
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు.
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన వెంట మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, బాలశౌరి, రాజ్యసభ సభ్యులు వి. విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ప్రముఖ వార్తా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహిస్తున్న సదస్సులో ఆయన పాల్గొంటారు.
‘ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చుంటారో దక్షిణాది ఎలా నిర్ణయిస్తుంది?’ (హౌ ది డెక్కన్ విల్ డిసైడ్ హూ సిట్స్ ఇన్ ఢిల్లీ) అనే అంశంపై వైఎస్ జగన్ మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత హోదాలో శనివారం ఆయన ఈ సదస్సులో ప్రసంగించనున్నారు.