'రహస్య ఒప్పందాలు చేసుకోవడం కేసీఆర్కు అలవాటే' | manda krishna madiga fire on kalvakuntla chandrashekar rao | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 13 2013 3:02 PM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM

ప్యాకేజీల కోసం తెలంగాణపై ఆంక్షలకు... టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అంగీకరించే అవకాశం ఉందని ఎమ్ఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అభిప్రాయపడ్డారు. బుధవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ... రహస్య ఒప్పందాలు చేసుకోవడం కేసీఆర్కు అలవాటే అని ఆరోపించారు. హైదరాబాద్పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే కొడుకు కేటీఆర్, కూతురు కవిత, అల్లుడు హరీశ్ రావుల కోసం ఒప్పుకుంటారనే ఓ విధమైన ఆందోళన తనకు ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై తెలంగాణ ప్రజలకు వెంటనే సమాధానం చెప్పాలని ఆయన కేసీఆర్ను డిమాండ్ చేశారు. సీఎం పదవి ఇస్తే చాలు ఎటువంటి ఆంక్షలు విధించిన ఒప్పుకుంటామనే రీతిలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్న వైఖరిని మందకృష్ణ మాదిగ ఈ సందర్బంగా దుయ్యబట్టారు.

Advertisement
 
Advertisement
 
Advertisement