కేసీఆర్ ఓ అహంకారి | kcr egotist:Pawan kalyan | Sakshi
Sakshi News home page

కేసీఆర్ ఓ అహంకారి

Published Tue, Apr 29 2014 4:18 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

కేసీఆర్ ఓ అహంకారి - Sakshi

కేసీఆర్ ఓ అహంకారి

జనసేన అధినేత పవన్‌కల్యాణ్
- హరీశ్‌తో ‘బొత్స’కున్న సంబంధాలు నిరూపిస్తా...
- కవిత ఎన్‌ఆర్‌ఐల చందాలు దుర్వినియోగం చేశారని ఆరోపణ

 
కోరుట్ల, న్యూస్‌లైన్ : టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖ ర్‌రావు అహంకారి అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ జరిగిన బహిరంగ సభ లో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఆయుధంగా మల్చుకున్న కేసీఆర్‌కు ప్రజలకు సేవ చేయాలనే ధ్యాస ఏమాత్రం లేదన్నారు. ఆయన తపనంతా అధికారం కోసమే అని మండిపడ్డారు. తనను వేలెడంత యాక్టర్ అన్న ఆయనకు తన పవర్ తెలియదని, తెగిస్తే తన సత్తా చూపిస్తానన్నారు.

 అందరినీ అహంకారంతో తిట్టే కేసీఆర్ రేపు తెలంగాణకు నిధులెలా తెస్తారని ప్రశ్నించారు. ఇతర పార్టీల నాయకులను అహంకారంతో తిడితే ఊరుకోబోరన్నారు. ఉద్యమం పేరుతో ఆయన కూతురు కల్వకుంట్ల కవిత ఎన్‌ఆర్‌ఐల నుంచి చందాలు వసూ లు చేశారని ఆరోపించారు. వాటి లెక్కలు చూపడం లేదని తనకు చాలా మంది ఫోన్లు చేశారన్నారు. హరీశ్‌రావుకు ఉత్తరాంధ్ర కాంగ్రెస్ నాయకుడు బొత్స సత్యనారాయణతో ఉన్న సంబంధాలు నిరూపిస్తానన్నారు. ఏ సంబంధం లేకుండా హరీశ్‌రావు విజయనగరం ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.

 అలస్యమైనా..హంగామా
 కోరుట్లలో పవన్ సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా మూడు గంటలు ఆలస్యంగా మొదలైంది. అప్పటిదాకా స్థానిక నేతలు బీజేపీకి ఓటేసి గెలిపించాలని కోరుతూ ఉపన్యాసాలతో కాలం గడిపారు. పవన్‌కల్యాణ్ రావడంతో యువకులు ఆనందంతో కేకలు వేశారు. సభ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement