
సాక్షి, ఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. రెండు రోజులు పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఢిల్లీకి చేరుకున్నారు. ఇక, ఢిల్లీలో సీఎం జగన్‌కు ఎయిర్‌పోర్టులో వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, భరత్, రెడ్డప్పా, అయోధ్య రామిరెడ్డి, బాలశౌరి, గోరంట్ల మాధవ్, రంగయ్యలు ఘన స్వాగతం పలికారు.
కాగా, సీఎం జగన్ ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బాకాయిలపై చర్చించనున్నారు. అలాగే, రేపు వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై జరుగుతున్న సదస్సులో సీఎం జగన్ పాల్గొననున్నారు. శుక్రవారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.
ఇది కూడా చదవండి: ఎన్డీయే నుంచి బయటకు కాదు.. పవన్‌నే బీజేపీనే వద్దనుకుందా?