Ravisankar Prasad
-
రాజ్యసభ రగడ : క్షమాపణ కోరితే సస్పెన్షన్‌పై పునరాలోచన
సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో సస్పెన్షన్‌కు గురైన ఎనిమిది మంది సభ్యులు క్షమాపణ కోరితే వారిపై సస్పెన్షన్ వేటును ఉపసంహరించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఎనిమిది మంది సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు రాజ్యసభ నుంచి మంగళవారం వాకౌట్ చేసిన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. విపక్ష సభ్యుల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ తొలుత సభ నుంచి వాకౌట్ చేయడా ఆపై ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు వాకౌట్ చేశాయి. రాజ్యసభలో తమ ప్రవర్తనపై సస్పెన్షన్‌కు గురైన సభ్యులు క్షమాపణ కోరితే ప్రభుత్వం వారిపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. రాజ్యసభలో విపక్షాల అనుచిత ప్రవర్తనను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని తాము భావించామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన ట్వీట్‌కు అనుగుణంగా ఎంపీలు ఇలా ప్రవర్తించడం ఏ తరహా రాజకీయమని ఆయన రాహుల్ ట్వీట్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. తన తల్లి సోనియా గాంధీ ఆరోగ్య పరీక్షల కోసం రాహుల్ ఆమె వెంట విదేశీ పర్యటనలో పాల్గొన్న విషయం తెలిసిందే. రాజ్యసభ టేబుల్‌పైకి ఎక్కి నృత్యం చేస్తూ కాగితాలను చించివేసిన కాంగ్రెస్ ఎంపీని తాము ఇంతవరకూ చూడలేదని కేంద్ర మంత్రి ఆక్షేపించారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందేందుకు ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉందని చెప్పారు. కాగా, వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. చదవండి : ఎంపీల నిరసన : పోలీసుల ఓవర్ యాక్షన్ -
ముగిసిన సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన
-
ముగిసిన సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని అమరావతిలోని తన నివాసానికి చేరుకున్నారు. శుక్రవారం రోజున కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన సీఎం.. ఇవాళ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మూడు అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని కార్యకలాపాలు, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాన్ని ఆయనకి సీఎం వైఎస్ జగన్ వివరించారు. దీని కోసం రాజధాని కార్యకలాపాలను మూడు ప్రాంతాలకు వికేంద్రీకరించామని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడీషియల్ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతి ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని న్యాయశాఖమంత్రికి వివరించారు. చదవండి: న్యాయశాఖ మంత్రిని కలిసిన సీఎం జగన్ ఇందుకోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం– 2020కి అసెంబ్లీ ఆమోదముద్ర వేసిందని సీఎం వివరించారు. ఇందులో భాగంగా హైకోర్టును కర్నూలుకు తరలించడానికి కేంద్ర న్యాయశాఖ తగిన చర్యలను తీసుకోవాలని కోరారు. రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ 2019 మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాన్ని కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. శాసనమండలి రద్దు అంశాన్నికూడా కేంద్రమంత్రితో సీఎం చర్చించారు. దీనికి సంబంధించి తదనంతర చర్యలు తీసుకోవాలని కోరారు. శాసనమండలి.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని కేంద్రమంత్రికి వివరించారు. ఈ నేపధ్యంలో మూడింట రెండొంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.. శాసనసభ మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసిందని అందుకు అనుగుణంగా కేంద్ర న్యాయశాఖ తదుపరి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. మహిళలు, చిన్నారులపై నేరాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రవేశపెట్టిన దిశ చట్టాన్నికూడా సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. వీలైనంత త్వరగా దిశ చట్టం అమల్లోకి తీసుకొచ్చేలా న్యాయశాఖ తరఫున ప్రక్రియను వేగవంతం చేయాలని రవిశంకర్ ప్రసాద్‌ను కోరారు. చట్టం అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వైఎస్ జగన్ కేంద్రమంత్రికి వివరించారు. చదవండి: దిశ చట్టం రూపుదాల్చాలి -
‘ఆయన మంత్రి కాదు..డీలర్’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్‌పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. మహిళా సాధికారతను సాధించే క్రమంలో ట్రిపుల్ తలాఖ్, నిఖా హలాలా, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందేలా కాంగ్రెస్ సహకరించాలని కోరిన మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను డీలర్‌గా అభివర్ణించింది. ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన మేరకు మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని కోరుతూ రాహుల్ గాంధీ ప్రధానికి రాసిన లేఖపై మంత్రి స్పందిస్తూ ఈ బిల్లుల ఆమోదానికి తమతో కలిసి రావాలని కాంగ్రెస్‌ను కోరారు. అయితే మంత్రి స్పందనపై కాంగ్రెస్ విరుచుకుపడింది. రవిశంకర్ ప్రసాద్ లేఖతో మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టరూపం దాల్చేలా ప్రధాని మోదీ ఎలాంటి చొరవ చూపడం లేదని తేటతెల్లమైందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. మహిళా బిల్లును పార్లమెంట్ ఆమోదం పొందేలా వ్యవహరించాల్సిన న్యాయ శాఖా మంత్రి డీలర్‌గా మారడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ప్రధాని మహిళా రిజర్వేషన్ల బిలుపై హామీ ఇచ్చినప్పుడు ఇది షరతులతో కూడిన హామీగా పేర్కొన్నారా అంటూ ఎంపీ, అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టకముందే మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు చేపట్టలేదో ప్రధాని మోదీ ఇంతవరకూ వివరణ ఇవ్వలేదని అన్నారు. -
