వీవీ వినాయక్‌ను కలిసిన మార్గాని | Margani Nageswar Rao Meet VV Vinayak in West Godavari | Sakshi
Sakshi News home page

వీవీ వినాయక్‌ను కలిసిన మార్గాని

Published Tue, Jan 15 2019 7:56 AM | Last Updated on Tue, Jan 15 2019 7:56 AM

Margani Nageswar Rao Meet VV Vinayak in West Godavari - Sakshi

చాగల్లులో దర్శకుడు వీవీ వినాయక్‌ను కలిసిన మార్గాని నాగేశ్వరరావు, నాయకులు

పశ్చిమగోదావరి, చాగల్లు: చాగల్లులో ప్రముఖ సీనీ దర్శకుడు వీవీ వినాయక్‌ను వైఎస్సార్‌ సీపీ నాయకులు బీసీ సంఘం రాష్ట్ర జేఏసీ చైర్మన్‌ మార్గాని నాగేశ్వరరావు సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తన కుమారుడు వైఎస్సార్‌ సీపీ రాజమండ్రి పార్లమెంట్‌ కో ఆర్టినేటర్‌ మార్గాని భరత్‌రామ్‌కు మద్దతు ఇవ్వాలని వినాయక్‌ను కోరారు. అనంతరం నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ రాజమండ్రి సీటును బీసీలకు కేటాయించడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు 13 జిల్లాలో బీసీలకు చట్ట సభల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ నిర్ణయానికి వైఎస్సార్‌ సీపీ సానుకూలంగా ఉందని జగన్‌ ఇప్పటికే తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో మూలనివాసి రాష్ట్ర అధ్యక్షుడు మార్గాని చంటిబాబు, బీసీ సంఘం చాగల్లు మండల అధ్యక్షుడు బొర్రా కృష్ణారావు, వీవీ వినాయక్‌ సోదరుడు గండ్రోతు సురేంద్రకుమార్, జుట్టా కొండలరావు,అయినం నాగరాజు ఉన్నారు.

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు
ప్రస్తుతానికి రాజకీయ రంగంలోకి ప్రవేశించే అలోచన లేదని ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్‌ అన్నారు. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామం చాగల్లు వచ్చిన ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. తనకు ఆన్‌లైన్‌లో ఫేస్‌బుక్, ట్విట్టర్, హిస్ట్రోగామ్‌ వంటి వాటిల్లో అకౌంట్‌లు లేవని, వాటిల్లో వచ్చిన వార్తలకు తనకు సంబంధం లేదన్నారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సంక్రాంతికి చాగల్లు వచ్చి తన కుటుంబ సభ్యులతో బంధువులతో కలిసి గడపటం సంతోషాన్ని ఇస్తుందన్నారు. త్వరలో సి.కళ్యాణ్‌ నిర్మాతగా హీరో బాలకృష్ణతో చిత్రం తీసేందుకు కథ అన్వేషణలో ఉన్నట్టు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement