
ఆస్కార్ సెలబ్రేషన్స్ తర్వాత ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ అంతా ఇండియాకు వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ రెండు రోజుల క్రితమే రాగా నేడు ఉదయం రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో దిగింది. రామ్‌చరణ్ మాత్రం నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నాడు. ఇందుకు ప్రత్యేక కారణం లేకపోలేదు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లాడు.
ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్ వచ్చిన తర్వాత తొలిసారి చరణ్ మీడియాతో మాట్లాడనున్నారు. రాత్రి 9.30 గంటలకు చెర్రీ ఇంటరాక్షన్ ఉంటుంది. ఇక ఈరోజు జరగనున్న ఇండియా టుడే కాంక్లేవ్‌కు అమిత్ షా, జాన్వీ కపూర్, మలైకా అరోరా సహా తదితర రంగాల్లోని ప్రముఖులు హాజరు కానున్నారు. ఇప్పటికే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఈ సదస్సుకు హాజరై తన ప్రసంగాన్ని పూర్తి చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment