Monica Lewinsky
-
క్లింటన్ వ్యవహారం బయటపెట్టిన మహిళ మృతి
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, వైట్‌హౌస్ ఉద్యోగిని మోనికా లెవిన్స్కీ మధ్య వివాహతర సంబంధముందని రుజువు చేసిన లిండా ట్రిప్(70) మంగళవారం(ఏప్రిల్ 7న) కన్నుమూశారు. ఆమె గతంలో మోనికాతో స్నేహం చేసి.. వారిద్దరి సంభాషణలను రహస్యంగా రికార్డు చేసి, దాన్ని బయట ప్రపంచానికి వెల్లడించడం అప్పట్లో సంచలనం రేపింది. అంతేకాక ఇది అతనిపై అభిశంసన తీర్మానం పెట్టడానికి ఆస్కారమైంది. అయితే ప్రతినిధుల సభలో బిల్ క్లింటన్ అభిశంసనకు గురైనప్పటికీ, సెనేట్‌లో ఆయనకు ఊరట లభించిన విషయం తెలిసిందే. (నిజం ఒప్పుకున్న బిల్ క్లింటన్) అయితే ఈ వ్యవహారంలో లిండాకు కొంతమంది మద్దతుగా నిలబడగా, మరికొందరు మాత్రం ఆమెను మిత్రద్రోహిగా అభివర్ణించారు. కాగా 48 ఏళ్ల వయసులో భర్త నుంచి విడాకులు తీసుకున్న లిండా ట్రిప్ అనంతరం కొలంబియాలో నివసించారు. ఆమె 2001 నుంచి రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. తాజాగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఒకప్పటి స్నేహితురాలు మోనికా లెవిన్స్కీ వైరాన్ని పక్కన పెట్టి ఆమె త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. ఇంతలోనే ఏప్రిల్ 7న లిండా కన్నుమూశారు. ఇదిలా ఉండగా బిల్ క్లింటన్ ఈ మధ్యే ఆమె చేసిన ఆరోపణలను అంగీకరించిన విషయం తెలిసిందే. (‘మేడమ్ ఎక్కడా!!’?) -
అందుకే మోనికాతో ఎఫైర్: బిల్ క్లింటన్
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్లపై 'హిల్లరీ' అనే పేరుతో రూపొందించిన నాలుగు గంటల డాక్యుమెంటరీ సంచలనం రేపుతోంది. మోనికా లెవిన్స్కీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు బిల్ క్లింటన్ మొదటిసారిగా ఒప్పుకున్నారు. అధ్యక్షుడిగా ఉన్నసమయంలో ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన ఇప్పుడు నిజాన్ని అంగీకరించారు. ఒత్తిడి, నిరాశ, ఆందోళనల నుంచి ఉపశమనం పొందేందుకే ఇలాంటి పనిచేశానని తెలిపారు. ఆమెతో గడపడం వల్ల ఒత్తిడి తగ్గి కాస్త ప్రశాంతంగా ఉండగలిగేవాడనని పేర్కొన్నారు. అయితే కొన్ని విషయాలు మనల్ని జీవితాంతం వెంటాడతాయని.. ఇది కూడా అలాంటి తప్పేనని ఆయన అంగీకరించారు. మోనికాతో సంబంధం తన జీవితంలోనూ ఎన్నో మలుపులకు దారితీసిందని చెప్పారు. రాజకీయంగా, కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని వెల్లడించారు. బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ వ్యవహారం అమెరికా రాజకీయాల్లో సంచలనం రేపింది. దీంతో 1998, డిసెంబరు 19న అభిశంసనను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. గతంలో ఆయన చాలాసార్లు తన ఎఫైర్ వార్తలను ఖండించారు. తాజాగా అది నిజమేనని బిల్ క్లింటన్ ప్రకటించడం గమనార్హం. కాగా, ఇద్దరి అంగీకారం, పరస్పర అవగాహనతోనే బిల్ క్లింటన్‌తో అఫైర్ సాగిందని మోనికా లెవిన్స్కీ గతంలో వెల్లడించారు. తమ అఫైర్‌లో క్లింటన్ చొరవ తీసుకున్నారని ‘వానిటీ ఫెయిర్’ పత్రిక కోసం రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. తమ ఇద్దరి మధ్య జరిగిన వ్యవహారంపై తాను తీవ్ర పశ్చాత్తాపానికి గురయ్యానని ఆవేదన చెందారు. ఇక వ్యవహారానికి ముగింపు చెప్పాల్సిన సమయం వచ్చిందని అప్పట్లోనే అన్నారు. చదవండి: ఎన్పీడీఆర్ఆర్ చైర్మన్‌గా అమిత్ షా అవినీతి అధికారులకు కేంద్రం షాక్ -
ఆ అఫైర్ అధికార దుర్వినియోగం కాదు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, వైట్‌హౌస్ తాత్కాలిక ఉద్యోగిని మోనికా లూయిన్‌స్కీ వివాహేతర సంబంధంపై క్లింటన్ భార్య హిల్లరీ స్పందించారు. క్లింటన్–లూయిన్స్కీల అఫైర్ అధికార దుర్వినియోగం కిందకు రాదని హిల్లరీ అభిప్రాయపడ్డారు. వివాహేతర సంబంధంపై కోర్టుకు అబద్ధం చెప్పినందుకు క్లింటన్‌ను అభిశంసన చేసి ఉండాల్సిందన్న వాదననూ హిల్లరీ ఖండించారు. ‘మీ టూ’ ఉద్యమం నేపథ్యంలో న్యూయార్క్ సెనెటర్ క్రిస్టెన్ గిల్లిబ్రాండ్ మాట్లాడుతూ.. ‘ అఫైర్ లేదని అబద్ధం చెప్పినందుకు హౌ స్ జ్యూడీషియరీ కమిటీ క్లింటన్‌ను అభిశంసించింది. అప్పుడే క్లింటన్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుని ఉండాల్సింది’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య లపై హిల్లరీ స్పందించారు. ‘ అఫైర్ అనేది అధ్యక్షుడి అధికార దుర్వినియోగం కిందకు రాదు. క్లింటన్–లూయిన్స్కీల మధ్య శారీరక సంబంధం ఏర్పడేనాటికి ఆమె వయసు 22 సంవత్సరాలు. అప్పటికే ఆమె వయోజనురాలు. ఈ వ్యవహారంలో వాస్తవాన్ని సెనెట్ అప్పుడే తేల్చింది’ అని వ్యాఖ్యానించారు. -
పరస్పర అవగాహనతోనే క్లింటన్ తో అఫైర్: మోనికా
వాషింగ్టన్: ఇద్దరి అంగీకారం, పరస్పర అవగాహనతోనే అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తో అఫైర్ సాగిందని వైట్ హౌజ్ సేవకురాలు మోనికా లెవిన్ స్కీ అన్నారు. తమ అఫైర్ లో క్లింటన్ చోరవతీసుకున్నారని మోనికా వెల్లడించారు. తమ ఇద్దరి మధ్య జరిగిన వ్యవహారంపై తాను తీవ్ర పశ్చాత్తాపానికి గురయ్యానని అన్నారు. 1990 లో జరిగిన సంఘటన కారణంగా బిల్ క్లింటన్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. వానిటీ ఫెయిర్ పత్రిక కోసం రాసిన వ్యాసంలో అప్పుడు జరిగిన సంఘటనల్ని పేర్కొన్నారు. శారీరక సంబంధానికి తొలుత క్లింటన్ ఒప్పుకోలేదని మోనికా తెలిపారు. ఆతర్వాత తన పదవిని కాపాడుకోవడానికి తనను బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వ్యవహారానికి ముగింపు చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.