ఆంధ్రప్రదేశ్ కంటే తాము ఎంతో ముందున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) అన్నారు. ఇండియా టుడే నిర్వహిస్తున్న ‘సౌత్ కన్‌క్లేవ్ 2018’ లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు, ఆంధ్రాకు పోలికే లేదని.. తమది ఆర్థికంగా మిగులు రాష్ట్రమని చెప్పారు. సంస్కృతి, సంప్రదాయాల్లో రెండు రాష్ట్రాల మధ్య తేడాలున్నాయన్నారు.