
వాషింగ్టన్:అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వస్థతకు గురయ్యారు.చికిత్స కోసం ఆయనను వాషింగ్టన్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని క్లింటన్ వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు.బిల్ క్లింటన్ జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. క్లింటన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు.
క్రిస్మస్ పండుగకు ఆయన ఇంటికి తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.కాగా,అమెరికా అధ్యక్షుడిగా బిల్‌క్లింటన్ రెండు సార్లు (1993-2001) పనిచేశారు. 2001 తర్వాత వైట్‌హౌస్‌ను వీడిన ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు.2004లో తీవ్ర ఛాతీ నొప్పి, శ్వాసకోస సమస్యలు రావడంతో ఆయనకు నాలుగుసార్లు బైపాస్ సర్జరీ చేశారు.
ఏడాది తర్వాత ఊపిరితిత్తులు మళ్లీ దెబ్బతినడంతో తిరిగి ఆస్పత్రిలో చేర్పించారు.2010లో గుండె సంబంధిత సమస్య రావడంతో మరోసారి శస్త్రచికిత్స చేసి రెండు స్టెంట్లు అమర్చారు. తర్వాత కొద్ది రోజులకు ఆయన పూర్తిగా కోలుకున్నారు.ఇటీవల 2021లో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స తీసుకున్నారు.నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో డెమోక్రట్ల తరఫున ఆయన చురుకుగా ప్రచారం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment