Hillary cliton
-
అందుకే మోనికాతో ఎఫైర్: బిల్ క్లింటన్
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్లపై 'హిల్లరీ' అనే పేరుతో రూపొందించిన నాలుగు గంటల డాక్యుమెంటరీ సంచలనం రేపుతోంది. మోనికా లెవిన్స్కీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు బిల్ క్లింటన్ మొదటిసారిగా ఒప్పుకున్నారు. అధ్యక్షుడిగా ఉన్నసమయంలో ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన ఇప్పుడు నిజాన్ని అంగీకరించారు. ఒత్తిడి, నిరాశ, ఆందోళనల నుంచి ఉపశమనం పొందేందుకే ఇలాంటి పనిచేశానని తెలిపారు. ఆమెతో గడపడం వల్ల ఒత్తిడి తగ్గి కాస్త ప్రశాంతంగా ఉండగలిగేవాడనని పేర్కొన్నారు. అయితే కొన్ని విషయాలు మనల్ని జీవితాంతం వెంటాడతాయని.. ఇది కూడా అలాంటి తప్పేనని ఆయన అంగీకరించారు. మోనికాతో సంబంధం తన జీవితంలోనూ ఎన్నో మలుపులకు దారితీసిందని చెప్పారు. రాజకీయంగా, కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని వెల్లడించారు. బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ వ్యవహారం అమెరికా రాజకీయాల్లో సంచలనం రేపింది. దీంతో 1998, డిసెంబరు 19న అభిశంసనను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. గతంలో ఆయన చాలాసార్లు తన ఎఫైర్ వార్తలను ఖండించారు. తాజాగా అది నిజమేనని బిల్ క్లింటన్ ప్రకటించడం గమనార్హం. కాగా, ఇద్దరి అంగీకారం, పరస్పర అవగాహనతోనే బిల్ క్లింటన్‌తో అఫైర్ సాగిందని మోనికా లెవిన్స్కీ గతంలో వెల్లడించారు. తమ అఫైర్‌లో క్లింటన్ చొరవ తీసుకున్నారని ‘వానిటీ ఫెయిర్’ పత్రిక కోసం రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. తమ ఇద్దరి మధ్య జరిగిన వ్యవహారంపై తాను తీవ్ర పశ్చాత్తాపానికి గురయ్యానని ఆవేదన చెందారు. ఇక వ్యవహారానికి ముగింపు చెప్పాల్సిన సమయం వచ్చిందని అప్పట్లోనే అన్నారు. చదవండి: ఎన్పీడీఆర్ఆర్ చైర్మన్‌గా అమిత్ షా అవినీతి అధికారులకు కేంద్రం షాక్ -
‘మేడమ్ ఎక్కడా!!’?
స్త్రీ పక్కన ఉంటే పురుషుడికి లభించే గౌరవమే వేరు! సీఎం అయినా, పీఎం అయినా, చక్రవర్తే అయినా. అంతవరకు ఎందుకు.. మనం వెళ్లే ఫంక్షన్లలోనే చూడండి.. అతను కనిపించి ఆమె జాడ లేకుంటే... ఠపీమని ‘అమ్మాయేదీ!’ అంటారు. ‘మేడమ్ ఎక్కడా!!’ అని చుట్టుపక్కలకు చూస్తారు. అమెరికా అధ్యక్షుడు కొద్ది గంటల్లో ఇండియాలో దిగుతున్నారు. ఆయనకు ఉండే గౌరవం ఆయనకు ఉంటుంది. సతీమణితో పాటు వస్తున్నారు కనుక సంపూర్ణ గౌరవం ఉంటుంది. ఇప్పటివరకు ఇలా జంటగా కలిసి ఇండియా వచ్చి, భర్తకు అపారమైన గౌరవ మర్యాదలను ప్రసాదింపజేసిన అమెరికా ప్రథమ మహిళల సందర్శన సమయాలు, సందర్భ చిత్రాలు... క్లుప్తంగా, మీ కోసం. 1962 జాక్వెలీన్కెన్నడీ సతీమణి జాక్వెలీన్ 1962లో ఇండియా వచ్చారు. ఇండియాను సందర్శించడం తన కల అని కూడా అన్నారు! ఇండియాలో హోలీ కూడా ఆడారు. 