
సాక్షి, విశాఖపట్నం: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఝలక్ ఇచ్చారు. రాహుల్‌ను ప్రధాని చేయాలన్నది తన విధానం కాదని వెల్లడించారు. విశాఖపట్నంలో జరుగుతున్న ‘ఇండియా టుడే’ కాన్‌క్లేవ్ సౌత్ 2018లో ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్ష కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా ఇప్పటివరకు ఎవరిని ప్రకటించలేదని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్ష కూటమి తరపున రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా డిసెంబర్ 16న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. అది డీఎంకే పార్టీ విధానమని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీని వ్యతిరేక వ్యక్తి (నెగెటివ్ క్యారెక్టర్)గా చంద్రబాబు వర్ణించారు. మోదీ తప్పా అందరూ ఉత్తములని అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వ విధానాలు దేశాన్ని సర్వనాశనం చేశాయని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment