బిల్ క్లింటన్, మోనికా లెవిన్‌స్కీ (ఫైల్)
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్‌లపై 'హిల్లరీ' అనే పేరుతో రూపొందించిన నాలుగు గంటల డాక్యుమెంటరీ సంచలనం రేపుతోంది. మోనికా లెవిన్‌స్కీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు బిల్ క్లింటన్ మొదటిసారిగా ఒప్పుకున్నారు. అధ్యక్షుడిగా ఉన్నసమయంలో ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన ఇప్పుడు నిజాన్ని అంగీకరించారు. ఒత్తిడి, నిరాశ, ఆందోళనల నుంచి ఉపశమనం పొందేందుకే ఇలాంటి పనిచేశానని తెలిపారు. ఆమెతో గడపడం వల్ల ఒత్తిడి తగ్గి కాస్త ప్రశాంతంగా ఉండగలిగేవాడనని పేర్కొన్నారు. అయితే కొన్ని విషయాలు మనల్ని జీవితాంతం వెంటాడతాయని.. ఇది కూడా అలాంటి తప్పేనని ఆయన అంగీకరించారు. మోనికాతో సంబంధం తన జీవితంలోనూ ఎన్నో మలుపులకు దారితీసిందని చెప్పారు. రాజకీయంగా, కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని వెల్లడించారు.
బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ వ్యవహారం అమెరికా రాజకీయాల్లో సంచలనం రేపింది. దీంతో 1998, డిసెంబరు 19న అభిశంసనను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. గతంలో ఆయన చాలాసార్లు తన ఎఫైర్ వార్తలను ఖండించారు. తాజాగా అది నిజమేనని బిల్ క్లింటన్ ప్రకటించడం గమనార్హం. కాగా, ఇద్దరి అంగీకారం, పరస్పర అవగాహనతోనే బిల్ క్లింటన్‌తో అఫైర్ సాగిందని మోనికా లెవిన్‌స్కీ గతంలో వెల్లడించారు. తమ అఫైర్‌లో క్లింటన్ చొరవ తీసుకున్నారని ‘వానిటీ ఫెయిర్’ పత్రిక కోసం రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. తమ ఇద్దరి మధ్య జరిగిన వ్యవహారంపై తాను తీవ్ర పశ్చాత్తాపానికి గురయ్యానని ఆవేదన చెందారు. ఇక వ్యవహారానికి ముగింపు చెప్పాల్సిన సమయం వచ్చిందని అప్పట్లోనే అన్నారు.
చదవండి: ఎన్పీడీఆర్ఆర్ చైర్మన్‌గా అమిత్ షా
Comments
Please login to add a commentAdd a comment