జనవరి నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ
ఖమ్మం జెడ్పీసెంటర్: జవవరి నెల నుంచి జిల్లాలో గ్యాస్‌కు నగదు బదిలీ పథకం అమలవుతుందని కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి పేర్కొన్నారు. గ్యాస్ నగదు బదిలీపై అయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు, డీలర్లు, ఎల్‌డీఎం, పౌరసరఫరాలశాఖాధికారులతో శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్‌పిజీ గ్యాస్ నగదు బదిలీ పొందేందుకు వినియోగదారులందరూ తప్పనిసరిగా ఆధార్, బ్యాంక్ ఖాతాల వివరాలను సంబంధింత గ్యాస్ డీలర్‌కు అందజేయాలన్నారు.
నగదు బదిలీ పొందేందుకు గ్యాస్ డెలివరీ సమయంలో వినియోగదారుల నుంచి వారి ఆధార్, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులను సేకరించాలన్నారు. ఆధార్ అనుసంథానం చేసుకొని వారు వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 3 లక్షల 61వేల 28 మంది ఆయా డీలర్ల వద్ద సీడింగ్ చేయించుకున్నారని, 2లక్షల 48వేల 61 మంది వివిధ బ్యాంకులతో సీడింగ్ చే యించుకున్నారని కలెక్టర్ తెలిపారు. జనవరి నుంచి నగదు బదిలీ అమలు జరుగుతుందని, అనుసంధానం చేయించుకొని వారికి నగదు బదిలీ సబ్సీడీ వర్తింపులో జాప్యం జరుగుతుందని అన్నారు. వెంటనే అందరు ఆధార్, బ్యాంక్ ఖాతాల వివరాలను డీలర్లకు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో ఎల్‌డీఎం శ్రీనివాస్, డీఎస్వో గౌరీ శంకర్ పాల్గొన్నారు.