సాక్షి, హైదరాబాద్: వంట గ్యాస్ సబ్సిడీకి సంబంధించి సవరించిన నగదు బదిలీ పథకం అమలుకు రంగం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, వైఎస్సార్, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం - తొమ్మిది జిల్లాల్లో ఈ నెల 15వ తేదీ (శనివారం) నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాయితీ (సబ్సిడీ) మొత్తాన్ని నగదు బదిలీ రూపంలో ఆన్‌లైన్ ద్వారా వినియోగదారులకు జమ చేసేందుకు వీలుగా బ్యాంకు అకౌంట్లను వంట గ్యాస్ కనెక్షన్లకు అనుసంధానం చేసుకోవాలని బ్యాంకర్లకు, గ్యాస్ డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు.