీఆర్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... సర్పంచ్‌గా కూడా గెలవలేని జైరాం రమేష్ తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఉరుకోమని ...ఖబడ్దార్, జాగ్రత్తగా మాట్లాడు అంటూ జై రాం రమేష్‌పై కేసీఆర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఆచరణ సాధ్యమైన అంశాలన్ని తమ మేనిఫెస్టోలో పొందుపరిచామని చెప్పారు. అయితే టీఆర్ఎస్ మేనిఫెస్టోని కాంగ్రెస్ కాపీ కొట్టిందని ఆయన విమర్శించారు. ఈ నెల 16 నుంచి తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. 3 డీ టెక్నాలజీ ద్వారా 700 సభలు తెలంగాణలో నిర్వహిస్తామని తెలిపారు. 3 డీ టెక్నాలజీ కోసం రూ. 5 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రాంతంలో ప్రచారం చేసిన విజయం మాత్రం టీఆర్ఎస్ పార్టీదే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గెలుపే ధ్యేయంగా టికెట్లు కేటాయించడం వల్ల కొంత మందికి సీట్లు ఇవ్వలేకపోయామని... అయితే రానున్న రోజుల్లో వారందరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. బీసీలను సీఎం చేస్తామన్న టీడీపీ పార్టీ కేవలం 15 సీట్లిస్తే తమ పార్టీ 30 సీట్లు బీసీలకు కేటాయించామని కేసీఆర్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. -
కేసీఆర్ కోసం వచ్చిన ప్రొ. జయశంకర్ సోదరుడికి...
తెలంగాణ సిద్దాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ సోదరుడు వాసుదేవరావుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నివాసం వద్ద అవమానం జరిగింది. కేసీఆర్‌ను కలసిందుకు ఆయన నివాసానికి వెళ్లిన వాసుదేవరావును ఆయన భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతి లేకుండా లోనికి ప్రవేశించేందుకు అనుమతించమని కేసీఆర్ భద్రత సిబ్బంది వాసుదేవరావుకు కరకండిగా చెప్పారు. చేసేది లేక ఆయన వెనుదిరిగారు. వాసుదేవరావు తిప్పిపంపిన ఘటనపై సమాచారం అందుకున్న కేసీఆర్... టీఆర్ఎస్ నాయకుడు నాయిని నర్శింహరెడ్డిని రంగంలోకి దింపారు. ఈ నేపథ్యంలో్ వాసుదేవరావుతో నాయిని ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. రానున్న ఎన్నికల్లో తమ కుటుంబసభ్యులలో ఒకరికి వరంగల్ జిల్లా నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని కేసీఆర్‌ను కోరేందుకు వాసుదేవరావు నగరానికి వచ్చినట్లు సమాచారం. అయితే కేసీఆర్ భద్రత సిబ్బంది వాసుదేవరావును వెనక్కి పంపడంపై పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. -
గెలిచే స్థానాల్లో కేసీఆర్ వారసులా ?
రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థులు జాబితా ప్రకటించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై టి.టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం నిప్పులు చెరిగారు. విజయం సాధించే స్థానాలు మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు కేటాయించుకుని ... ఓడిపోతామనుకున్న స్థానాలను విద్యార్థులు, ఉద్యమకారులకు కేటాయించారని ఎర్రబెల్లి ఆరోపించారు. తెలంగాణ తొలి సీఎం దళితుడ్ని చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరు లేరన్నారు. కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారని కేసీఆర్‌పై ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆస్తులు పెంచుకునే పనిలో నిమగ్నమైయ్యారని ఎర్రబెల్లి ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. -
కెసిఆర్ చెప్పేవన్నీ అవాస్తవాలే!
-
'ప్రభుత్వ ఏర్పాటుపై టీఆర్ఎస్ కలలు కంటోంది'
ప్రభుత్వ ఏర్పాటుపై టీఆర్ఎస్ కలలు కంటోందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనే అతృతలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్నారని ఆరోపించారు. గతంలో తెలంగాణ సీఎం పదవి దళితుడు, డిప్యూటీ సీఎం పదవి మైనార్టీలకు ఇస్తామని గతంలో కేసీఆర్ చేసిన హామీలు ఏ గాలికి కొట్టుకుపోయానని విమర్శించారు. ఆ హామీలపై నోరు విప్పాలని పొన్నాల ఈ సందర్భంగా కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ అభివృద్ధికి విఘాతం కలిగించేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు కుదిరినట్లు విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా పొన్నాల వెల్లడించారు. -
'మోసానికి మారు పేరు టీఆర్ఎస్'
కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదంటూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించారు.ఆదివారం హైదరాబాద్‌లో రాజనర్సింహ మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పడిన అనంతరం టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ఇప్పుడు కేసీఆర్ మాట తప్పారని రాజనర్సింహా ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ దగా, మోసం, వంచనలకు మారు పేరని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చిన మాటను కేసీఆర్ నిలబెట్టుకోలేదని విమర్శించారు. టీఆర్ఎస్తో పొత్తు, విలీనం ఉంటుందని మేం ఎప్పుడు చెప్పలేదన్నారు. అయిన టీఆర్ఎస్తో పొత్తు తమకు అవసరం లేదన్నారు. టీఆర్ఎస్ పునర్ నిర్మాణం అంటే గడీల నిర్మాణమేనని ఆయన అభివర్ణించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పూర్తి నమ్మకం తమకుందన్నారు. తెలంగాణపై ఇచ్చిన మాటకు కట్టుబడిన ఘనత యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీదని దామోదర రాజనర్సింహా ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైంది
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని ఆ పార్టీ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తమ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత అసలు సిసలు సవాళ్లు ఎదురవుతాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కొని పోరాడి ముందుకు సాగాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈటెల రాజేందర్ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
'రహస్య ఒప్పందాలు చేసుకోవడం కేసీఆర్‌కు అలవాటే'
-
'రహస్య ఒప్పందాలు చేసుకోవడం కేసీఆర్‌కు అలవాటే'
ప్యాకేజీల కోసం తెలంగాణపై ఆంక్షలకు... టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అంగీకరించే అవకాశం ఉందని ఎమ్ఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అభిప్రాయపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ... రహస్య ఒప్పందాలు చేసుకోవడం కేసీఆర్‌కు అలవాటే అని ఆరోపించారు. హైదరాబాద్‌పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే కొడుకు కేటీఆర్, కూతురు కవిత, అల్లుడు హరీశ్ రావుల కోసం ఒప్పుకుంటారనే ఓ విధమైన ఆందోళన తనకు ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై తెలంగాణ ప్రజలకు వెంటనే సమాధానం చెప్పాలని ఆయన కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. సీఎం పదవి ఇస్తే చాలు ఎటువంటి ఆంక్షలు విధించిన ఒప్పుకుంటామనే రీతిలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్న వైఖరిని మందకృష్ణ మాదిగ ఈ సందర్బంగా దుయ్యబట్టారు.