వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, వైట్‌హౌస్ తాత్కాలిక ఉద్యోగిని మోనికా లూయిన్‌స్కీ వివాహేతర సంబంధంపై క్లింటన్ భార్య హిల్లరీ స్పందించారు. క్లింటన్–లూయిన్‌స్కీల అఫైర్ అధికార దుర్వినియోగం కిందకు రాదని హిల్లరీ అభిప్రాయపడ్డారు. వివాహేతర సంబంధంపై కోర్టుకు అబద్ధం చెప్పినందుకు క్లింటన్‌ను అభిశంసన చేసి ఉండాల్సిందన్న వాదననూ హిల్లరీ ఖండించారు. ‘మీ టూ’ ఉద్యమం నేపథ్యంలో న్యూయార్క్ సెనెటర్ క్రిస్టెన్ గిల్లిబ్రాండ్ మాట్లాడుతూ.. ‘ అఫైర్ లేదని అబద్ధం చెప్పినందుకు హౌ స్ జ్యూడీషియరీ కమిటీ క్లింటన్‌ను అభిశంసించింది. అప్పుడే క్లింటన్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుని ఉండాల్సింది’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య లపై హిల్లరీ స్పందించారు. ‘ అఫైర్ అనేది అధ్యక్షుడి అధికార దుర్వినియోగం కిందకు రాదు. క్లింటన్–లూయిన్‌స్కీల మధ్య శారీరక సంబంధం ఏర్పడేనాటికి ఆమె వయసు 22 సంవత్సరాలు. అప్పటికే ఆమె వయోజనురాలు. ఈ వ్యవహారంలో వాస్తవాన్ని సెనెట్ అప్పుడే తేల్చింది’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment