రాజీవ్ చివరిక్షణాలు (ఫైల్ ఫొటో) (ఇన్‌సెట్‌లో సోనియా గాంధీ)
ముంబై : తన భర్త రాజీవ్‌ను రాజకీయాల్లోకి రావద్దని కోరింది నిజమేనని సోనియా గాంధీ చెప్పారు. ఇందిర లాగే రాజీవ్ కూడా హత్యకుగురవుతారనే ఆందోళన ఎప్పటి నుంచో ఉండేదని, భపపడ్డట్లే విషాదాన్ని చూడాల్సివచ్చిందన్నారు. శుక్రవారం ‘ఇండియా టుడే ముంబై కంక్లేవ్’లో మాట్లాడిన ఆమె.. గతాన్ని తలుచుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ‘ఇండియా టుడే’ ఎడిటర్ ఇన్ చీఫ్ అరుణ్ పూరీ.. సోనియాను ఇంటర్వ్యూ చేశారు.
‘‘రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజాసేవ తప్ప మిగతావన్నీ రెండో ప్రాధాన్యాలే అవుతాయి. రాజీవ్ కూడా కుటుంబానికి దూరమవుతారని ఆందోళన చెందా. కానీ అత్త(ఇందిరా గాంధీ) హత్యతర్వాత ఆయన రాజకీయాల్లోకి రాకతప్పలేదు. బహుశా రాజీవ్‌ను (రాజకీయాల్లోకి) వద్దనడం నా స్వార్థమే కావచ్చు, అయితే, ఆయన్ను చంపేస్తారేమోనని భయంకూడా మాలో ఉండేది. నా చుట్టుపక్కల అలా మాట్లాడుకోవడం చాలాసార్లు నా చెవినడేవి. చివరికి దేనిగురించైతే భయపడ్డామో అదే జరిగింది’’ అంటూ ఉబికివచ్చిన కన్నీళ్లను తుడుచుకున్నారు సోనియా గాధీ.
ఇందిరా గాంధీ హత్య(1984) జరిగిన ఏడేళ్లకే రాజీవ్ గాంధీ (1991లో) ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనను ఎల్‌టీటీఈ తీవ్రవాదులు బెల్టుబాంబులతో చంపేసిన ఉదంతం విదితమే. రాజీవ్ హత్యానంతరం ఏళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న సోనియా గాంధీ.. 1998లో కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు. గతేడాదే పార్టీ అత్యున్నత పదవి నుంచి తప్పుకున్న ఆమె.. కుమారుడు రాహుల్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment