నేడు జిల్లాకు కేసీఆర్ | today kcr going at nizamabad | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాకు కేసీఆర్

Published Thu, Apr 24 2014 1:02 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

నేడు జిల్లాకు కేసీఆర్ - Sakshi

నేడు జిల్లాకు కేసీఆర్

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర్‌రావు గురువారం జిల్లాకు రానున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చివ రి విడత ప్రచారంగా ఆయన సుడిగాలి పర్యటన చేయనున్నారు. నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు కవరయ్యేలా కేసీఆర్ పర్యటన ఖరారు చేశారు.

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు ఆయన సభలు ఉన్న ప్రాంతాల లో భారీగా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి జిల్లాలో పర్యటించే కేసీఆర్ నిజామాబాద్ అర్బన్ మినహా ఎనిమిది సెగ్మెంట్లలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు.

ఇటీవల ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ లు చేసిన వ్యాఖ్యలకు దీటైన సమాధా నం చెప్పనున్నారని పార్టీ వర్గాలు పే ర్కొన్నాయి.

టీఆర్‌ఎస్ ఆవిర్భావం, ఉద్యమ నేపథ్యం, తెలంగాణ ఏర్పాటు తదితర అంశాలను ప్రజలకు సభ ల ద్వారా కేసీఆర్ వివరించనున్నారు. జిల్లాలోని జుక్కల్ నుంచి కామారెడ్డి వరకు ప్రచార సభల్లో పాల్గొన్న అనంతరం కేసీఆర్ సాయంత్రం 5.20 గం టలకు హెలికాప్టర్‌లో మెదక్ బయలుదేరి వెళ్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement