ఏజెన్సీలో లక్ష మంది పేదలకు ఉచిత నేత్ర వైద్యం
ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థ చైర్మన్ నాగేశ్వరరావు
అరకులోయ,న్యూస్‌లైన్: ఏజెన్సీ ప్రాంతంలో లక్ష మంది పేదలకు ఉచితంగా కంటి వైద్యం అందించేందుకు నిర్ణయించినట్టు ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థ చైర్మన్ జి.నాగేశ్వరరావు తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా అరకులోయలో ఏర్పాటు చేసిన 100వ దృష్టి కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. వైద్యపరీక్షల అనంతరం విశాఖలో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామన్నారు. ఆస్పత్రి నిర్మాణానికి స్థలం కేటాయిస్తే నూతన భవనం నిర్మిస్తామన్నారు. 500మంది విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తామని చెప్పార