అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ పాక్‌ను ఏకిపడేశారు. ఉగ్రవాదాన్ని కట్టడి చేయటంలో పాక్ ఘోరంగా విఫలమౌతోందంటూ ఆమె పేర్కొన్నారు. ఇండియా టుడే కంక్లేవ్‌లో ప్రసంగించిన ఆమె పాక్ వైఖరిపై మండిపడ్డారు. ‘భారత్‌తో సరిహద్దు సమస్య పరిష్కారం దిశగా వాళ్లేం(పాక్) ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించటం లేదు. పైగా ఉగ్రవాదులను ప్రొత్సహిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. మరో పొరుగు దేశం అప్ఘనిస్థాన్‌తోనూ అదే వైఖరి కొనసాగిస్తున్నారు. దీనికి చెక్ పడాల్సిన అవసరం ఉంది. అమెరికా పాక్‌ను కట్టడి చేయటంలో ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుత ప్రభుత్వం కూడా అది చేస్తుందనే ఆశిస్తున్నా’ అని హిల్లరీ పేర్కొన్నారు.
పాక్‌పై హిల్లరీ క్లింటన్ ఫైర్
Published Sun, Mar 11 2018 4:30 PM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM
Advertisement
Advertisement
Advertisement