కేసీఆర్ కోసం వచ్చిన ప్రొ. జయశంకర్ సోదరుడికి...
తెలంగాణ సిద్దాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ సోదరుడు వాసుదేవరావుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నివాసం వద్ద అవమానం జరిగింది. కేసీఆర్ను కలసిందుకు ఆయన నివాసానికి వెళ్లిన వాసుదేవరావును ఆయన భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతి లేకుండా లోనికి ప్రవేశించేందుకు అనుమతించమని కేసీఆర్ భద్రత సిబ్బంది వాసుదేవరావుకు కరకండిగా చెప్పారు. చేసేది లేక ఆయన వెనుదిరిగారు. వాసుదేవరావు తిప్పిపంపిన ఘటనపై సమాచారం అందుకున్న కేసీఆర్... టీఆర్ఎస్ నాయకుడు నాయిని నర్శింహరెడ్డిని రంగంలోకి దింపారు.
ఈ నేపథ్యంలో్ వాసుదేవరావుతో నాయిని ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. రానున్న ఎన్నికల్లో తమ కుటుంబసభ్యులలో ఒకరికి వరంగల్ జిల్లా నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని కేసీఆర్ను కోరేందుకు వాసుదేవరావు నగరానికి వచ్చినట్లు సమాచారం. అయితే కేసీఆర్ భద్రత సిబ్బంది వాసుదేవరావును వెనక్కి పంపడంపై పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది.