
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను తొలినాళ్లలో ఎన్నికల్లో ఓ నేత మట్టికరిపించారు. 1983లో కేసీఆర్ టీడీపీ నుంచి పోటీ చేయగా, ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి అనుంతుల మదన్ మోహన్ పోటీ చేశారు. నాటి ఎన్నికల్లో మదన్ మోహన్ కేసీఆర్‌పై 887 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
అయితే కేసీఆర్‌కు ఇదే మొదటి ఓటమి కావడం విశేషం. ఆ తర్వాత కేసీఆర్ 13 సార్లు వరుసగా విజయం సాధించారు. ఇందులో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే, ఐదుసార్లు ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు కేసీఆర్. కాగా తనను ఓడించిన మదన్ మోహన్‌ను కేసీఆర్ 1989, 1994లలో వరుసగా ఓడించారు. కొంతకాలానికి రాజకీయాలకు దూరమైన మదన్ మోహన్ 2004లో కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment