వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో శనివారం ఉదయం 10.15 గంటల నుంచి 10.45 గంటల మధ్య జగన్ ‘ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చుంటారో నిర్ణయించడంలో దక్షిణాది ప్రాంత పాత్ర (హౌ ది దక్కన్ విల్ డిసైడ్ హూ సిట్స్ ఇన్ ఢిల్లీ)’ అనే అంశంపై ప్రసంగిస్తారు. కాగా, ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్ వెంట వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ బాలశౌరి, మాజీ ఎమ్మెల్యే కె.రవిబాబు ఉన్నారు. విమానాశ్రయం నుంచి వైఎస్ జగన్ నేరుగా వైవీ సుబ్బారెడ్డి నివాసానికి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment