‘రూ 57,000 కోట్లు ఆదా’
సాక్షి,న్యూఢిల్లీః ప్రభుత్వ పథకాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ 57,000 కోట్లు ఆదా అయ్యాయని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. గతంలో ఈ సొమ్ము దళారుల జేబుల్లోకి వెళ్లేదని ఇప్పుడు దీనికి అడ్డుకట్ట పడిందని అన్నారు. ఉపాథి హామీ పథకం సహా పలు పథకాల చెల్లింపులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళుతున్నాయని చెప్పారు. ఇక డ్రైవింగ్ లైసెన్సులకూ ఆధార్‌ను లింక్ చేయనున్నామన్నారు.
ఆధార్ డేటాపై ఆందోళన అనవసరమని, ఐరిస్ స్కాన్, ఫింగర్‌ప్రింట్స్ సహా బయోమెట్రిక్ సమాచారం అంతా సురక్షితంగా భద్రపరుస్తారని తెలిపారు. ఆధార్ డిజిటల్ గుర్తింపు మాత్రమేనని, ఆధార్ అనధికార వినియోగాన్ని అరికట్టేందుకు చట్టాలున్నాయని చెప్పారు.