నల్గొండ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం జై తెలంగాణ అంటూ ప్రసంగం ప్రారంభించిన మాజీ సీఎం కేసీఆర్
► నల్గొండ జిల్లా వీటీ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. సభకు వెళ్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బస్సుపై దాడి జరిగింది. బస్సుపైకి కోడిగుడ్లు విసిరి ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. నల్లచొక్కాలు ధరించి ‘గోబ్యాక్ గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. బస్సులో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ఉన్నారు. ఎన్‌ఎస్‌యూఐ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాక్షి, నల్గొండ: కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన చలో నల్లగొండ బహిరంగ సభకు మాజీ సీఎం కేసీఆర్ బయల్దేరారు. సాయంత్రం 4 గంటలకు నిర్వహించే ఈ బహిరంగసభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. నల్లగొండ పట్టణ శివారులో నార్కట్‌పల్లి-అద్దంకి హైవేకు అనుకుని మర్రిగూడ బైపాస్‌లో విశాలమైన స్థలంలో నిర్వహించే బీఆర్‌ఎస్ సభకు ఇప్పటికే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, శ్రేణులు భారీగా చేరుకున్నారు. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు, రైతులు తరలివస్తున్నారు. నల్లగొండతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు తరలిరానుండటంతో సభా ప్రాంగణానికి నలువైపులా జనం చేరుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాహనాల పార్కింగ్ కోసం అన్ని వైపులా ప్రత్యేక స్థలాలను సిద్ధం చేశారు. మరోవైపు సభకు పోలీసు శాఖ 500 మంది సిబ్బందితో బందోబస్తు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి జనంలోకి అడుగుపెడుతుండటంతో ఈ సభపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్ లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించనుంది. అయితే కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగింత విషయంలో రాష్ట్ర ప్రభు త్వం సోమవారం అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో కేసీఆర్ నల్లగొండ సభలో తన ప్రసంగ శైలిని మార్చే అవకాశముంది. 6 నెలల్లోగా నదీ జలాల పంపకం పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నల్లగొండ సభావేదికగా కేసీఆర్ అల్టిమేటం జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. KCR Nalgonda Public Meeting Updates
నీళ్ల కోసం ఉద్యమించాల్సిందే: కేసీఆర్
Published Tue, Feb 13 2024 3:56 PM | Last Updated on Tue, Feb 13 2024 6:03 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment