సాక్షి, అమరావతి: ఎస్సై పోస్టులకు ఈ నెల 18, 19 తేదీల్లో తుది రాతపరీక్షలు నిర్వహించనున్నట్టు ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ అతుల్‌సింగ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నాం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు రోజుకు రెండు పరీక్షలు చొప్పున రెండు రోజుల్లో నాలుగు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 355 సివిల్ ఎస్సై, 113 ఏఆర్ ఎస్సై, 9 రిజర్వ్ ఎస్సై, 209 ఏపీఎస్‌పీ ఎస్సై. 16 డిప్యూటీ జైలర్, 5 అసిస్టెంట్ మేట్రిన్ పోస్టులకు ఇప్పటికే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
దేహదారుఢ్య పరీక్షల్లో ఎంపికైన 35,428 మందికి తుది రాతపరీక్షలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. వీరికి విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలుల్లో రెండు రోజులపాటు తుది రాత పరీక్షలు నిర్వహిస్తామని అతుల్‌సింగ్ వెల్లడించారు. అభ్యర్థులు ఈ నెల 8న సాయంత్రం 5 గంటలలోపు recruitment. appolice. gov. in, www. appolice. gov. in వెబ్‌సైట్‌ల నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఏదైనా సందేహం, సమస్య ఉంటే 0884–2340535, 2356255 హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని, లేదా apslrpb. pc@ gmail. comMyకు మెయిల్ చేయవచ్చని సూచించారు.
ఎస్సై పోస్టులకు 18 నుంచి రాతపరీక్షలు
Published Fri, Feb 3 2017 2:11 AM | Last Updated on Sun, Sep 2 2018 3:42 PM
Advertisement