CM YS Jagan: ముగిసిన ఢిల్లీ పర్యటన | CM Jagan to meet PM Narendra Modi | Sakshi
Sakshi News home page

ముగిసిన సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన

Published Fri, Feb 9 2024 2:08 AM | Last Updated on Fri, Feb 9 2024 6:32 PM

CM Jagan to meet PM Narendra Modi - Sakshi

Updates

03: 44PM, Feb 9, 2024
ముగిసిన సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన

  • ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హస్తిన పర్యటన ముగిసింది
  • ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్‌ సమావేశం
  • పార్లమెంట్‌ భవనంలోనే భేటీ అయిన ఏపీ సీఎం
  • ఏపీకి రావాల్సిన పెండింగ్‌ బకాయిలు, ఇతరత్రా కేంద్ర హామీలపై చర్చలు
  • ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి గన్నవరం బయల్దేరిన సీఎం జగన్‌
     

02: 25PM, Feb 9, 2024
నిధులు, పెండింగ్‌ బకాయిలపై సీఎం జగన్‌ చర్చ 

  • కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ
  • పార్లమెంట్‌లోని ఆర్థికశాఖ కార్యాలయంలో అరగంట పాటు కొనసాగిన సమావేశం
  • రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చ


01: 50PM, Feb 9, 2024

  • కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో ముగిసిన సీఎం జగన్‌ భేటి

01:21PM, Feb 9, 2024

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో  ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ 

  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం జగన్‌ భేటీ
  • పార్లమెంట్లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో కొనసాగుతున్న సమావేశం

12:50PM, Feb 9, 2024

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ

  •  ప్రధానితో సుమారు గంటన్నరపాటు కొనసాగిన సీఎం జగన్‌ సమావేశం
  • రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్‌ బకాయిలపై చర్చ

     

ప్రధాని మోదీతో భేటీలో ఈ అంశాలపై ముఖ్యమంత్రి జగన్‌ చర్చించినట్లు తెలుస్తోంది...

1. పోలవరం ప్రాజెక్ట్‌లో కాంపొనెంట్‌ వారీగా సీలింగ్‌ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించిందని, దీంతోపాటు ప్రాజెక్టు తొలివిడతను సత్వరమే పూర్తిచేయడానికి రూ.12,911కోట్ల నిధుల విడుదలకూ అంగీకరించిందని, ఈరెండు అంశాలు కేంద్ర కేబినెట్‌ ఆమోదం కోసం ఎదరుచూస్తున్నాయని, దీనిపై తక్షణమే దృష్టిపెట్టాలని కోరిన ముఖ్యమంత్రి. 

2.అయితే  పోలవరం మొదటి విడత పూర్తిచేయడానికి దాదాపు రూ.17,144 కోట్లు ఖర్చు అవుతాయని, ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తిశాఖ పెండింగ్‌లో ఉందని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని కోరిన ముఖ్యమంత్రి.  

3.  2014 జూన్‌ నుంచి మూడేళ్లపాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్‌కో విద్యుత్‌ సరఫరా చేసిందని, దీనికి సంబంధించిన రూ.7,230 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే వీటిని చెల్లించేలా చూడాలని కోరిన సీఎం. 

4. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని కోరిన సీఎం. రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా అవసరమని, పెట్టుబడులు రావడమే కాకుండా తద్వారా మెరుగైన ఉపాథి అవకాశాలు ఏర్పాడతాయన్న సీఎం. 

5. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించామని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఉండేలా రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తున్నామని, ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభం అయ్యాయని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం. కాలేజీల ఏర్పాటుకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించాలన్న సీఎం. 

6. విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుతో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖపట్నం పోర్టులను కలిపే 55 కిలోమీటర్ల 6 లేన్ల  రహదారికి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరిన సీఎం.

7.  విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం – కర్నూలు హైస్పీడ్‌ కారిడార్‌ను వయా కడప మీదుగా బెంగుళూరు వరకూ పొడిగించాలని, దీనిపై తగిన పరిశీలనలు పూర్తిచేసిన ఈ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూడాలని కోరిన సీఎం.
కడప– పులివెందుల– ముదిగుబ్బ – సత్యసాయి ప్రశాంతి నిలయం– హిందూపూర్‌ కొత్త రైల్వేలైన్‌ను దీంట్లో భాగంగా చేపట్టాలని కోరిన సీఎం. ఈ ప్రాజెక్టు వల్ల వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుందన్న సీఎం. 

8. విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని ప్రధానిని కోరిన ముఖ్యమంత్రి. 

ఇవిగాక.. 

  • ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా
  • స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలుపుదల
  • కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పన్ను చెల్లింపులు
  • జాతీయ ఆహార భద్రతాచట్టం కింద ఆంధ్రప్రదేశ్‌కు మరింత ఎక్కువ కవరేజీ
  • ఏపీకన్నా ఆర్థికంగా ముందువరుసలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాలకు సమానంగా వాటా
  • ఈ వాటా లభిస్తే.. రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్‌ దక్కే అవకాశం
  • విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు
  • కొత్త జిల్లాల్లో ఏర్పాటవుతున్న మెడికల్‌ కాలేజీలకు కేంద్రం వాటాగా మరింత సాయం
  • APMDC కింద ఏర్పాటయ్యే ప్లాంట్లకు ముడి ఖనిజం ఇచ్చేలా కేంద్ర గనుల శాఖకు ఆదేశాలు
  • ఏపీ పౌరసరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సబ్సిడీ బకాయిల క్లియరెన్స్‌

12:10PM, Feb9, 2024

ప్రధాని నరేంద్ర మోదీతో గంట నుంచి కొనసాగుతున్న సీఎం వైఎస్ జగన్‌ సమావేశం

11:10AM, Feb 9, 2024

  •  ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ
  • పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో సమావేశం
  • రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై చర్చ

11:03AM, Feb 9, 2024

  • పార్లమెంట్‌కు చేరుకున్న సీఎం జగన్‌
  • కాసేపట్లో ప్రధాని మోదీతో సీఎం జగన్‌ భేటీ

 8:00AM, Feb 9, 2024
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్‌ గురువారం రాత్రి ఢిల్లీ వచ్చారు.

శుక్రవారం ఉదయం 11గంటల ప్రాంతంలో ప్రధాని మోదీతో సీఎం జగన్‌ సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సీఎం జగన్‌ సమావేశం అవుతారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్రం తగిన సహాయ సహకారాలను అందించాలని, తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన విద్యుత్తు బకాయిలు, విభజన సమయంలో పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీల అమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్రంతో చర్చించేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు. గురువారం సాయంత్రమే ఆయన ఢిల్లీ చేరుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement