కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఝలక్ ఇచ్చారు. రాహుల్‌ను ప్రధాని చేయాలన్నది తన విధానం కాదని వెల్లడించారు. విశాఖపట్నంలో జరుగుతున్న ‘ఇండియా టుడే’ కాన్‌క్లేవ్ సౌత్ 2018లో ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్ష కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా ఇప్పటివరకు ఎవరిని ప్రకటించలేదని తెలిపారు.