రామ్‌ చరణ్‌పై హాలీవుడ్‌ హీరో ప్రశంసలు.. ఎందుకంటే..? | Popular French Actor Lucas Nicolas Bravo Praise Ram Charan Acting In RRR Movie, Video Goes Viral | Sakshi
Sakshi News home page

రామ్‌ చరణ్‌పై ప్రశంసలు వర్షం కురిపించిన హాలీవుడ్‌ హీరో

Published Fri, Aug 16 2024 1:55 PM | Last Updated on Fri, Aug 16 2024 2:01 PM

Popular French Actor Lucas Nicolas Bravo Praise Ram Charan Acting In RRR Movie

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో రామ్‌ చరణ్‌ గ్లోబల్‌ స్టార్‌ అయ్యాడు. అందులో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర పోషించిన రామ్‌ చరణ్‌..తనదైన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. చరణ్‌ నటనకు ఇండియన్‌ సినీ ప్రేక్షకులే కాదు.. హలీవుడ్‌ సెలబ్రిటీలు సైతం ఫిదా అ‍య్యారు. ఇప్పటికే పలువురు హాలీవుడ్‌ ప్రముఖులు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను..అందులో చరణ్‌ నటనపై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా హాలీవుడ్ స్టార్‌ లుకాస్ బ్రావో కూడా ఆర్‌ఆర్‌ఆర్‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న‌ను ప్ర‌శంసించారు. 

ఎమిలీ ఇన్ పారిస్‌కు సంబంధించిన ప్ర‌మోష‌న్స్ స‌మయంలో ఇండియ‌న్ సినిమాల్లో మీకు నచ్చిన న‌టుడు గురించి చెప్ప‌మ‌ని అడిగిన‌ప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా చూశాన‌ని చెప్పిన లుకాస్ బ్రావో... రామ్ చరణ్ ఒక అద్భుతమైన నటుడని కొనియాడాడు. ‘ఎంట్రీ సీన్‌, ఎమోషనల్‌ సన్నివేశాల్లో బాగా నటించాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌లలోనూ ఆకట్టుకున్నాడు’ అని ప్రశంసించారు.  ప్రస్తుతం ఈ వీడియోను ఆయన అభిమానులు షేర్‌ చేస్తున్నారు. దీంతో ఎక్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పేరు దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చింది.

రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌తో పాటు ఎన్టీఆర్‌ కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా 2022లో రిలీజై.. బాక్సాఫీస్‌ వద్ద దాదాపు రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించడమే కాకుండా..ఆస్కార్‌ అవార్డును సైతం గెలుచుకుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement