కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: ఫారెస్టు డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకోసం ఈ నెల 11 నుంచి నిర్వహిస్తున్న పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జి. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్, రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ బి. శ్రీనివాసరెడ్డి, డీఎఫ్‌ఓలు టి. చక్రపాణి, ఎ. చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షల నిర్వహణపై గురువారం కళాశాలలో సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. పరీక్షలను మొదటిసారిగా జేఎన్‌టీయూ(హైదరాబాద్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు.
అన్ని పరీక్షలు(టెక్నికల్ అసిస్టెంట్ మినహా) ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. టెక్నికల్ అసిస్టెంట్ పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. పరీక్ష పార్ట్- 1, 2, 3 భాగాలుగా ఉంటుందన్నారు. పార్ట్ వన్ ఎస్‌ఏ టైప్, పార్ట్ -2, 3 ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఉంటుందన్నారు. పరీక్షలో వచ్చిన మార్కులు, వాకింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. అభ్యర్థులు ్చఞజఛీట్ట.ౌటజ వెబ్‌సైట్ ద్వారా పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి ఒకరోజు ముందు వరకు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. పరీక్ష కేంద్రానికి ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. పరీక్షలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడినవారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి భవిష్యత్‌లో ఏ ఉద్యోగానికి ద రఖాస్తు చేసుకోకుండా అనర్హులను చేస్తామని ెహ చ్చరించారు.
పరీక్ష వివరాలు
తేది పోస్ట్ అభ్యర్థుల సంఖ్య కేంద్రాలు
11 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 6,775 12
12 బంగ్లా వాచర్ 278 01
13 తానేదార్ 350 01
14 టెక్నికల్ అసిస్టెంట్ 243 01
18 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 8,766 16
25 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 1,697 03
‘ఫారెస్ట్’ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
Published Fri, May 9 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 7:05 AM
Advertisement
Advertisement