సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు సీఎం జగన్. ఈ రాత్రి 1, జన్‌పథ్ నివాసంలో ముఖ్యమంత్రి జగన్ బస చేస్తారు. అపాయింట్మెంట్ షెడ్యూల్ ప్రకారం రేపు(శుక్రవారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు సీఎం జగన్.
ప్రధాని మోదీతో భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి జగన్ చర్చించే అవకాశం ఉంది.
- ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా
- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల
- పోలవరం నిధులు త్వరితగతిన విడుదలకు ఆదేశాలు
- పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయంకు సంబంధించిన ఆమోదం
- కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో ఉన్న అంశాలతో పాటు పెండింగ్ అంశాల పరిశీలన
- 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరాచేసిన విద్యుత్‌కు సంబంధించి బకాయిల క్లియరెన్స్
- కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పన్ను చెల్లింపులు
- జాతీయ ఆహార భద్రతాచట్టం కింద ఆంధ్రప్రదేశ్‌కు మరింత ఎక్కువ కవరేజీ
- ఏపీకన్నా ఆర్థికంగా ముందువరుసలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు సమానంగా వాటా
- ఈ వాటా లభిస్తే.. రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్ దక్కే అవకాశం
- విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు
- కొత్త జిల్లాల్లో ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీలకు కేంద్రం వాటాగా మరింత సాయం
- APMDC కింద ఏర్పాటయ్యే ప్లాంట్లకు ముడి ఖనిజం ఇచ్చేలా కేంద్ర గనుల శాఖకు ఆదేశాలు
- ఏపీ పౌరసరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సబ్సిడీ బకాయిల క్లియరెన్స్
Comments
Please login to add a commentAdd a comment