వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, వైట్‌హౌస్ ఉద్యోగిని మోనికా లెవిన్స్కీ మధ్య వివాహతర సంబంధముందని రుజువు చేసిన లిండా ట్రిప్(70) మంగళవారం(ఏప్రిల్ 7న) కన్నుమూశారు. ఆమె గతంలో మోనికాతో స్నేహం చేసి.. వారిద్దరి సంభాషణలను రహస్యంగా రికార్డు చేసి, దాన్ని బయట ప్రపంచానికి వెల్లడించడం అప్పట్లో సంచలనం రేపింది. అంతేకాక ఇది అతనిపై అభిశంసన తీర్మానం పెట్టడానికి ఆస్కారమైంది. అయితే ప్రతినిధుల సభలో బిల్ క్లింటన్ అభిశంసనకు గురైనప్పటికీ, సెనేట్‌లో ఆయనకు ఊరట లభించిన విషయం తెలిసిందే. (నిజం ఒప్పుకున్న బిల్ క్లింటన్)
అయితే ఈ వ్యవహారంలో లిండాకు కొంతమంది మద్దతుగా నిలబడగా, మరికొందరు మాత్రం ఆమెను మిత్రద్రోహిగా అభివర్ణించారు. కాగా 48 ఏళ్ల వయసులో భర్త నుంచి విడాకులు తీసుకున్న లిండా ట్రిప్ అనంతరం కొలంబియాలో నివసించారు. ఆమె 2001 నుంచి రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. తాజాగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఒకప్పటి స్నేహితురాలు మోనికా లెవిన్స్కీ వైరాన్ని పక్కన పెట్టి ఆమె త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. ఇంతలోనే ఏప్రిల్ 7న లిండా కన్నుమూశారు. ఇదిలా ఉండగా బిల్ క్లింటన్ ఈ మధ్యే ఆమె చేసిన ఆరోపణలను అంగీకరించిన విషయం తెలిసిందే. (‘మేడమ్ ఎక్కడా!!’?)
Comments
Please login to add a commentAdd a comment