1969 పాట్ రిచర్డ్ నిక్సన్ సతీమణి పాట్ నిక్సన్ 1969లో ఇండియా వచ్చారు. ఒకే రోజు ఉన్నారు. పెద్దగా పర్యటనలేం చెయ్యలేదు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి నివాళులు అర్పించారు. 1978 రోసలీన్జిమ్మీ కార్టర్ సతీమణి రోసలీన్ కార్టర్ 1978లో ఇండియా వచ్చారు. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలకు ముగ్ధులయ్యారని అంటారు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామీణ మహిళలను కలిశారు. 1995-1997 హిల్లరీబిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ 1995లో, 1997లో ఒక్కరే ఇండియా వచ్చారు. మొదటిసారి కూతురు చెల్సీతో కలిసి వచ్చారు. రెండోసారిమదర్ థెరిసాఅంత్యక్రియలకువచ్చారు. 2006 లారా జార్జి బుష్ సతీమణి లారా బుష్ 2006లో ఇండియా వచ్చారు. నోయిడాలోని ఫిల్మ్‌సిటీని సందర్శించారు. మదర్ థెరిసా మిషనరీస్ ఆఫ్ చారిటీలో కొంత సమయం గడిపారు. హైదరాబాద్ కూడా వచ్చారు. 2010- 2015 మిషెల్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా 2010లో, 2015లో ఇండియా వచ్చారు. మహిళా సంక్షేమం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలను సందర్శించారు. బాలలతో కలిసి డాన్స్ చేశారు. -
ఆ అఫైర్ అధికార దుర్వినియోగం కాదు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, వైట్‌హౌస్ తాత్కాలిక ఉద్యోగిని మోనికా లూయిన్‌స్కీ వివాహేతర సంబంధంపై క్లింటన్ భార్య హిల్లరీ స్పందించారు. క్లింటన్–లూయిన్స్కీల అఫైర్ అధికార దుర్వినియోగం కిందకు రాదని హిల్లరీ అభిప్రాయపడ్డారు. వివాహేతర సంబంధంపై కోర్టుకు అబద్ధం చెప్పినందుకు క్లింటన్‌ను అభిశంసన చేసి ఉండాల్సిందన్న వాదననూ హిల్లరీ ఖండించారు. ‘మీ టూ’ ఉద్యమం నేపథ్యంలో న్యూయార్క్ సెనెటర్ క్రిస్టెన్ గిల్లిబ్రాండ్ మాట్లాడుతూ.. ‘ అఫైర్ లేదని అబద్ధం చెప్పినందుకు హౌ స్ జ్యూడీషియరీ కమిటీ క్లింటన్‌ను అభిశంసించింది. అప్పుడే క్లింటన్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుని ఉండాల్సింది’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య లపై హిల్లరీ స్పందించారు. ‘ అఫైర్ అనేది అధ్యక్షుడి అధికార దుర్వినియోగం కిందకు రాదు. క్లింటన్–లూయిన్స్కీల మధ్య శారీరక సంబంధం ఏర్పడేనాటికి ఆమె వయసు 22 సంవత్సరాలు. అప్పటికే ఆమె వయోజనురాలు. ఈ వ్యవహారంలో వాస్తవాన్ని సెనెట్ అప్పుడే తేల్చింది’ అని వ్యాఖ్యానించారు. -
స్త్రీలోక సంచారం
విదేశాలకు వెళ్లేందుకు అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ప్రత్యేక విమానం ‘ఎయిర్ ఫోర్స్ వన్’ లోని టీవీలో తనకు ఇష్టం లేని చానెల్.. సి.ఎన్.ఎన్. ట్యూన్ చేసి ఉండటం, పైగా ఆ చానెల్‌ను తన సతీమణి మెలానియ వీక్షిస్తూ కనిపించడంపై ఇటీవలి పర్యటనలో వైట్ హౌస్ సిబ్బంది మీద తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ట్రంప్.. నియమాలకు విరుద్ధంగా ‘ఫాక్స్’ చానల్‌కు బదులు సి.ఎన్.ఎన్.ను సిద్ధం చేసి ఉంచిన వారిపై విరుచుకుపడ్డారు. అయితే అమెరికా ప్రథమ మహిళకు తనకు ఇష్టమైన చానెల్‌ను చూసే హక్కు, అధికారం ఉంటాయని మెలానియ ప్రతినిధి స్టెఫానీ గ్రీషమ్ ఒక ప్రకటన విడుదల చేశారు! ::: ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ తన ఫ్యాషన్ కంపెనీలన్నిటినీ మూసి వేసి, వైట్ హౌస్‌లో తన తండ్రికి పూర్తి స్థాయి సలహాదారుగా విధులు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ట్రంప్ అధ్యక్షుడు కాకముందు నుంచీ ‘ఇవాంకా ట్రంప్’ బ్రాండు పేరిట ఆమె నడుపుతున్న దుస్తులు, షూలు, హ్యాండ్ బ్యాగుల విక్రయ సంస్థలపై.. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక అనేక రాజకీయ విమర్శలు రావడంతో ఇవాంక ఒకొటొకటిగా తన బిజినెస్‌లు అన్నింటి నుంచీ వైదొలగుతున్నారు ::: ప్రముఖ అమెరికన్ టీవీ నెట్వర్క్ సి.బి.ఎస్. (కొలంబియా బ్రాడ్కాస్ట్ సిస్టమ్) లో నాలుగేళ్లుగా ప్రసారం అవుతున్న పొలిటికల్ డ్రామా సిరీస్ ‘మేడమ్ సెక్రటరీ’లో అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శులు హిల్లరీ క్లింటన్, మెడలీన్ ఆల్బ్రైట్లు ప్రత్యక్షం కాబోతున్నారు! అక్టోబర్ 7న మొదలవుతున్న ఐదో సీజన్ డ్రామా ప్రీమియర్‌లో.. ‘మేడమ్ సెక్రటరీ’ కల్పిత వ్యాఖ్యాత ఎలిజబెత్ మెకార్డ్ పాత్రను పోషిస్తున్న అమెరికన్ నటి ఈ డ్రామా ఎపిసోడ్లో భాగంగా బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ల హయాంలో విదేశాంగ కార్యదర్శులుగా పనిచేసిన పై ఇద్దరు మహిళలు.. హిల్లరీ క్లింటన్, మెడలీన్ ఆల్బ్రైట్ల సలహాలను తీసుకుంటారు. జూలై 25న జరిగిన పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ (లోక్‌సభ) ఎన్నికల్లో ఈసారి ఎక్కువమంది మహిళా అభ్యర్థులు పోటీ చేయడంపై ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. పాక్ మహిళా రాజకీయ నాయకులను, భారత్‌లోని మహిళా రాజకీయ నాయకులను పోలుస్తూ వారి ఫొటోలను పక్కపక్కన పెట్టి.. ‘ఇక్కడివాళ్లు అక్కడివాళ్లంత అందంగా లేరని, అందుకే శశిథరూర్ వంటివాళ్లు ఇండియాను ‘పాకిస్తానిండియా’ అవాలని కోరుకున్నారని’ అంటూ, ఇంకా అనేక రకాల ‘సెక్సిస్టు’ కామెంట్లతో కూడిన పోస్టులు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. ఈ సంగతలా ఉంచితే, ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి పార్టీ విధిగా కనీసం 5 శాతం మహిళా అభ్యర్థులను నిలపాలన్న పాక్ ఎన్నికల సంఘం ఆదేశాల కారణంగా ఈసారి ఎక్కువ సంఖ్యలో 171 మంది మహిళా అభ్యర్థులు 272 జనరల్ సీట్లకు పోటీ చేశారు ::: జార్జియాలో సెప్టెంబర్ 23 నుంచి మొదలౌతున్న ‘ఒలింపియాడ్’కు మన చెస్ గ్రాండ్ మాస్టర్, 31 ఏళ్ల కోనేరు హంపి సిద్ధమౌతున్నారు. 11 నెలల బిడ్డ తల్లి అయిన హంపీ.. పాప ఆలన, పాలన కోసం ఆట నుంచి విరామం తీసుకున్నాక తిరిగి చెస్ బరిలోకి రావడంపై ‘స్పోర్ట్‌స్టార్’ పత్రికతో మాట్లాడుతూ, ‘పెళ్లయ్యాక కెరీర్లో రాణించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండవన్న మాట విన్నప్పుడు నేను నమ్మలేకపోయేదాన్ని కానీ, పెళ్లి తర్వాత కెరీర్‌కి, కుటుంబానికి మధ్య ప్రాధాన్యాలు తరచు మారిపోతుంటాయని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను’ అని చిరునవ్వుతో అన్నారు ::: స్త్రీ, పురుషులతో పాటు తమకూ ఉద్యోగాలలో ఒక కేటగిరీని ప్రభుత్వం ప్రత్యేకంగా ఎందుకు ఏర్పాటు చేయకూడదని తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన ట్రాన్స్ ఉమన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ షానవీ పొన్నుసామి ప్రశ్నిస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, కేవలం ట్రాన్స్ ఉమన్ అయిన కారణంగా ‘ఎయిర్ ఇండియా’ షానవీకి ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించడంతో, ఆమెకు సంఘీభావంగా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమన్ (ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ) బుధవారం న్యూఢిల్లీలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ, తనకు ఇప్పటి వరకు 20 కంపెనీలు ఉద్యోగాన్ని నిరాకరించాయని షానవీ ఆవేదన చెందారు ::: -
పాక్‌ను ఏకిపారేసిన హిల్లరీ
సాక్షి, ముంబై : అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ పాక్‌ను ఏకిపడేశారు. ఉగ్రవాదాన్ని కట్టడి చేయటంలో పాక్ ఘోరంగా విఫలమౌతోందంటూ ఆమె పేర్కొన్నారు. ఇండియా టుడే కంక్లేవ్‌లో ప్రసంగించిన ఆమె పాక్ వైఖరిపై మండిపడ్డారు. ‘భారత్‌తో సరిహద్దు సమస్య పరిష్కారం దిశగా వాళ్లేం(పాక్) ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించటం లేదు. పైగా ఉగ్రవాదులను ప్రొత్సహిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. మరో పొరుగు దేశం అప్ఘనిస్థాన్‌తోనూ అదే వైఖరి కొనసాగిస్తున్నారు. దీనికి చెక్ పడాల్సిన అవసరం ఉంది. అమెరికా పాక్‌ను కట్టడి చేయటంలో ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుత ప్రభుత్వం కూడా అది చేస్తుందనే ఆశిస్తున్నా’ అని హిల్లరీ పేర్కొన్నారు. ఇక సరిహద్దులోనే కాకుండా సొంత దేశంలోనూ ఉగ్రవాదాన్ని నిర్మూలించటంలో పాక్ విఫలమైందని ఆమె తెలిపారు. పాక్ వైఖరితో భారత్ పడుతున్న ఇబ్బందులు తనకు క్షుణ్ణంగా తెలుసని హిల్లరీ పేర్కొన్నారు. ముఖ్యంగా 26/11 ముంబై తాజ్ హోటల్ దాడి తర్వాత తాను భారత్‌లో పర్యటించానని, ఆ సమయంలో పాక్ చేసిన వాదన సహేతుకంగా లేదంటూ తాను చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇది కూడా చదవండి... ట్రంప్ సరైనోడు కాదు! -
‘ఫేస్బుక్ మద్దతు ఆమెకే’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా సామాజిక మాధ్యమం ఫేస్బుక్ తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌కు బాసటగా నిలిచిందని అన్నారు. ఎన్నికల ప్రచారం కోసం హిల్లరీ తనకంటే లక్షలాది డాలర్లు అధికంగా వెచ్చించారని ఆరోపించారు. ఈ క్రమంలో ఫేస్బుక్ తనను కాదని హిల్లరీనే సపోర్ట్ చేసిందని చెప్పారు. 2016 అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యాకు చెందిన హ్యాకర్లు ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకున్నారనే వార్తల నేపథ్యంలో ట్రంప్ చేసిన తాజా ట్వీట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ట్రంప్ ప్రచారం, రష్యన్ సంస్థల మధ్య నెలకొన్న వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. రష్యా కేంద్రంగా సాగిన ఫేస్బుక్ ప్రచారం కంటే సీఎన్ఎన్,ఏబీసీ, ఎన్బీసీ, సీబీఎస్ ఛానెల్స్‌లో హిల్లరీకి అనుకూలంగా సాగిన ప్రచారం మాటేమిటని ట్రంప్ తన ట్వీట్లో నిలదీశారు. ఆయా ఛానెళ్లలో జరిగిన ఫేక్ న్యూస్ వ్యాప్తికి వందల కోట్ల డాలర్లు కుమ్మరించారని వాటి సంగతి నిగ్గుతేల్చాలని ట్రంప్ పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టాలని ట్రంప్ న్యాయ శాఖను కోరారు. -
ట్రంప్ ట్వీట్లు.. అమెరికాకే ప్రమాదం!
సియోల్ : అగ్ర రాజ్యంగా బాధ్యత కలిగిన ఓ దేశాధ్యక్షుడు అయి ఉండి రెచ్చగొట్టే ప్రకటనలు చేయటం సరికాదని డొనాల్డ్ ట్రంప్ కి హిల్లరీ క్లింటన్ సూచించారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బుధవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియాతో యుద్ధం వార్తల నేపథ్యంలో ఆమె స్పందించారు. ‘ఉత్తర కొరియాతో యుద్ధానికి సిద్ధమని పదేపదే ట్రంప్ ప్రకటన చేయడం సరికాదు. ఇలాంటి ప్రకటనలు అమెరికాకే ప్రమాదకరం. కవ్వింపు ప్రకటనలతో ట్రంప్ చేసే ట్వీట్లు ఉత్తర కొరియాకే లాభం చేకూరుస్తాయి. అవి ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ను మరింత ఉన్మాదిగా మారుస్తాయి. అసలు వారిపై అంతలా విరుచుకుపడాల్సిన అవసరం కూడా లేదు’ అని హిల్లరీ పేర్కొన్నారు. ఇక అణు, క్షిపణి పరీక్షలు చేయకుండా ఉత్తర కొరియాను నిరోధించడంలో కీలకపాత్ర పోషించాలని చైనాను ఆమె కోరారు. అణు పరీక్షలను అభినందించటం మంచిది కాదని ఆమె చైనాకు హితవు పలికారు. మరిన్ని ఆంక్షలు విధించటం ద్వారా దారిలోకి తీసుకురావాలని డ్రాగన్ కంట్రీకి ఆమె సూచించారు. దౌత్యపరమైన చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించాలని.. ఆ దిశగా వారిని (ఉత్తర కొరియా)ను ఒప్పించాలని అగ్ర దేశాలకు ఆమె సూచించారు. -
మరోసారి పోటీకి రెడీనా?
వాషింగ్టన్: తనపై మరోసారి పోటీ చేయాలని హిల్లరీ క్లింటన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సవాలు విసిరారు. హిల్లరీని రెచ్చగొట్టేలా మాట్లాడిన ఆయన.. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనతో తలపడాలన్నారు. కొన్ని బయటి శక్తుల వల్లే తాను ఓడిపోయానని ఇటీవల హిల్లరీ తరచూ పేర్కొనడంపై స్పందిస్తూ.. ఆమె బలహీన అభ్యర్థి అని వ్యాఖ్యానించారు. ‘హిల్లరీ మళ్లీ పోటీచేస్తారని నేను భావిస్తున్నా. దయచేసి మళ్లీ ఎన్నికల్లో పోటీచేయండి?’ అని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. నిజంగానే అనేక కారణాల వల్ల ఆమె ఓడిపోయారని, అయితే అందులో హిల్లరీ మంచి పనులు చేయకపోవడం కూడా ఒకటని ట్రంప్ విమర్శించారు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో ఎన్ఎఫ్ఎల్ ఆటగాళ్లు మోకాళ్లపై కూర్చో వడాన్ని హిల్లరీ సమర్థించడాన్ని ట్రంప్ తప్పుపడుతూ.. హిల్లరీ ప్రకటన దేశాన్ని అవమానించినట్లేనని చెప్పారు. రాజకీయ పోరాటం కొనసాగిస్తా: హిల్లరీ ట్రంప్ వ్యాఖ్యలకు హిల్లరీ సమాధానమిస్తూ.. అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేయనని, అయితే రాజకీయాల్లో కొనసాగుతూ ట్రంప్‌కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో అసలు ఓటమి ఆలోచనే రాలేదని, విజయోత్సవ ప్రసంగాన్ని ముందుగానే సిద్ధం చేసుకున్నానని అప్పటి సంగతుల్ని ఆమె గుర్తుచేసుకున్నారు. -
హిల్లరీపై ట్రంప్ ఆధిక్యం
వాషింగ్టన్ పోస్ట్-ఏబీసీ న్యూస్ సర్వేలో 1 శాతం మెజారిటీ వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సర్వేల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్‌పై తొలిసారిగా పైచేయి సాధించారు. వాషింగ్టన్ పోస్ట్/ఏబీసీ న్యూస్ సర్వేలో ట్రంప్.. హిల్లరీ కన్నా ఒక శాతం ముందంజలో ఉన్నారు. సర్వేలో 45 % మంది ఓటర్లు హిల్లరీ పక్షాన నిలవగా, ట్రంప్‌కు 46 % మంది ఓటర్ల మద్దతు లభించింది. మరోవైపు హిల్లరీ, ట్రంప్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ‘హిల్లరీ వారానికి 65 కోట్ల మంది వలసదారులను అమెరికాలోకి తీసుకురావాలనుకుంటున్నారు. అంటే 12 వారాల్లోనే అమెరికాలోని జనాభా, ప్రపంచ జనాభాను మించిపోతుంది. ఇదే జరిగితే మనకంటూ దేశమే ఉండదు’ అని ట్రంప్ అన్నారు. తొలుత అమెరికాలో అనేక కంపెనీలు ఏర్పాటై వేలాది ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చాయనీ, ఇప్పుడు ఆ ఉద్యోగాలన్నీ భారత్, చైనా, మెక్సికో తదితర దేశాలకు తరలిపోయాయనిపేర్కొన్నారు. తాను అధ్యక్షుడినైతే ఈ పరిస్థితిని చక్కదిద్దుతానని హామీ ఇచ్చారు. మరోవైపు ప్రైవేటు ఈమెయిళ్ల కేసులో ఎఫ్‌బీఐ దర్యాప్తును పునఃప్రారంభించడంపై హిల్లరీ మండిపడ్డారు. ఈ విషయంలో తానే తప్పూ చేయలేదన్నారు. ట్రంప్‌కు రష్యాతో రహస్య సంబంధాలున్నాయని మీడియా నివేదిక వెలుగులోకి రావడంతో దానిపై సమాధానం చెప్పాలని హిల్లరీ డిమాండ్ చేశారు. ట్రంప్ సంస్థల్లో ఒక రహస్య సర్వర్ ఉందనీ, దాని నుంచి రష్యాలోని ఆల్ఫా బ్యాంకుకు చెందిన రెండు సర్వర్లతో ట్రంప్ కంపెనీ సంప్రదింపులు జరుపుతోందని నివేదికలో పేర్కొన్నారు. ఈ ఆరోపణలను ట్రంప్ వర్గం తోసిపుచ్చింది.