India Today Conclave
-
పాక్ సైన్యంతో ప్రమాదమే: సీడీఎస్
న్యూఢిల్లీ: పొరుగుదేశం పాకిస్తాన్ ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నప్పటికీ, ఆ దేశ ఆర్మీతో మనకు ప్రమాదంఎప్పటిలాగానే ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ వ్యాఖ్యానించారు. పాక్ సైనిక సామర్థ్యం చెక్కు చెదరలేదని చెప్పారు. అయితే సరిహద్దులను, ముఖ్యంగా వివాదాస్పద ఉత్తర సరిహద్దులను కాపాడుకోగల సత్తా మన సైన్యానికి ఉందని శనివారం ఇండియా టుడే కాంక్లేవ్‌లో చెప్పారు. ‘చైనా బలపడుతుండటం, ఆ దేశంతో తెగని సరిహద్దు వివాదం మనకు తక్షణ సవాలుగా మారింది. చైనా, పాక్ మనకు బద్ధ శత్రువులు. పైగా వీరివద్ద అణ్వాయుధాలున్నాయి. యుద్ధ రీతుల్లో ఎప్పటికప్పుడు అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మన ఆర్మీకి ఇదే అతి పెద్ద సవాల్‌గా మారింది. కొత్త ఆయుధ వ్యవస్థలను సమకూర్చుకోవడం, సాంకేతికతను అందిపుచ్చుకోవడం, వ్యూహాలు, ప్రతివ్యూహాలను రచించుకోవడం వంటివి కొనసాగుతున్నాయి’’ అని జనరల్ చౌహాన్ చెప్పారు. -
ఆస్కార్ తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్లిన రామ్‌చరణ్, ఎందుకంటే?
ఆస్కార్ సెలబ్రేషన్స్ తర్వాత ఆర్ఆర్ఆర్ టీమ్ అంతా ఇండియాకు వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ రెండు రోజుల క్రితమే రాగా నేడు ఉదయం రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో దిగింది. రామ్‌చరణ్ మాత్రం నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నాడు. ఇందుకు ప్రత్యేక కారణం లేకపోలేదు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లాడు. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ వచ్చిన తర్వాత తొలిసారి చరణ్ మీడియాతో మాట్లాడనున్నారు. రాత్రి 9.30 గంటలకు చెర్రీ ఇంటరాక్షన్ ఉంటుంది. ఇక ఈరోజు జరగనున్న ఇండియా టుడే కాంక్లేవ్‌కు అమిత్ షా, జాన్వీ కపూర్, మలైకా అరోరా సహా తదితర రంగాల్లోని ప్రముఖులు హాజరు కానున్నారు. ఇప్పటికే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఈ సదస్సుకు హాజరై తన ప్రసంగాన్ని పూర్తి చేశాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కొలీజియంలో పారదర్శకత లేదు.. న్యాయవ్యవస్థలో రాజకీయాలు
ముంబై: సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదని కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు అభిప్రాయపడ్డారు. పూర్తి అర్హతలున్న వారిని మాత్రమే న్యాయమూర్తులుగా నియమించాలే తప్ప కొలీజియంకు తెలిసిన వారినెవరినో కాదంటూ పదునైన వ్యాఖ్యలు చేశారు. ‘‘పైగా ఈ పద్ధతి న్యాయవ్యవస్థలోనూ రాజకీయాలకు తావిస్తోంది. న్యాయమూర్తులు బయటికి చెప్పకపోవచ్చు. కానీ అక్కడ లోతైన రాజకీయాలే ఉన్నాయి’’ అంటూ సునిశిత విమర్శలు కూడా చేశారు. బుధవారం ఇండియాటుడే కాంక్లేవ్‌లో న్యాయవ్యవస్థను సంస్కరించే అంశంపై మంత్రి మాట్లాడారు. ‘‘నేను న్యాయవ్యవస్థను గానీ, న్యాయమూర్తులను గానీ విమర్శించడం లేదు. కానీ ప్రస్తుత కొలీజియం వ్యవస్థ పట్ల మాత్రం నాకు చాలా అసంతృప్తి ఉంది. కొలీజియంలోని న్యాయమూర్తులు తమకు తెలిసిన సహచరుల పేర్లనే సిఫార్సు చేస్తున్నారు. ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే కాదు. లాయర్లతో పాటు కొందరు న్యాయమూర్తుల్లో కూడా ఉన్న అభిప్రాయాలనే చెబుతున్నాను. ఏ వ్యవస్థా పరిపూర్ణం కాదు. నిత్యం మెరుగు పరుచుకుంటూ పోవాలి. ప్రతి వ్యవస్థలోనూ జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలి. అలా లేనప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ సంబంధిత మంత్రి కాక ఇంకెవరు మాట్లాడతారు?’’ అని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ కార్యనిర్వాహక పాత్ర పోషించరాదని కుండబద్దలు కొట్టారు. ‘‘నియామక ప్రక్రియలో కేంద్రం కూడా పాలుపంచుకుంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే న్యాయమూర్తుల కొలీజియం సిఫార్సు చేసే పేర్లను ఆమోదించేముందు వాళ్లను గురించి అన్నిరకాల సమాచారం సేకరించే స్వతంత్ర యంత్రాంగం ప్రభుత్వం సొంతం. న్యాయవ్యవస్థకు, న్యాయమూర్తులకు ఈ వెసులుబాటు లేదు. పైగా, వాళ్లు దృష్టి పెట్టాల్సింది న్యాయమూర్తుల నియామకాల వంటి పాలనపరమైన పనుల పైనా, లేక ప్రజలకు న్యాయం అందించడం మీదా?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. జడ్జిలూ... వ్యాఖ్యలెందుకు? నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఏర్పాటును సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని రిజిజు ప్రస్తావించారు. ఈ చర్యపై కేంద్రం తన వైఖరిని ఇంకా స్పష్టం చేయలేదని గుర్తు చేశారు. ‘‘నిజానికి వాళ్లలా కొట్టేసినప్పుడు కేంద్రం కావాలనుకుంటే ఏదో ఒకటి చేసేది. కానీ న్యాయవ్యవస్థ పట్ల గౌరవమున్న కారణంగా ఆ పని చేయలేదు. ఎందుకంటే న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండాలన్నది మోదీ సర్కారు అభిప్రాయం’’ అన్నారు. అంతమాత్రాన తామెప్పుడూ మౌనంగానే ఉంటామని అనుకోవద్దంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలను కూడా రిజిజు తప్పుబట్టారు. ‘‘ఏం చెప్పినా తీర్పుల ద్వారానే చెప్పాలి తప్ప అనవసర వ్యాఖ్యలు చేసి విమర్శలు కొనితెచ్చుకోవద్దు’’ అని సూచించారు. -
రఫేల్ ఉంటే ఫలితం మరోలా ఉండేది
న్యూఢిల్లీ: భారత్ దగ్గర రఫేల్ ఫైటర్జెట్లు ఉండుంటే ఇటీవల పాకిస్తాన్‌తో తలెత్తిన ఘర్షణల ఫలితం మరోలా ఉండేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుతం రఫేల్ యుద్ధవిమానాలు లేనిలోటు స్పష్టంగా తెలుస్తోందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌లోని జైషే ఉగ్రస్థావరాలపై దాడి సందర్భంగా ప్రపంచమంతా భారత్ కు మద్దతు పలికితే, దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఈ దాడుల యధార్థతను ప్రశ్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కొందరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాలకు తోడు ప్రస్తుతం రఫేల్ ఒప్పందంపై జరుగుతున్న రాజకీయాలతో దేశం ఇప్పటికే చాలా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీపై ఉన్న విద్వేషం హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ లాంటి ఉగ్రవాదులకు లబ్ధిచేకూర్చరాదని హితవు పలికారు. ప్రబుత్వ విధానాల్లోని లోపాలపై ప్రతిపక్షాలు విమర్శిస్తే స్వాగతిస్తామనీ, అయితే దేశభద్రతకు సంబంధించిన విషయాల్లో అడ్డంకులు కల్పించవద్దని సూచించారు. ఢిల్లీలో శనివారం జరిగిన ‘ఇండియాటుడే కాన్క్లేవ్ 2019’లో మాట్లాడిన ప్రధాని మోదీ, విపక్షాల తీరును తీవ్రంగా ఎండగట్టారు. భయం మంచిదే.. భారత్ ఐక్యతను చూసి ఇంటాబయటా చాలామంది భయపడుతున్నారని ప్రధాని అన్నారు. ‘భారత వ్యతిరేక శక్తులు, రుణఎగవేతదారులు, అవినీతిపరులు, కొందరు పెద్దనేతలకు ఇప్పుడు భయం కనిపిస్తోంది. జైలుకు పోతామేమో అని వారంతా భయపడుతున్నారు. నిజానికి భయం మంచిదే. ఎందుకంటే 2009లో తమకు 1.86 లక్షల బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు కావాలని భద్రతాబలగాలు కోరాయి. కానీ 2009–14 మధ్యకాలంలో ఒక్కటంటే ఒక్క బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ను కూడా బలగాలకు అందించలేకపోయారు. ఎన్డీయే ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2.30 లక్షల బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లను అందించాం. మా ప్రభుత్వ హయాంలో మధ్యవర్తులు పత్తా లేకుండా పోయారు. ఎందుకంటే మేం అవినీతిని ఎంతమాత్రం సహించబోమని వారికి తెలుసు’ అని మోదీ వెల్లడించారు. నామీద చాలా అనుమానాలు ఉండేవి.. మోదీ లాంటి నేతలు వస్తూపోతూ ఉంటారనీ, దేశం మాత్రం శాశ్వతంగా ఉంటుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘మోదీపై విమర్శలదాడి చేసేక్రమంలో వీళ్లు(ప్రతిపక్షాలు) దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. మోదీపై మీ ద్వేషం హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ వంటి ఉగ్రవాదులకు లబ్ధిచేకూర్చేలా మారకూడదు. మన సాయుధ బలగాలు ఏం చెబుతున్నాయో మీరు వినరా? లేదా మాకంటే మీరు శత్రువులనే ఎక్కువగా నమ్ముతున్నారా?’ అని ప్రధాని విపక్షాలను నిలదీశారు. 2014లో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు తన పై ప్రజలకు చాలా అనుమానాలు ఉండేవని మోదీ గుర్తుచేశారు. ‘అప్పటివరకూ సీఎంగా మాత్రమే ఉన్న నేను ప్రధానిగా ఏ చేస్తానో, విదేశీ విధానం ఏమవుతుందో అని ప్రజలకు అనుమానం ఉండేది. అది మామూలే. ఎందు కంటే నా కుటుంబానికి రాజకీయ నేపథ్యమేదీ లేదు. అలాగే నా ఇంట్లో ఆరుగురు అధికారం వెలగబెట్టలేదు’ అని మోదీ చెప్పగానే సభికులు హర్షధ్వానాలు చేశారు. ప్రజల అంచనాలు అందుకోవడంలో సఫలమయ్యాననే తాను భావిస్తున్నట్లు మోదీ తెలిపారు. 21వ శతాబ్దం భారత్‌దేనని ప్రధాని స్పష్టం చేశారు. -
హోదా ఇచ్చే వారికే మా మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే.. వారికి మద్దతు ఇస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాలలో తమది తటస్థ వైఖరి అని వ్యాఖ్యానించారు. ఇండియా టుడే మీడియా గ్రూపు నిర్వహించిన కాంక్లేవ్ – 2019లో రెండో రోజు ఆయన పాల్గొన్నారు. ‘ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చుంటారో నిర్ణయించడంలో డెక్కన్ ప్రాంత పాత్ర’ అన్న అంశంపై సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ కన్వల్ నిర్వహించిన ముఖాముఖిలో వైఎస్ జగన్ పలు అంశాలపై స్పష్టంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు విశ్వసనీయతకు, అవకాశవాదానికి మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని, చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు పరాకాష్టగా మారిపోయారని.. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ–కాంగ్రెస్ పార్టీల పొత్తును ఉదహరిస్తూ పేర్కొన్నారు. తాను చేసిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రజలకు ఒక విశ్వాసం కల్పించిందని జగన్ అన్నారు. ‘‘14 నెలలు ప్రజల మధ్య నడిచాను. పగలూ రాత్రి వారు పడ్డ కష్టాలను చూశాను. ఆ కాలమంతా నన్ను వైవిధ్యంగా మలిచింది. ప్రజల కోసం ఏదైనా చేయాలన్న తపనను కలిగించింది.’’ అని ఆయన తెలిపారు. నా తండ్రి పాలనను చూశాకే 2009లో రెండోసారి ముఖ్యమంత్రిగా ఆయనను ఎన్నుకున్నారని, ఆయన కొడుకుగా పుట్టినందుకు గర్విస్తున్నానని జగన్ వ్యాఖ్యానించారు. తనపై టీడీపీ, కాంగ్రెస్ పెట్టినవి రాజకీయ కక్షసాధింపు కేసులేనని పేర్కొంటూ తొమ్మిదేళ్లుగా ప్రజలు తన వ్యక్తిత్వాన్ని చూస్తున్నారని, తానేమిటో వారికి తెలుసునని జగన్ వివరించారు. ముఖాముఖి ఇలా సాగింది.. ప్రశ్న: సమకాలీన భారత రాజకీయాల్లో సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగతం.. వెల్కమ్ సర్.. మీరు అత్యంత ఫిట్నెస్తో కనిపిస్తున్నారు. 3,648 కి.మీ.ల పాదయాత్ర చేశారు. అది నిజంగా మీకు చాలా ఉపయోగపడింది. (సభికులతో..) వాస్తవానికి జగన్మోహన్రెడ్డి ఈ పాదయాత్ర లో అత్యంత శక్తిమంతుడిగా కనిపించారు. ఆయన పాదయాత్ర గురించి వినని వారికి ఇది చెప్పాలి. తెల్లవారుజామున ఆయన లేచినప్పటి నుంచి రాత్రి చివరి గంట వరకూ ప్రజలతో మమేకమయ్యారు. కోర్టు కేసులో హాజరవ్వాల్సి ఉంటే అది కూడా చేసి తిరిగి మళ్లీ పాదయాత్ర ప్రాంతానికి చేరుకునేవారు. నిజంగా దృఢ సంకల్పాన్ని చూపారు. మీ అంత దూరం ఎవరూ నడవలేదని ప్రజలు చెబుతున్నారు. మీ తండ్రి చేసిన పాదయాత్ర ఆయన అధికారం సాధించడానికి మార్గం అయింది. మీ పాదయాత్ర మీరు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడానికి మార్గం అవుతుందా? జగన్: ఇది అధికారానికి మార్గం అవుతుందా లేదా అన్నది నాకు తెలియదు. కానీ పాదయాత్ర ప్రజలకు ఒక విశ్వాసం కల్పించింది. ప్రజలను అర్థం చేసుకోవడం, వారు చెప్పేది వినడం, వారి పరిస్థితి తెలుసుకోవడం, పాదయాత్రలో ఆద్యంతం వారి సమస్యలపై గళం వినిపించాం. తద్వారా ప్రభుత్వం ఆయా సమస్యలను పరిష్కరించేలా చేశాం. తమ సమస్యలను వినేందుకు ఒకరు ఉన్నారు.. ఏదైనా చేసేందుకు అండగా వస్తున్నారు.. అంటే అది ప్రజలకు నమ్మకం కలిగిస్తుంది. ఆ నమ్మకమే నన్ను కూడా ముందుకు నడిపిస్తుంది. నడిపించింది. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావాలన్న నా కలలో ఒక ఉద్దేశం ఉంది. నేను చనిపోయినా అందరి మనసుల్లో బతికే ఉండాలన్నది నా కల. అది నా లక్ష్యం. నేను ప్రజలందరికీ మేలు చేయాలని కోరుకుంటున్నా. ఆరు నెలల సహవాసం చేస్తే వారు వీరవుతారని అంటారు. 14 నెలలు ప్రజల మధ్య నడిచాను. పగలూ రాత్రి వారు పడ్డ కష్టాలను చూశాను. ఆ కాలమంతా నన్ను వైవిధ్యంగా మలిచింది. ప్రజల కోసం ఏదైనా చేయాలన్న తపనను కలిగించింది. ప్రశ్న: మీ తండ్రి అకాల మరణం తర్వాత మీరు 2014 ఎన్నికల్లో తలపడ్డారు. ఆ తర్వాత మీ రాజకీయ పరిణామ క్రమాన్ని చెప్పండి.. జగన్: నా తొమ్మిది సంవత్సరాల ప్రయాణంలో ఎక్కువ సమయం ప్రజల మధ్యే గడిపాను. పాదయాత్రకు ముందు కూడా ప్రజల మధ్యే ఉన్నాను. ఈ పాదయాత్ర నిత్యం వారితోనే ఉండే అవకాశాన్ని కల్పించింది. పాదయాత్రలో నేను ఎక్కడ బస చేశానో తెలుసు. ఏ దారి వెంట నడిచానో తెలుసు. దీంతో నన్ను ఎక్కడ కలవాలో ప్రజలకు తెలిసిపోయేది. క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను ప్రత్యక్షంగా చూశాను. సూక్ష్మ స్థాయిలో ఉన్న సమస్యలను ప్రతిరోజూ విన్నాను. వారి దయనీయ పరిస్థితిని మార్చాలన్నదే నా సంకల్పం. ప్రశ్న: రానున్న ఎన్నికల్లో మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే అవకాశం వస్తే పాలన ఎలా ఉండబోతోంది? ఎందుకంటే అన్ని ఒపీనియన్ పోల్స్ ప్రస్తుతం ఏపీలో మీరు ముందంజలో ఉన్నారని చెబుతున్నాయి. అలాగే ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో గట్టి వ్యతిరేకత కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పాలనకు ఏరకంగా వైవిధ్యంగా ఉంటుంది? జగన్: చాలా వరకు నేను చూసిన సమస్యల్లో అనేకం మానవ తప్పిదాలే. సరైన పాలన, విశ్వసనీయమైన పాలన వీటిలో అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. అమలు చేయలేని హామీలను మనం ఇవ్వకూడదు. చంద్రబాబు నాయుడు విశ్వసనీయతను కోల్పోయారు. ఆయన అనేక అబద్ధపు హామీలు ఇచ్చారు. ఈయన అబద్ధాల కారణంగా ప్రజలు ఈరోజు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఉదాహరణకు రైతుల విషయమే చూద్దాం. రూ.87,612 కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పారు. ఏ రాష్ట్రం కూడా ఆమేరకు సామర్థ్యం కలిగి ఉండదని ఆయనకు తెలిసి కూడా హామీ ఇచ్చారు. రుణాలు కట్టొద్దని చెప్పారు. రైతులు రుణాలు కట్టడం ఆపేశారు. గద్దెనెక్కాక ఆ హామీని నిలబెట్టుకోకపోవడమే కాకుండా.. అంతకు ముందు ప్రభుత్వాలు ఇచ్చే వడ్డీ రాయితీ వెసులుబాటును (వడ్డీ లేని రుణాలు) కూడా రైతులు పొందకుండా చేశారు. ఈ ఘనత చంద్రబాబు పాలనకే దక్కింది. గిట్టుబాటు ధరలు లేవు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. మిగిలిన అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అదంతా చెప్పాలంటే సమయం సరిపోదు. ప్రశ్న: నేను అడిగింది మీరు చెప్పలేదు.. మీరు చంద్రబాబు హయాంలో ఉన్న సమస్యల గురించి చెప్పారు. మీరు అధికారంలోకి వస్తే ఏరకమైన వైవిధ్యాన్ని చూపుతారు? మీ తండ్రి గారి సంక్షేమ పాలనకు పొడిగింపుగా ఉంటుందా? జగన్ ముఖ్యమంత్రి అయితే ఎలా పాలిస్తారు? జగన్: ప్రస్తుతం సంతృప్త స్థాయిలో సేవలు అందడం లేదు. మీరు ఏ పార్టీ అంటూ లబ్ధిదారుల ను అడుగుతున్నారు. ప్రతి చోటా వివక్షే. అందుకే గ్రామ స్థాయి పరిపాలనలో భారీ మార్పులు తీసుకొస్తాం. గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తాం. అన్ని సమస్యలకు 72 గంటల్లో పరిష్కారం లభిస్తుంది. ప్రశ్న: జాతీయ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? ప్రధాన మంత్రి మోదీతో, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో మీ సమీకరణాలు ఎలా ఉన్నాయి? జగన్: ఆ రోజు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ.. అందరూ సభ సాక్షిగా ఒక్కటయ్యారు. పార్లమెంట్ తలుపులు మూసేశారు. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేశారు. విభజనను అడ్డుకున్న సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. రాజ్యసభలో అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీజేపీలు ఒక్కటయ్యాయి. విభజన కోరుకున్న రాష్ట్రం రాజధానిని తీసుకోవడం ఈ ఒక్క విభజనలోనే జరిగింది. ఈ రోజు మా రాష్ట్ర విద్యార్థులు పట్టభద్రులైతే ఉద్యోగానికి ఎక్కడికి వెళ్లాలో తెలియని దుస్థితి నెలకొంది. ప్రశ్న: ప్రత్యేక హోదా ఈశాన్య రాష్ట్రాలకో లేక ఒడిశా, జార్ఖండ్ వంటి రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుందంటే దానిని మనం అర్థం చేసుకోగలం. కానీ ఏపీ వెనుకబడిన రాష్ట్రం కాదు కదా? జగన్: రాష్ట్ర విభజన జరిగిన రోజు ఈ విషయాలు వాళ్లకు తెలియవా? ఆ రోజు జార్ఖండ్ వెనుకబడి లేదా? విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగింది కాబట్టి ప్రత్యేక హోదా రూపంలో పరిహారం ఇస్తామని పార్లమెంట్లో అధికార కాంగ్రెస్‌తో పాటు, ప్రతిపక్ష బీజేపీ కలిసి చెప్పాయి. కానీ ఇవాళ మాట నిలబెట్టుకోకుండా జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లు ఏపీ కంటే వెనుకబడి ఉన్నాయి కాబట్టి హోదా ఇవ్వలేమంటున్నారు. మరి పార్లమెంటులో మాట ఎందుకు ఇచ్చినట్టు? అలా చేస్తే పార్లమెంట్‌పై విశ్వసనీయత ఎలా ఉంటుంది? ప్రశ్న: 2019ఎన్నికల్లో మోదీ, అమిత్‌షా నేతృత్వంలోని బీజేపీ ఒకవైపు.. కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీలతో కూడిన మహా కూటమి మరో వైపు ఉంది. థర్డ్ ఫ్రంట్ లాంటిదొకటి కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు ఎటు వైపు ఉండబోతున్నారు? జగన్: మేము ఇప్పటికే తటస్థంగా ఉన్నాము. మా డిమాండ్ ప్రత్యేక హోదా ఒక్కటే. జగన్ అయినా, ఏపీ ప్రజలైనా ‘ఢిల్లీ’మాటలు నమ్మి మోసపోయాం. ఎన్నికలప్పుడు ఎన్నో హామీలు ఇచ్చిన వారు మరచిపోయారు. ఇవన్నీ చూసి విసుగెత్తిపోయాం. ఏపీ ప్రజలు గానీ, ఏపీ ప్రజల ప్రతినిధిగా జగన్ గానీ.. మేం ఎవరినీ నమ్మాలనుకోవడం లేదు. మేం ఓపెన్‌గా ఉన్నాం. హోదా ఇచ్చిన వాళ్లకే మద్దతు ఇస్తామని చెప్పాం. మేం ఇప్పటికే ఐదేళ్లు కోల్పోయాం. ప్రశ్న: అంటే మీరు పూర్తి పారదర్శకంగా ఉన్నామంటున్నారు. ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికే మీ మద్దతని అంటున్నారు. అది మోదీ కావొచ్చు.. రాహుల్ గాంధీ కావొచ్చు.. మాయావతి కావొచ్చు.. మీకు వ్యత్యాసం లేదు.. జగన్: కచ్చితంగా.. ప్రధాని ఎవరన్నది మాకు అనవసరం. ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికి మద్దతు ఇస్తాం. మీరు (జర్నలిస్ట్ రాహుల్) ప్రధాని అయినా మద్దతు ఇస్తాం. ప్రశ్న: నేను ప్రధాన మంత్రి కావాలనుకోవడం లేదు. మీరు ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో వాళ్లతోనే వెళతామంటున్నారు. మీకు లోక్‌సభ ఎన్నికల్లో గరిష్టంగా సీట్లు వస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. అత్యధిక సీట్లు గెలవాలని ఆశిస్తున్నారు. ఎవరికి అవసరమైతే వాళ్లతో వెళ్లాలనుకుంటున్నారు. కానీ దానికి పూర్తి మెజారిటీ లేని పార్టీ అధికారంలోకి రావాలి. అంటే మీరు బలమైన సర్కారు కావాలని కోరుకోవడం లేదు.. జగన్: పార్లమెంట్లో ఇచ్చిన మాటకు విలువ ఉండాలి. ఆ మాటకు పాలకులు కట్టుబడి ఉండాలి. విభజనతో ఏపీకి అన్యాయం జరిగింది కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వాలి. దీనిని నేతలు అర్థం చేసుకోవాలన్నదే నా అభిమతం. ప్రశ్న: మీ తండ్రి మరణానంతరం సోనియా గాంధీ మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయకపోవడంతో మీరు కాంగ్రెస్‌ను వదిలివెళ్లి సొంత పార్టీ పెట్టుకున్నారని అంటారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీ మిమ్మల్ని తిరిగి కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తే, కలిసి పని చేద్దామంటే ఏమంటారు? జగన్: మాకు ఏది అవసరమో చాలా స్పష్టంగా చెప్పాను. నేను రాహుల్ గాంధీకో, మరొకరికో వ్యతిరేకం కాదు. మా లక్ష్యం చాలా సూటిగా ఉంది. మేం ఎవరినీ నమ్మదలుచుకోలేదు. ఇప్పటికే ఐదేళ్లు నష్టపోయాం. మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి. మేం మద్దతు ఇస్తాం. అంతే సింపుల్. మా ఆప్షన్లన్నీ ఓపెన్‌గా పెట్టుకున్నాం. ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాలనుకోవడం లేదు. ప్రశ్న: గతంలో మీనాన్న గారు కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగారు. ఆ విధంగానే మీరు తిరిగి కాంగ్రెస్‌లోకి వెళతారా? జగన్: అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడుంది? మాకు కాంగ్రెస్‌తో ఏం పని? బహుశా వాళ్లకే మా అవసరం ఉండొచ్చు. ప్రశ్న: పదేళ్లు పాలించిన కాంగ్రెస్‌కు 2014లో 2.94% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు కొంత మెరుగుపడినట్టు కాంగ్రెస్ భావిస్తోంది. మీరు ఏమనుకుంటున్నారు? జగన్: కాంగ్రెస్‌కు దానిపై దానికే నమ్మకం లేదు. వారికి విశ్వాసం ఉంటే వారు టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు. 