CM Jagan: ముగిసిన ఢిల్లీ పర్యటన | AP CM YS Jagan Delhi Tour Completed Updates In Telugu, Details Inside - Sakshi
Sakshi News home page

ముగిసిన సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన

Published Sat, Oct 7 2023 11:21 AM | Last Updated on Sat, Oct 7 2023 11:36 AM

CM Jagan Delhi Tour Completed Updates - Sakshi

ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలతో పాటు పోలవరం నిధుల గురించి ఇతర అంశాలపై. 

సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది.  గురువారం ఉదయం ఢిల్లీకి వెళ్లిన ఆయన.. ఈ ఉదయం ఢిల్లీ నుంచి ఏపీకి తిరుగుపయనం అయ్యారు. శుక్రవారం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో హాజరు కావడంతో పాటు.. పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసి ఏపీకి సంబంధించిన వ్యవహారాలపై చర్చలు జరిపారాయన. 

ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలతో పాటు పొలవరం.. వివిధ అంశాలను సీఎం జగన్‌ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. తొలుత కేం‍ద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో, ఆపై కేంద్రం విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో భేటీ అయ్యారాయన. ఈ సందర్భంలో.. ఏపీ విద్యుత్ రంగ అభివృద్ధిపై మంత్రి ఆర్కే సింగ్ ప్రశంసలు గుప్పించారు. ఆపై నిన్న(శుక్రవారం) ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద నిర్మూలన సదస్సులో.. ఏపీ నుంచి సీఎం జగన్‌, సీఎస్‌, డీజీపీ పాల్గొన్నారు.

నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై రాష్ట్రాల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్న కేంద్రం.. అక్కడ అభివృద్ధి పనులపై ఫోకస్‌ పెట్టేందుకు రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఈ సదస్సులో సీఎం జగన్‌ సైతం ప్రసంగించారు.ఈ సదస్సు తర్వాత నిన్న సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో దాదాపు దాదాపు గంటపాటు సమావేశం అయ్యారు సీఎం జగన్‌. ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలతో పాటు వివిధ అంశాలపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement