పరస్పర అవగాహనతోనే క్లింటన్ తో అఫైర్: మోనికా
వాషింగ్టన్: ఇద్దరి అంగీకారం, పరస్పర అవగాహనతోనే అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తో అఫైర్ సాగిందని వైట్ హౌజ్ సేవకురాలు మోనికా లెవిన్ స్కీ అన్నారు. తమ అఫైర్ లో క్లింటన్ చోరవతీసుకున్నారని మోనికా వెల్లడించారు.
తమ ఇద్దరి మధ్య జరిగిన వ్యవహారంపై తాను తీవ్ర పశ్చాత్తాపానికి గురయ్యానని అన్నారు. 1990 లో జరిగిన సంఘటన కారణంగా బిల్ క్లింటన్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.
వానిటీ ఫెయిర్ పత్రిక కోసం రాసిన వ్యాసంలో అప్పుడు జరిగిన సంఘటనల్ని పేర్కొన్నారు. శారీరక సంబంధానికి తొలుత క్లింటన్ ఒప్పుకోలేదని మోనికా తెలిపారు. ఆతర్వాత తన పదవిని కాపాడుకోవడానికి తనను బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వ్యవహారానికి ముగింపు చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.