30 ఏళ్లు కాంగ్రెస్‌పై పోరాడిన టీడీపీతో వారు పొత్తు పెట్టుకున్నారు. ఎలాంటి నైతిక విలువలు లేకుండా పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడి అవినీతిపై 2018 జూన్ 8న కాంగ్రెస్ ‘అత్యంత అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు’అనే పుస్తకాన్ని అధికారికంగా విడుదల చేసింది. దానిపై రాహుల్ గాంధీ బొమ్మ కూడా ప్రచురించింది. ఇది విడుదల చేసిన మూడు నెలల్లోనే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కలిసి పోయి ఎన్నికల్లో పోటీ చేశాయి. ప్రజలు ఏమనుకుంటారన్న స్పృహ కూడా వారికి లేదు. ప్రజలను ఫూల్స్ చేద్దామనుకున్నారా? ఇలాంటి వాళ్లను ప్రజలు కచ్చితంగా తిరస్కరిస్తారు. ప్రశ్న: మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు మీరు వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారని ఆరోపణలు, ఇందుకు సంబంధించి అనేక కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఏదో ఒక సందర్భంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి కావా? జగన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడుతున్నప్పుడు కేసులు పెట్టడం చాలా సులభం. ఈ కేసులన్నీ మా నాన్న చనిపోయాక, నేను కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు వచ్చినవే. టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఈ కేసులు పెట్టారు. కానీ వాస్తవం ఏంటంటే ఇవన్నీ రాజకీయ కేసులు. కానీ ప్రజలు నా వ్యక్తిత్వాన్ని చూశారు. నేనేంటో వారికి తెలుసు. ప్రశ్న: రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీల్లో ఎవరు తక్కువ చెడు చేసేవారు.. జగన్: వీరిద్దరూ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారు. ప్రశ్న: చంద్రబాబు నాయుడు అమరావతిలో కొత్త రాజధాని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అధికారంలోకి వస్తే అక్కడే దానిని కొనసాగిస్తారా? లేక మరో చోట నిర్మిస్తారా? జగన్: ఇది క్యాచ్ – 22 పరిస్థితి (వైరుధ్య పరిస్థితులు ఉన్నా కొనసాగించాల్సిన పరిస్థితి). ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం అనేది పెద్ద కుంభకోణం. చంద్రబాబు 2014 జూన్‌లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసు. కానీ అక్కడ, ఇక్కడ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించారు. సరిగ్గా రాజధాని ఏర్పాటయ్యే చోట సొంత హెరిటేజ్ కంపెనీ పేరుతో, బినామీల పేరుతో అక్కడి రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొని ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. ప్రశ్న: మీది పెద్ద రాష్ట్రం. పారిశ్రామిక రాష్ట్రం. వాణిజ్య సంస్థలు ఉన్నాయి. మీకున్న వనరులతో బాగా చేయొచ్చు కదా? ఎందుకు మీరు ప్రత్యేక హోదా కోసం అంతగా డిమాండ్ చేస్తున్నారు? జగన్: మాకు ఎందుకు హోదా ముఖ్యమంటే.. హైదరాబాద్‌తోగానీ, చెన్నైతోగానీ, బెంగళూరుతో గానీ పోటీ పడే వనరులు లేవు. హైదరాబాద్ అభివృద్ధికి 60 ఏళ్లు పట్టింది. ఈరోజు ఒక పట్టభద్రుడు ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియదు. హోదా వస్తే ప్రత్యేక ప్రోత్సాహకాలు వస్తాయి. 100 శాతం ఆదాయపు పన్ను రాయితీ, వంద శాతం జీఎస్టీ రాయితీ లభిస్తుంది. ఇలాంటి పారిశ్రామిక ప్రత్యేక ప్రోత్సాహకాలతోనే ఎవరైనా ముందుకొచ్చి హోటలో, ఆసుపత్రో, ఐటీ సంస్థనో, కర్మాగారమో ఏర్పాటు చేస్తారు. పక్కనే హైదరాబాద్ ఉంది. అక్కడ అన్ని మౌలిక వసతులు ఉన్నాయి. ఇప్పుడు మాకంటే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అత్యంత ముందంజలో ఉండగా ఎవరైనా ఏపీకి వచ్చి ఎందుకు పెట్టుబడులు పెడతారు? ప్రశ్న: మీరు విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేశారు. మీ నాన్నలా ప్రజలతో మమేకమయ్యా రు. ఇది అతికొద్ది మంది మాత్రమే చేయగలరు. మీరు ముందంజలో ఉన్నారని, ఏపీలో మీదే విజయమని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. కానీ మీ 2014 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం మీరు 15 కేసులు ఎదుర్కొంటున్నట్లు ప్రకటించారు. ఇవి ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? జగన్: మీకు వాటి నేపథ్యం చెబుతాను. మా నాన్న బతికి ఉన్నప్పుడు నాపై కేసులు లేవు. అవి ఎప్పుడు వచ్చాయంటే నేను కాంగ్రెస్ పార్టీ వీడి వెళ్లాలనుకున్నప్పుడు. పిటిషనర్లు ఎవరు? టీడీపీ, కాంగ్రెస్ నేతలు. ఇద్దరూ ఒక్కటై నా తండ్రి మరణానంతరం, నేను కాంగ్రెస్‌ను వీడాక ఇద్దరూ ఒక్కటై కేసులు ఫైల్ చేశారు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. మా నాన్న పాల న చూశాకే 2009లో రెండోసారి ముఖ్యమంత్రిని చేశారు. నాడు మా నాన్న నాయకత్వంలో ఏపీ నుంచి 33మంది ఎంపీలు గెలిచారు కాబట్టి యూపీ ఏ ప్రభుత్వం ఏర్పాటైంది. నేనప్పుడు రాజకీయాల్లోనే లేను. కనీసం హైదరాబాద్‌లో కూడా లేను. ప్రశ్న: ప్రస్తుతం ఇండియా – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితి, ఇరు దేశాల సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు రాష్ట్రంలో ఎన్నికలపై ఏమైనా ప్రభావం చూపుతాయా? జగన్: బహుశా ఈ విషయంలో మోదీకి కొంత మైలేజీ వచ్చి ఉండొచ్చు. ఈ విషయంలో నేను ఆయనకు క్రెడిట్ ఇస్తాను. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో హోదా పట్ల మాట తప్పారు. ప్రత్యేక హోదాను ఆంధ్రప్రదేశ్‌కు దూరం చేశారు. అందువల్ల అక్కడ ఆయన్ను ప్రజలు ఆదరించరు. ప్రశ్న: మీరు చంద్రబాబును జైలుకు పంపదలుచుకున్నారా? జగన్: ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఓత్ ఆఫ్ సీక్రెసీని ఉల్లంఘించడమే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను, రహస్యాలను కాపాడతానని, గోప్యం పాటిస్తానని ప్రమాణం చేస్తారు. కానీ చంద్రబాబు తన ఆర్థిక ప్రయోజనాల కోసం వాటిని భంగపరిచారు. తన కంపెనీ హెరిటేజ్ పేరుతో భూములు కొన్నారు. బినామీల పేరుతో కొన్నారు. అక్కడితో ఆగలేదు. ఆయన, ఆయన బినామీలు ఏమంటారంటే రాజధానికి భూములే సేకరించలేదని చెబుతారు. భూ సమీకరణ పేరుతో భూములు సేకరించారు. అలా సేకరించిన భూములను వారికి ఇష్టమొచ్చిన వారికి, వారికి ఇష్టమొచ్చిన ధరలకు ఇచ్చారు. 1600 ఎకరాలను రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చేశారు. చివరలో ఒక్క మాట.. తెలంగాణలో ఎమ్మెల్యేలను తన బ్లాక్ మనీతో కొంటూ ఆడియో, వీడియో టేపులతో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఇలాంటి నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారా? ఆ టేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతే అని ఫోరెన్సిక్ పరీక్షలో కూడా తేలింది. అయినా ముఖ్యమంత్రి రాజీనామా చేయలేదు. ఎలాంటి కేసు నమోదు కాలేదు. కాబట్టి వాస్తవం ఏమిటన్నది మేధావులంతా ఆలోచించాలి. -
భయానికి ఇక చోటు లేదు
సాఫీగా సాగుతున్న సోనాలీ బింద్రే జీవితంలో క్యాన్సర్ రూపంలో పెద్ద కుదుపు. గతేడాది షాకింగ్ మూమెంట్స్‌లో ఇదొకటి. క్యాన్సర్ అని తెలియగానే సోనాలీ ఎంత షాకయ్యారో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు అంతే షాక్‌కి గురయ్యారు. ఎంత గొప్ప సమస్యను దాటగలిగితే అంత గొప్ప హీరో అయినట్టు, హీరోయిన్ సోనాలి క్యాన్సర్‌ను ధైర్యంగా ఎదుర్కొని.. పోరాడి గెలిచి సూపర్ హీరోయిన్గా నిలిచారు. ఎంతోమందికి స్ఫూర్తిగా మారారు. క్యాన్సర్ చికిత్స జరుగుతున్నంత కాలం సోషల్ మీడియా ద్వారా విషయాలను షేర్ చేశారు. తాజాగా ‘ఇండియా టుడే కాంక్లేవ్ 2019’ కార్య క్రమంలో సోనాలి మనసు విప్పి, చాలా విషయాలు చెప్పారు. అవి ఆమె పోరాట పటిమను తెలియజేశాయి. సోనాలి మాటల్లో ఆ విశేషాలు.. క్యాన్సర్‌ను దాచదలచుకోలేదు క్యాన్సర్ ఉందని తెలియగానే నా చుట్టూ వినిపించింది ఒక్కటే.. ‘నీ లైఫ్‌స్టైల్ చాలా బాగుంటుంది. నీకెందుకు ఇలా జరిగింది?’ అని. న్యూయార్క్‌లో సైకియాట్రిస్ట్‌తో మాట్లాడేంత వరకూ నా వల్లే క్యాన్సర్ వచ్చిందేమో అనే భ్రమలో నేను కూడా ఉండిపోయా. ‘‘నాకేం జరుగుతుందో నాకు అర్థం కావడంలేదు. నేను నెగటివ్ పర్సన్‌ని కాదు. నాది చాలా పాజిటివ్ లైఫ్ స్టైల్. ఒకవేళ నెగటివ్ ఆలోచనలు ఉన్నా కూడా వాటిని లోలోపలే దాచేసి బయటకు ఏం జరగనట్టు నటించేదాన్నా? నాకు అర్థం కావడంలేదు’’ అని సైకియాట్రిస్ట్‌తో చెప్పా. ఆ రోజు ఆయనిచ్చిన సమాధానమే నాకు స్ఫూర్తి మంత్రాలయ్యాయి. క్యాన్సర్‌ను ఎదుర్కోగలన నే ఆశను పెంచాయి. ‘‘సోనాలీ.. క్యాన్సర్ అనేది జీన్స్ వల్ల కానీ వైరస్ వల్ల కానీ వస్తుంది. ఆలోచనల వల్ల కాదు. ఒకవేళ ఆలోచనలే క్యాన్సర్ బారినపడేట్టు చేసి లేదా క్యాన్సర్ నయం అయేట్టు చేస్తాయంటే, మాకంటే (సైకియాట్రిస్ట్) ధనవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే మేం ఆలోచనలతో వ్యవహరించేవాళ్లం కదా’’ అని చెప్పారాయన. అప్పుడు క్యాన్సర్‌కి కారణం నేను కాదనే భ్రమలో నుంచి బయటపడ్డా. అ నిమిషం నా మీద నుంచి కొన్ని వందల కేజీల బరువును మాటలతో తుడిచేసినట్టు అనిపించింది. క్యాన్సర్‌ను ఎదుర్కోగలను అనే నమ్మకం ఏర్పడింది. మనమేం తప్పు చేశామని ఆలోచించడం ఆపేశాను. అన్ని క్యాన్సర్లు ఒకలా ఉండవు. దాన్ని నయం చేసే ఫార్ములా ఒక్కో శరీరానికి ఒక్కోలా ఉంటుంది. చాలా మంది క్యాన్సర్ వచ్చిన విషయాన్ని ఎందుకు దాచిపెట్టాలని అనుకుంటారో అర్థం అయ్యేది కాదు. నేను దాచిపెట్టదలచుకోలేదు. నాకు ఇలా జరిగింది అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే వచ్చిన స్పందన ఎంతో ఆనందాన్ని, భరోసాని కలిగించాయి ఆ కారణమేంటో కనుక్కుంటా! ‘లైఫ్‌లో మళ్లీ పని చేస్తానో లేదో’ అని ఆలోచించిన రోజులు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని చెప్పడానికి ఇప్పుడు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వను. నెక్ట్స్ ఏం చేయబోతున్నానో నాకు కచ్చితంగా తెలియదు. సినిమాల్లో నటిస్తానా? తెలియదు. కానీ నేను చేయాల్సిన పని మాత్రం కచ్చితంగా ఉందని నాకు అనిపిస్తోంది. లేకపోతే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు కదా. నేను మళ్లీ మామూలు మనిషి కావడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏంటో కనుక్కుంటా. ఏడవకూడదని ప్రామిస్ చేసుకున్నా ఎన్నో హెయిర్ ఆయిల్స్‌ని ప్రమోట్ చేశాను. కానీ నా హెయిర్‌ని నేను కోల్పోయాను. ఇంటి నుంచి బయటికు అడుగుపెట్టిన ప్రతిసారీ మన ఆ పాత హెయిర్ మనకు లేదు అనే ఫీలింగ్ వస్తుంది. ఆ భావన కాసేపే. జుత్తు సంగతి ఎలా ఉన్నా నా కనుబొమ్మలు మళ్లీ మామూలుగా అయినందుకు ఆ దేవుడికి కృజ్ఞతలు తెలపాలి. కళ్లకు పెట్టుకున్న ‘మస్కరా’ కరిగిపోతుంది కాబట్టి మనం ఏడవకూడదని నాకు నేను ప్రామిస్ చేసుకున్నా. ఇప్పుడు నేను చెబుతున్నవి చిన్న విషయాలే కావొచ్చు కానీ వాటి ప్రభావం చాలా ఉంటుంది. నిజానికి నేను మస్కరా పెట్టుకుని చాన్నాళ్లయింది. ఇప్పుడు మళ్లీ పెట్టుకున్నందుకు ఆనందంగా ఉంది. నా బ్రాండ్ అయిపోయింది నటిగా నా కెరీర్లో ఎన్నో బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించాను. గ్లామర్ ఫీల్డ్‌లో లుక్సే ప్రధానం. సొసైటీలో కూడా కదా? నా కెరీర్ అంతా దాని చుట్టూనే తిరుగుతుంది. నాకు క్యాన్సర్ అని తెలుసుకున్నాక నా ప్రపంచం తల్లకిందులైంది. నా టీమ్‌ను పిలిచాను. నేను క్యాన్సర్‌తో బాధపడుతున్నాను అనే విషయాన్ని పంచుకున్నాను. ‘ఆరోగ్యకరమైన ఉత్పత్తులకు ఇన్ని రోజులు అంబాసిడర్‌గా చేశాను. ఇప్పుడు నా బ్రాండ్ అయిపోయింది. నేను చికిత్స కోసం విదేశాలు వెళ్తున్నాను. చికిత్స తాలూకు పరిణామాలేంటో కూడా సరిగ్గా తెలియదు’ అని చెప్పా. వాళ్లంతా నాతో ఉంటానన్నారు, ఉన్నారు కూడా. జాలి, దయ నాకెట్టి పరిస్థితుల్లోనూ వద్దని వాళ్లతో స్ట్రిక్ట్‌గా చెప్పాను. వాటిని నేనస్సలు నమ్మను. ఫ్యామిలీయే సపోర్ట్ నాకున్న పెద్ద సపోర్ట్ సిస్టమ్ నా ఫ్యామిలీయే. నా భర్త గోల్డీ బెహల్, సోదరి రూప నాకు చాలా సపోర్ట్‌గా నిలిచారు. ధైర్యం పంచారు. నాకు క్యాన్సర్ అని నిర్ధారణ అయినప్పుడు మా అబ్బాయి రణ్వీర్ స్కూల్ ట్రిప్‌లో ఉన్నాడు. వాడిని ఇంటికి పంపించకుండా నా దగ్గర (హాస్పటల్) కొన్ని రోజులు ఉంచాం. వాడి దగ్గర విషయం దాచలేదు. వాణ్ని మేమలా పెంచలేదు. నా వ్యాధి విషయం చెప్పగానే ‘ఇది కొంచెం టఫ్ టైమ్. కానీ మేం నీతో కలిసే ఉంటాం’ అని చెప్పాడు. నాకు కీమోథెరపీ చేసినప్పుడు ‘‘నీ శరీరం మొత్తం బ్లడ్, ట్యూబ్స్ ఉంటాయి అనుకున్నాను, మామూలుగానే ఉందే’’ అన్నాడు రణ్వీర్. భర్త గోల్డీ బెహల్‌తో... మానసిక బాధే కష్టం చికిత్స జరిగినంత కాలం సాఫీగా సాగిపోయిందంటే నేను అబద్ధం చెబుతున్నట్టే. ఈ ప్రయాణంలో చాలా నొప్పి కూడా దాగుంది. సర్జరీ జరిగిన తర్వాత లైఫ్ చాలా టఫ్‌గా గడిచింది. నా శరీరం మీద ఆపరే షన్ తాలూకా 20 అంగుళాల మచ్చ ఉండిపోయింది. ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లే ముందు మా సిస్టర్ నన్ను కౌగిలించుకుంది. ‘మరీ అంత డ్రామా వద్దు. మళ్లీ తిరిగొస్తాను’ అని చెప్పా. కానీ ఎక్కడో ‘నా అబ్బాయికి, మా ఫ్యామిలీకి నేను ఉండనేమో?’ అనే ఆలోచనే చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపించింది. ఆపరేషన్ జరిగి బయటకు రాగానే ‘నేను బతికే ఉన్నాను. శారీరక బాధ బాధే. ఆ బాధ సుదీర్ఘం కాదు. కానీ శారీరక బాధ కన్నా మానసిక బాధ మరింత బాధాకరం. అది మనిషిని కుంగదీస్తుంది’ అనిపించింది. సోదరి రూపాతో... కుమారుడు రణ్వీర్తో... ప్రయాణాన్ని ఇలానే కొనసాగిస్తా ఇంతకు మునుపు ఏదైనా పని చేస్తున్నప్పుడు భయంగా అనిపిస్తే అసలు ఈ పని ఎందుకు చేస్తున్నాను? అని నన్ను నేను ప్రశ్నించుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఆ భయం పోయింది. ఇంక నా జీవితంలో భయానికి చోటు లేదు. భయపడటమే మరిచానని నా ప్రయాణాన్ని చూసి తెలుసుకున్నాను. నటిగా నాకు తెలియని, ఎటువంటి పరిచయాలు లేని ఒక ఇండస్ట్రీకు వచ్చాను. సాధారణ మహారాష్ట్ర మిడిల్ క్లాస్ అమ్మాయి బాలీవుడ్లో హీరోయిన్ అవ్వాలనుకోవడం చాలా పెద్ద కల. చాలా కష్టంతో కూడుకున్న కల. నా కల గురించి తెలుసుకొని మా ఇంట్లోవాళ్లు షాక్ అయ్యారు. కానీ అలాంటి పెద్ద కల కనడానికి నేను భయపడలేదు, నా సామర్థ్యాన్ని సందేహించలేదు. కానీ వాళ్లెందుకు భయపడ్డారో అన్న విషయం మేం తల్లిదండ్రులం అయ్యాక తెలుసుకున్నాను. బిడ్డల భవిష్యత్తు పట్ల ఏ తల్లిదండ్రికైనా కొన్ని భయాలు ఉంటాయి. అయితే నేను, నా భర్త గోల్డీ ఎలాంటి భయాలు లేకుండా జీవించాలనుకుంటున్నాం. సంతోషమైన విషయమేంటంటే నేనింకా బతికే ఉన్నాను, ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఈ ప్రపంచానికి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను. -
జాతీయ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ తటస్థం
-
చంద్రబాబు అవినీతిపరుడైన సీఎం
-
చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు.
-
రాజధాని పేరిట కుంభకోణం..
-
ఓదార్పుయాత్ర చేస్తానని ప్రకటించగానే..కేసులు పెట్టారు.
-
కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయింది
-
విశ్వసనీయతకు, అవకాశవాదానికి మధ్య సమరం ఇది!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు విశ్వసనీయతకు, అవకాశవాదానికి మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు అవకాశవాదం, అవకాశవాద రాజకీయాలు పరాకాష్టగా మారిపోయారని.. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ పార్టీల పొత్తును ఉదహరిస్తూ పేర్కొన్నారు. ఇండియా టుడే 18వ ఎడిషన్ క్లాన్క్లేవ్లో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన మీరు.. ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే మళ్లీ కాంగ్రెస్‌లో చేరుతారా? అని జర్నలిస్ట్ రాహుల్ కన్వల్ ప్రశ్నించగా.. కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయిందని, ఆ పార్టీ అవసరం తమకు లేదని, ఉంటే తమ అవసరమే ఆ పార్టీకి ఉండవచ్చునని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే.. వారికి మద్దతు ఇస్తామని వెల్లడించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఆవిరైపోయిందని, ఆ పార్టీకి రాష్ట్రంలో ఎలాంటి ఆశల్లేవని పేర్కొన్నారు. ఆరు నెలల కిందట చంద్రబాబు అవినీతిపై ఏపీ కాంగ్రెస్ పార్టీ ఒక్క పుస్తకాన్ని విడుదల చేసిందని, దాని మీద రాహుల్‌గాంధీ బొమ్మ కూడా ఉందని గుర్తు చేశారు. చంద్రబాబును అత్యంత అవినీతిపరుడైన సీఎంగా అభివర్ణించిన కాంగ్రెస్ పార్టీ మూడు నెలలు తిరగకముందే తెలంగాణ ఎన్నికల్లో అదే టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలు వెళ్లిందని, ప్రజలు ఆ పార్టీలను ఓడించి పంచించారని తెలిపారు. గత ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేశామని, తనకు వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీ, పవన్ కల్యాణ్ కలిసి పోటీ చేసినా, తాము కేవలం ఒక్క శాతం ఓట్లతో ఓడిపోయామని గుర్తుచేశారు. రాజధాని పేరిట కుంభకోణం.. ఏపీ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నామని చంద్రబాబు అంటున్నారు కదా ప్రశ్నించగా.. రాజధాని విషయంలో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు. జూన్ 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. రాజధాని ఎక్కడ వస్తుందో ఆయనకు ముందే తెలుసు. అయినా, ఇక్కడ వస్తుంది.. అక్కడ వస్తుందంటూ ఆయన ప్రజలు మభ్యపెట్టారు. ఈ లోపల రాజధాని ప్రాంతంలో చంద్రబాబు, ఆయన బినామీలు తక్కువధరకు భూములు రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి రాజధాని ఎక్కడ వస్తున్నదనేది రహస్యంగా ఉంచాలి. కానీ, చంద్రబాబు ఈ విషయాన్నితన వాళ్లకు ముందే లీక్ చేశారు. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్‌తో సమానం. ల్యాండ్ పూలింగ్ విషయలో చంద్రబాబు పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు. ల్యాండ్ పూలింగ్ పేరిట రాజధాని కోసం పేదల నుంచి మాత్రమే భూములు లాక్కున్నారు. తన బినామీల భూములు, తన భూములు ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా చూశారు. దేశం ఇలాంటి అవినీతిపరుడైన ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూసిందా? ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి.. ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి.. బ్లాక్‌మనీతో ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన సీఎంను మీరు ఎప్పుడైనా చూశారా? సిగ్గు లేకుండ ఎమ్మెల్యేను కొనేందుకు ప్రయత్నిస్తూ.. చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. ఆడియో టేపుల్లో ఉన్నది ఆయన గొంతేనని ఫోరెన్సిక్ నివేదిక సైతం తేల్చింది. అయినా ఆయనపై కేసు నమోదు కాలేదు. రాజీనామా చేయలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎలాంటి నైతిక విలువలు లేకుండా వ్యవహరించారు. ఇదే చంద్రబాబు ఇప్పుడు అవినీతి అంటూ నీతులు చెబుతుంటే ఏమనుకోవాలి? కేసుల గురించి.. ‘మా నాన్న బతికి ఉన్నంతవరకు నా మీద కేసుల్లేవు. మా నాన్న చనిపోయిన తర్వాత ఓదార్పుయాత్ర చేస్తానని నేను ప్రకటించగానే.. నాపై కేసులు పెట్టారు. నా మీద కేసులు పెట్టినవారెవరో తెలుసా? టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు.. కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బయటకు రాగానే.. ఆ రెండు పార్టీలు కలిసి నాపై కేసులు పెట్టాయి. మా నాన్న సంక్షేమ పాలన చూసి ఆ పార్టీ నేతలు భయపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్న నేతలు కేంద్రంతో, రాష్ట్రంతో పోరాడితే కేసులు పెట్టడం చాలా సులభం. మా నాన్న చనిపోయిన తర్వాత నేను ప్రతిపక్షంలో ఉన్నాను. అధికారం చేతిలో ఉంది కాబట్టి నా మీద ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెట్టారు. నా మీద పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపిత తప్పుడు కేసులు’ అని తన మీద నమోదైన కేసుల గురించి అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ బదులిచ్చారు. చదవండి: జాతీయ రాజకీయాల్లో మాది తటస్థ వైఖరి: వైఎస్ జగన్ -
రెండు జాతీయ పార్టీలు రాష్ట్రాన్ని మోసగించాయి
-
ఇండియా టుడే కాంక్లేవ్‌లో వైఎస్ జగన్
-
జాతీయ రాజకీయాల్లో మాది తటస్థ వైఖరి: జగన్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రాజకీయాలకు సంబంధించినంతవరకు రెండు పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ) రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని, అందుకే జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతానికి తటస్థ వైఖరిని అవలంబిస్తున్నామని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదాను అత్యంత ముఖ్యమని, వాటిని నెరవేర్చే పార్టీకే ఎన్నికల తర్వాత మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఇండియా టుడే 18వ ఎడిషన్ కాంక్లేవ్‌లో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ కన్వల్‌తో వైఎస్ జగన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి, కేంద్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన తన అభిప్రాయాల్ని వెల్లడించారు. ప్రజలకు ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్రాన్ని విభజించారని, విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్ర ప్రభుత్వం అమలుచేయలేదని వైఎస్ జగన్ తప్పుబట్టారు. ప్రశ్న-జవాబుల రూపంలో సాగిన ఈ సదస్సులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఇండియా టుడే: మీరు సుదీర్ఘ పాదయాత్ర చేశారు.. మీలా ఎవరూ ఇంత సుదీర్ఘంగా చేయలేదని ప్రజలు అంటున్నారు? వైఎస్ జగన్: పాదయాత్ర ద్వారా 14 నెలలు ప్రజల మధ్యలో ఉన్నాను. పాదయాత్ర పొడుగుతా ప్రజల కష్టసుఖాలు వింటూ.. వారి ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? అన్నది క్షుణ్ణంగా తెలుసుకున్నాను. కష్టాల్లో ఉన్న ప్రజలకు ఒక భరోసాను ఇచ్చాను. ప్రజలకు సంక్షేమ పాలన అందించాలన్నది నా లక్ష్యం. అందుకు ఏం చేయాలన్నది పాదయాత్ర ద్వారా ప్రజల మధ్య ఉండి నిశితంగా గమనించాను. ఇండియా టుడే: రాజకీయ నాయకుడి మీ ప్రయాణం ఎలా సాగింది? వైఎస్ జగన్: నా తొమ్మిదేళ్ల రాజకీయ ప్రయాణం అంతా ప్రజల మధ్యలోనే గడిచింది. ఏ దారిలో నడుస్తున్నా.. ఎక్కడ ఉంటున్నా ఉన్నది ప్రజలకు సమాచారం ఇస్తూ.. వారితో కలిసి నడిచాను. వీలైనంత ఎక్కువమంది ప్రజలను కలుసుకున్నాను. ఇండియా టుడే: ప్రభుత్వ వ్యతిరేకత గురించి చెబుతున్నారు? వైఎస్ జగన్: ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల్లో చాలావరకు కొందరు వ్యక్తులు సృష్టించినవే. ఎన్నికలకు ముందు చంద్రబాబె ఎన్నో హామీలు ఇచ్చారు. గెలిచి అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. రైతులకు రుణమాఫీ చేయడం సాధ్యం కాదని తెలిసినా.. చేస్తానని వాగ్దానం చేసి.. అన్నదాతలను మోసం చేశారు. రుణమాఫీ చేయకపోవడంతో అంతకుముందు వరకు వచ్చే వడ్డీలేని రుణాలను కూడా ఇప్పుడు రైతులు పొందలేకపోతున్నారు. ఇండియా టుడే: మీరు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు? వైఎస్సార్ సంక్షేమ రాజ్యానికి మీ పరిపాలనకు తేడా ఏమిటి? వైఎస్ జగన్: చంద్రబాబు పరిపాలనలో ఎన్నో అవకతవకలు ఉన్నాయి. ఓ వర్గం వారికి మాత్రమే చంద్రబాబు ప్రయోజనం కల్పించారు. తమకు ఓటేసిన వారికే ప్రభుత్వ పథకాలు అంటూ వివక్ష చూపించారు. కానీ, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా వ్యవహరిస్తాం. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి.. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేవిధంగా నిర్ణయాలు తీసుకుంటాం. మేం ప్రకటించిన నవరత్నాల పథకంతో సమాజంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుంది ఇండియా టుడే: జాతీయ రాజకీయాలపై మీ విధానం ఏమిటి? వైఎస్ జగన్: జాతీయ స్థాయిలో ఉన్న రెండు పార్టీలు ఏపీని మోసం చేశాయి. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఏపీని విభజించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఒక్కటైపార్లమెంటులో రాష్ట్రాన్ని విభజించాయి. పార్లమెంటు ద్వారాలు మూసేసి. లోక్‌సభలో ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసి.. విభజన బిల్లును నెగ్గించుకున్నారు. విభజన వల్ల నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా కూడా ఇవ్వకపోవడంతో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. ఏపీలో చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలి? ఇండియా టుడే: ఏపీ ఎన్నో రాష్ట్రాల కంటే అభివృద్ధిలో ముందుంది కదా? హోదా ఎందుకు? వైఎస్ జగన్: ఇదే విషయం మీరు రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఎందుకు అడగలేదు? గతంలో ఇతర రాష్ట్రాలను విభజించినప్పుడు హోదా ఇచ్చారు కదా.. ఏపీ అడ్డగోలుగా విభజించినప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు? జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు మా రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరు? పార్లమెంటు మీద ఆశ, నమ్మకం పెరగాలంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా..! ఇండియా టుడే: అంటే హోదా ఒక్కటే మీకు ముఖ్యమా? వైఎస్ జగన్: ఔను, మాకు మా రాష్ట్రం, మా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదానే ముఖ్యం. ఎవ్వరు ప్రధానమంత్రి అయినా మాకు మాత్రం హోదానే కావాలి. హోదా ఇవ్వేవాళ్లకు మా మద్దతు ఉంటుంది. ఇండియా టుడే: ఎందుకు మీకు హోదా అంత అవశ్యకత? మీది పెద్ద రాష్ట్రం, ఎన్నో పరిశ్రమలున్నాయి. అభివృద్ధి చెందిన రాష్ట్రం కదా? వైఎస్ జగన్: రాష్ట్రాన్ని విభజించినప్పుడు నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి ప్రకటించారు. మీ మాటను నిలబెట్టుకోవాలని నేను అడుగుతున్నాను. విభజన తర్వాత చుట్టు ఉన్న పెద్ద నగరాలతో ఏపీ ఎలా పోటీ పడుతుంది? హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో ఏ రకంగా పోటీపడతా? కేంద్రం హోదా ఇచ్చి.. 100 శాతం పన్ను రాయితీలు కల్పిస్తేనే.. ఇతర నగరాలతో పోటీపడి అభివృద్ధి సాధించగలం. హైదరాబాద్‌లో అన్ని మౌలిక సదుపాయాలున్నాయి. అలాంటప్పుడు కొత్తగా ఓ పరిశ్రమ, ఆస్పత్రి, ఫ్యాక్టరీ ఏపీలో ఎలా పెడతారు? అందుకే మాకు ప్రత్యేక హోదా ఇస్తేనే ఏపీ నిలబడగలదు. ఇండియా టుడే: ఎవరు ఎక్కువ శత్రువుల నరేంద్రమోదీనా? రాహులా? వైఎస్ జగన్: ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఏపీని కాంగ్రెస్ పార్టీ విభజించి మోసం చేస్తే.. ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోకుండా ప్రధాని నరేంద్రమోదీ మోసం చేశారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో చేర్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కాబట్టి ఏపీ ప్రజలను కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ వెన్నుపోటు పొడిచాయి. -
ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్
-
నేడు వైఎస్ జగన్ ప్రసంగం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో శనివారం ఉదయం 10.15 గంటల నుంచి 10.45 గంటల మధ్య జగన్ ‘ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చుంటారో నిర్ణయించడంలో దక్షిణాది ప్రాంత పాత్ర (హౌ ది దక్కన్ విల్ డిసైడ్ హూ సిట్స్ ఇన్ ఢిల్లీ)’ అనే అంశంపై ప్రసంగిస్తారు. కాగా, ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్ వెంట వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ బాలశౌరి, మాజీ ఎమ్మెల్యే కె.రవిబాబు ఉన్నారు. విమానాశ్రయం నుంచి వైఎస్ జగన్ నేరుగా వైవీ సుబ్బారెడ్డి నివాసానికి చేరుకున్నారు. -
నిర్ణయం పాక్ చేతుల్లోనే...
