సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ విజయవంతమైన, పారదర్శక నగదు బదలీ కార్యక్రమాన్ని భారత్‌తో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది కూలీలు, కార్మికులు జీవించడానికి నగదు లేకుండా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భారత్‌లో లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి 84 శాతం కుటుంబాల ఆదాయం తగ్గిపోయిందని ముంబైకి చెందిన సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఓ నివేదికలో తెలిపింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ భారత్‌లోని పేదలకు నగదు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ట్విటర్‌లో పేర్కొన్నారు.
Acc to this report, 34% of households across India will not be able to survive for more than a week without add assistance. I am ready to offer help & share our successful cash transfer prog, lauded internationally for its reach & transparency, with India.https://t.co/CcvUf6wERM
— Imran Khan (@ImranKhanPTI) June 11, 2020
అదే విధంగా 34 శాతం కుటుంబాలు ప్రత్యేక్ష నగదు సాయం లేకుండా కనీసం ఒక వారం రోజులు కూడా మనుగడ సాగించలేవని ఇమ్రాన్ తెలిపారు. కరోనా కష్ట కాలంలో పాకిస్తాన్‌లో తమ ప్రభుత్వం తొమ్మిది వారాల్లో 120 బిలియన్లను పారదర్శకంగా 10 లక్షల కుటుంబాలకు బదిలీ చేసిందని తెలిపారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్ సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసేలా ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరుతో రూ. 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి, పూటగడవక ఆందోళన చెందే కార్మికుల సంక్షేమం, ఆహార, ఆర్థిక భద్రత కోసం ఈ ప్యాకేజీని కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment