ప్రసంగిస్తున్న హిల్లరీ (ఇండియా టుడే సౌజన్యంతో...)
సాక్షి, ముంబై : అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ పాక్‌ను ఏకిపడేశారు. ఉగ్రవాదాన్ని కట్టడి చేయటంలో పాక్ ఘోరంగా విఫలమౌతోందంటూ ఆమె పేర్కొన్నారు. ఇండియా టుడే కంక్లేవ్‌లో ప్రసంగించిన ఆమె పాక్ వైఖరిపై మండిపడ్డారు.
‘భారత్‌తో సరిహద్దు సమస్య పరిష్కారం దిశగా వాళ్లేం(పాక్) ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించటం లేదు. పైగా ఉగ్రవాదులను ప్రొత్సహిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. మరో పొరుగు దేశం అప్ఘనిస్థాన్‌తోనూ అదే వైఖరి కొనసాగిస్తున్నారు. దీనికి చెక్ పడాల్సిన అవసరం ఉంది. అమెరికా పాక్‌ను కట్టడి చేయటంలో ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుత ప్రభుత్వం కూడా అది చేస్తుందనే ఆశిస్తున్నా’ అని హిల్లరీ పేర్కొన్నారు.
ఇక సరిహద్దులోనే కాకుండా సొంత దేశంలోనూ ఉగ్రవాదాన్ని నిర్మూలించటంలో పాక్ విఫలమైందని ఆమె తెలిపారు. పాక్ వైఖరితో భారత్ పడుతున్న ఇబ్బందులు తనకు క్షుణ్ణంగా తెలుసని హిల్లరీ పేర్కొన్నారు. ముఖ్యంగా 26/11 ముంబై తాజ్ హోటల్ దాడి తర్వాత తాను భారత్‌లో పర్యటించానని, ఆ సమయంలో పాక్ చేసిన వాదన సహేతుకంగా లేదంటూ తాను చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి... ట్రంప్ సరైనోడు కాదు!
Comments
Please login to add a commentAdd a comment