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పాకిస్తాన్‌కు గట్టి సందేశం ఇచ్చిందనీ, ఇక మనతో సంబంధాలు ఎలా ఉండాలన్నది ఇప్పుడు ఇస్లామాబాద్ నిర్ణయించుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. దేశ వర్తమాన పరిస్థితులపై ప్రముఖులతో చర్చలు నిర్వహించేందుకు ఇండియా టుడే మీడియా గ్రూపు నిర్వహిస్తున్న ఇండియా టుడే కాంక్లేవ్–2019 శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైంది. శనివారం కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది. తొలి రోజు సదస్సును ప్రారంభిస్తూ ఇండియా టుడే ఎడిటర్ ఇన్ ఛీఫ్ అరుణ్ పురీ స్వాగతోపాన్యాసం ఇచ్చారు. ‘రానున్న ఎన్నికలు అనేక మౌలిక ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవి. సంకీర్ణ ప్రభుత్వాల కంటే సంపూర్ణ మెజారిటీ గల ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందా? దేశం ఒక గట్టి ఆధిపత్యం ఉండే నాయకుడిని కోరుకుంటోందా? లేక కేవలం మంచి టీమ్‌ను కోరుకుంటోందా? పుల్వామా దాడి ఘటన ఎన్నికలపై ఏమేర ప్రభావం చూపుతుంది.. వంటి అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. ఇక కాంక్లేవ్‌లో తొలి వక్త బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ‘ఎన్నికల డైరీలు: విజయాలు, ఓటములు, ప్రజాస్వామిక రణక్షేత్ర సారాంశం’ అనే అంశంపై ప్రసంగించారు. ‘మోదీ నాయకత్వంలో దేశం పాకిస్తాన్‌కు గట్టి సందేశం ఇచ్చింది. సంబంధాలు ఎలా ఉండాలన్నది ఇప్పుడు ఇస్లామాబాద్ నిర్ణయించుకోవాలి’ అని పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ పుల్వామా దాడిని ఖండించకపోవడంపై ఆయన మండిపడ్డారు. సాంస్కృతిక వైరాలపై కాంగ్రెస్ నేత శశిథరూర్, బీజేపీ నేత వినయ్ సహస్ర బుద్దే ప్రసంగించారు. మహిళా శక్తిపై క్రీడాకారులు మేరీకోమ్, మిథాలీ రాజ్ ఉపన్యాసాలు ఇచ్చారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ దేశభక్తి అనే అంశంపై ప్రసంగించారు. శనివారం మోదీతోపాటు పలువురు వక్తలు ప్రసంగించనున్నారు. ప్రధాని రేసులో లేను: గడ్కరీ ఈ సదస్సులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ‘బీజేపీ రాజకీయ విజయాలకు రోడ్‌మ్యాప్’ అన్న అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త అడిగిన ప్రశ్నకు గడ్కరీ స్పందిస్తూ ‘మేమంతా మోదీ వెనక ఉన్నాం. ఆయన విజన్ విజయవంతం చేయడంలో నేనొక కార్యకర్తను. ఇక ప్రధాన మంత్రి పదవి రేసులో నేనున్నానన్న ప్రశ్న ఎక్కడ తలెత్తుతుంది?’ అని ప్రశ్నించారు. ‘మోదీ ప్రధానమంత్రి. తదుపరి ప్రధాన మంత్రి కూడా ఆయనే. నేను ప్రధాన మంత్రి రేసులో లేను. అలాంటి కల నేను కనలేదు’ అని వ్యాఖ్యానించారు. పైలట్ పాక్ చెరలో ఉంటే.. ఎన్నికల భేటీలా? ‘కాంగ్రెస్ సన్నాహాలు, ఆత్మపరిశీలన’ అన్న అంశాలపై కాంగ్రెస్ నేతలు సచిన్ పైలట్, జ్యోతిరాధిత్య సింధియా ప్రసంగించారు. ‘పాక్ ప్రతీకార దాడుల్ని వీరోచితంగా అడ్డుకొని పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్– 16 యుద్ధ విమానాన్ని నేలకూల్చిన మన పైలట్ ఆ క్రమంలో తన విమానం శత్రు భూభాగంలో నేలకూలడంతో పాక్‌కు బందీగా చిక్కాడు. ఈ పరిస్థితుల్లో దేశం మొత్తం తీవ్ర ఉద్విగ్న స్థితిలో ఉంటే మన ప్రధాని మాత్రం బూత్ కమిటీ సభ్యులతో రాజకీయ సమావేశం నిర్వహించడం నన్ను విస్మయానికి గురిచేసింది. పైలట్ పాక్‌లో చిక్కుకుంటే మోదీ ఎన్నికల భేటీలు నిర్వహించడం ఎంత వరకు సమంజసం?’ అని సింధియా ప్రశ్నించారు. రాజస్తాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మాట్లాడుతూ ‘ఒకవైపు పాక్ దాడులకు తెగబడుతుంటే ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ముందుండి దేశానికి దిశా నిర్దేశం చేయాలి. ఆ సమయంలో ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడి ఉండాల్సింది. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపై ఉన్నాయని ప్రపంచానికి చాటిచెప్పినట్లయ్యేది’ అని అన్నారు. -
ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన వెంట మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, బాలశౌరి, రాజ్యసభ సభ్యులు వి. విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ప్రముఖ వార్తా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహిస్తున్న సదస్సులో ఆయన పాల్గొంటారు. ‘ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చుంటారో దక్షిణాది ఎలా నిర్ణయిస్తుంది?’ (హౌ ది డెక్కన్ విల్ డిసైడ్ హూ సిట్స్ ఇన్ ఢిల్లీ) అనే అంశంపై వైఎస్ జగన్ మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత హోదాలో శనివారం ఆయన ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. -
ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): 2019లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడంలేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ, శాసనమండలిలో ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. విశాఖలో జరుగుతున్న ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్‌లో ఆయన పాల్గొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో విజయం ఎవరిది?’ అంశంపై ఇండియాటుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చర్చించారు. ఉమ్మారెడ్డి మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తప్పక అధికారంలోకి వస్తుందని, లోక్‌సభ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎంతో అవసరమన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే తమ పార్టీ బయట నుంచి మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌తో పొత్తుపై చర్చించలేదు: ఎంపీ రమేష్ ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయలా? లేదా అనే అంశంపై ఇంకా చర్చించలేదని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను దారుణంగా మోసం చేసిందని వ్యాఖ్యానించారు. -
రాహుల్‌కు చంద్రబాబు ఝలక్
-
రాహుల్ గాంధీకి చంద్రబాబు ఝలక్
సాక్షి, విశాఖపట్నం: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఝలక్ ఇచ్చారు. రాహుల్‌ను ప్రధాని చేయాలన్నది తన విధానం కాదని వెల్లడించారు. విశాఖపట్నంలో జరుగుతున్న ‘ఇండియా టుడే’ కాన్క్లేవ్ సౌత్ 2018లో ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్ష కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా ఇప్పటివరకు ఎవరిని ప్రకటించలేదని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్ష కూటమి తరపున రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా డిసెంబర్ 16న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. అది డీఎంకే పార్టీ విధానమని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని వ్యతిరేక వ్యక్తి (నెగెటివ్ క్యారెక్టర్)గా చంద్రబాబు వర్ణించారు. మోదీ తప్పా అందరూ ఉత్తములని అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వ విధానాలు దేశాన్ని సర్వనాశనం చేశాయని దుయ్యబట్టారు. -
‘ఈ మూడు లక్షణాలు ఉంటే విజయం మీదే’
రాజకీయ నాయకుడిగా రాణించాలనుకుంటున్నారా..? స్టార్ పొలిటిషియన్‌గా పేరు తెచ్చుకోవాలని ఉందా..? అయితే మీలో.. గ్లామర్, గ్రామర్, హ్యూమర్ అనే మూడు లక్షణాలు తప్పనిసరిగా ఉండాలట. ఈ మాటలు చెబుతోంది మేము కాదండోయ్! సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ కాన్క్లేవ్ అండ్ అవార్డ్స్ 2018’ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎవరైనా ఒక వ్యక్తి గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే గ్లామర్, గ్రామర్, హ్యూమర్ అనే లక్షణాలు తప్పకుండా ఉండాలని పేర్కొన్నారు. అంతేకాదు ఈ మూడు లక్షణాలు విడివిడిగా ఉంటే సరిపోవని.. అన్నీ కలగలిసి ఉన్నప్పుడే మీపై వదంతులు ప్రచారమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని చమత్కరించారు. కాగా ఈ కార్యక్రమానికి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, తమిళనాడు సీఎం పళని స్వామి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, అస్సాం సీఎం సర్బానంద్ సోనోవాల్ సహా పలు రాష్ట్రాల మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఇక ఇండియా టుడే అవార్డుల్లో భాగంగా... పాలనలో అత్యంత మెరుగైన రాష్ట్రంగా ఎన్నికైన తెలంగాణ తరపున తెలంగాణ భవన్ ప్రధాన రెసిడెంట్ కమిషనర్ అశోక్ కుమార్ పురస్కారం అందుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన అవార్డును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ స్వీకరించారు. -
పాక్‌పై హిల్లరీ క్లింటన్ ఫైర్