‘రూ 57,000 కోట్లు ఆదా’
సాక్షి,న్యూఢిల్లీః ప్రభుత్వ పథకాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ 57,000 కోట్లు ఆదా అయ్యాయని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. గతంలో ఈ సొమ్ము దళారుల జేబుల్లోకి వెళ్లేదని ఇప్పుడు దీనికి అడ్డుకట్ట పడిందని అన్నారు. ఉపాథి హామీ పథకం సహా పలు పథకాల చెల్లింపులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళుతున్నాయని చెప్పారు. ఇక డ్రైవింగ్ లైసెన్సులకూ ఆధార్‌ను లింక్ చేయనున్నామన్నారు. ఆధార్ డేటాపై ఆందోళన అనవసరమని, ఐరిస్ స్కాన్, ఫింగర్‌ప్రింట్స్ సహా బయోమెట్రిక్ సమాచారం అంతా సురక్షితంగా భద్రపరుస్తారని తెలిపారు. ఆధార్ డిజిటల్ గుర్తింపు మాత్రమేనని, ఆధార్ అనధికార వినియోగాన్ని అరికట్టేందుకు చట్టాలున్నాయని చెప్పారు. -
ఐటీలో హైదరాబాద్ ప్రాధాన్యత తగ్గదు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినంత మాత్రాన ఐటీ రంగంలో హైదరాబాద్‌కు ఉన్న ప్రాధాన్యత, ప్రత్యేకత ఎక్కడికీ పోదని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం న్యూఢిల్లీలో తన శాఖ 100 రోజుల పాలన ప్రగతి నివేదికను వివరిస్తూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాతో మాట్లాడారు. ఇద్దరూ ఐటీపై అమితమైన ఆసక్తి కనబరిచారు. ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లను ఏర్పాటుచేయాలని కోరారు. వాటిపై దృష్టిపెడతాం..’ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాను బెదిరిస్తున్నారని, దీనిపై మీ స్పందనేమిటని ఓ విలేకరి ప్రశ్నించగా ‘పత్రికా స్వేచ్ఛకు కట్టుబడి ఉంటాం. అందరూ పత్రికా స్వేచ్ఛకు విలువనివ్వాలి’ అని పేర్కొన్నారు. -
మన వెబ్ సైట్లకు హ్యాకింగ్ ముప్పు
మన భారతీయ వెబ్ సైట్లకు హ్యాకింగ్ ముప్పు ముంచుకొస్తోందా? ప్రపంచంలోని పలు దేశాల నుంచి మన వెబ్ సైట్లను హ్యాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మే నెల వరకూ మొత్తం 9174 వెబ్ సైట్లను హ్యాక్ చేశారు. అమెరికా, యూరప్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అల్జీరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్ల నుంచి ప్రధానంగా హ్యాకింగ్ జరుగుతోందని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర ప్రసాద్ చెబుతున్నారు. ఇప్పటి వరకూ 62189 హ్యాకింగ్ యత్నాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. ఈ వివరాలు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది. కాబట్టి వెబ్ సైట్ యజమానులూ... తస్మాత్ జాగ్రత! -
నేడు ప్రణబ్, మోడీలతో కేసీఆర్ భేటీ
-
నేడు ప్రణబ్, మోడీలతో కేసీఆర్ భేటీ
పలువురు కేంద్ర మంత్రులతోనూ సమావేశం కానున్న తెలంగాణ సీఎం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన శని, ఆదివారం రెండు రోజులపాటు ఇక్కడే ఉండి రాష్ట్రపతి, ప్రధానమంత్రితోపాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో, తొమ్మిదిన్నరకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమవుతారు. సాయంత్రం 4.15 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ అవుతారు. 6.15కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకుంటారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కూడా కేసీఆర్ కలిసే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణకు కూడా సీమాంధ్రలాగా ప్రత్యేక హోదా కల్పించాలని, పోలవరం ముంపు ప్రాంతాలపై ఇచ్చిన ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోవడంతోపాటు పలు ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కేసీఆర్ కోరనున్నారు. కాగా, ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఢిల్లీ రావడం ఇదే తొలిసారి. -
కొత్త మంత్రులు ఏం చెప్పారు?
ఢిల్లీ: కేంద్రంలో కొత్త మంత్రులు తమకు కేటాయించిన శాఖలపై స్పందించారు. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. విదేశాల నుంచి నల్లధనాన్ని రప్పించడానికి సిట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను మెరుగుపరుస్తామని కేంద్ర ఆహారశాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ చెప్పారు. ధరల పెరుగుదలను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. ఎగుమతులు పెంచడానికి కృషి చేస్తానని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. మీడియాను నియంత్రించే ఆలోచనలు ఏవీ లేవని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. మీడియాకు తన బాధ్యత ఏంటో తెలుసన్నారు. తనకు తానుగా మీడియా నియంత్రించుకోగలదన్న భావన వ్యక్తం చేశారు. సురక్షిత ప్రయాణం, భద్రత, వేగం ఇవే తమ ప్రాధాన్యతలని రైల్వే మంత్రి సదానందగౌడ చెప్పారు. సీబీఐ విశ్వసనీయత పెంచడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని పీఎంఓ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. జమ్మూకాశ్మీర్‌కు ఆర్టికల్ 370 కింద ప్రత్యేక హోదా అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. మేనిఫెస్టోలో తామిచ్చిన హామీలు నెరవేరుస్తామని పార్లమెంటరీ వ్యవహారాల, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.